రామ్‌ధారీ సింగ్ దినకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామ్‌ధారీ సింగ్ దినకర్
1999లో విడుదలైన భారత తపాలా బిళ్లపై దినకర్
పుట్టిన తేదీ, స్థలంరామ్‌ధారీ సింగ్ దినకర్
(1908-09-23)1908 సెప్టెంబరు 23
సిమారియా, బెంగాల్ రాజ్యం, బ్రిటిష్ ఇండియా
(ప్రస్తుతం బీహార్, భారతదేశం )
మరణం1974 ఏప్రిల్ 24(1974-04-24) (వయసు 65)
వృత్తిరచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంటు సభ్యుడు, వ్యాసకర్త, సాహితీ విమర్శకుడు, జర్నలిస్టు
గుర్తింపునిచ్చిన రచనలురశ్మిరాత్రి, హుంకార్
పురస్కారాలు1959:సాహిత్య అకాడమీ పురస్కారం
1959: పద్మభూషణ
1972:జ్ఞానపీఠ్ పురస్కారం

సంతకం

రామ్‌ధారీ సింగ్ 'దినకర్' ( 1908 సెప్టెంబరు 23 - 1974 ఏప్రిల్ 24) హిందీ రచయిత, కవి, వ్యాసకర్త .[1][2] అతను ఆధునిక యుగంలో ఉన్నతమైన వీరరస ప్రధాన కవిగా స్థిరపడ్డాడు. ఇతను ఆధునిక హిందీ కవులలో ఒకరిగా పరిగణించబడ్డాడు.

'దినకర్' స్వాతంత్య్రానికి ముందు తిరుగుబాటు కవిగా గుర్తింపు పొందాడు. స్వాతంత్ర్యం తరువాత అతను 'రాష్ట్రకవి' (జాతీయ కవి) గా గుర్తింపబడ్డాడు.[3] భారత స్వాతంత్ర్య పోరాటంలో దినకర్ మొదట్లో విప్లవాత్మక ఉద్యమానికి మద్దతు ఇచ్చాడు. కాని తరువాత గాంధేయవాది అయ్యాడు. తాను యువతలో కోపం, ప్రతీకార భావాలకు మద్దతునిస్తున్నందున తనకు తాను "బాడ్ గాంధేరియన్"గా చెప్పుకొనేవాడు[4]. కురుక్షేత్రంలో, యుద్ధం వినాశకరమైనదని అతను అంగీకరించాడు కాని స్వేచ్ఛను పరిరక్షించడానికి ఇది అవసరమని వాదించాడు. రాజేంద్ర ప్రసాద్, అనుగ్రహ నారాయణ్ సిన్హా, శ్రీ కృష్ణ సిన్హా, రాంబ్రిక్ష్ బెనిపురి, బ్రజ్ కిషోర్ ప్రసాద్ వంటి జాతీయవాదులతో ఆయన సన్నిహితంగా ఉండేవాడు.

దినకర్ రాజ్యసభకు మూడుసార్లు ఎన్నికయ్యాడు. అతను రాజ్యసభ సభ్యునిగా 1952 ఏప్రిల్ 3 నుండి 1964 జనవరి 26 వరకు కొనసాగాడు[4]. 1959 లో పద్మ భూషణ్ అవార్డు పొందాడు[4]. 1960 ల ప్రారంభంలో భాగల్పూర్ విశ్వవిద్యాలయం (భాగల్పూర్, బీహార్) వైస్-ఛాన్సలర్ గా కూడా పనిచేసాడు.

జీవిత విశేషాలు[మార్చు]

దినకర్ 1908 సెప్టెంబరు 23 న బ్రిటిష్ ఇండియాలోని బెంగాల్ ప్రెసిడెన్సీలోని సిమారియా గ్రామంలో (ఇప్పుడు బీహార్‌లోని బెగుసారై జిల్లాలో) బాబు రవి సింగ్, మన్‌రూప్ దేవి దంపతులకు జన్మించాడు[5]. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలోని తబ్కా గ్రామంలో అతని వివాహం జరిగింది. విద్యార్థిగా అతనికి ఇష్టమైన విషయాలు చరిత్ర, రాజకీయాలు, తత్వశాస్త్రం. పాఠశాలలో, తరువాత కళాశాలలో హిందీ, సంస్కృతం, మైథిలి, బెంగాలీ, ఉర్దూ, ఆంగ్ల సాహిత్యాన్ని అభ్యసించాడు.[6] దినకర్‌ను ఇక్బాల్, రవీంద్రనాథ్ ఠాగూర్, కీట్స్, మిల్టన్ బాగా ప్రభావితం చేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలను బెంగాలీ నుండి హిందీకి అనువదించాడు. దినకర్ కవితాధోరణి భారత స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో తన జీవితంలోని ఒత్తిళ్లు, ప్రతి-ఒత్తిడిల ద్వారా రూపొందించబడింది[4][5]. అతను 5 అడుగుల 11 అంగుళాల ఎత్తు పొడవు గల పొడవైన మనిషి. మెరిసే తెల్లని రంగు, పొడవైన ఎత్తైన ముక్కు, పెద్ద చెవులు, విశాలమైన నుదిటితో అతను గుర్తించదగిన రూపాన్ని కలిగి ఉండేవాడు.[4][5]

ద్వాపర యుగానికి చెందిన మహాభారత చారిత్రక సంఘటన ఆధారంగా రాసిన ప్రబంధ కావ్యం కురుక్షేత్రం ప్రపంచంలోని 100 ఉత్తమ కవితలలో 9 వ స్థానంలో నిలిచింది.[7]

సృజనాత్మక పోరాటం[మార్చు]

దినకర్ తన కౌమారదశలోకి అడుగుపెట్టినప్పుడు, మహాత్మా గాంధీ నాయకత్వంలో భారత స్వాతంత్ర్య ఉద్యమం అప్పటికే ప్రారంభమైంది. 1929 లో, మెట్రిక్యులేషన్ తరువాత, ఇంటర్మీడియట్ అధ్యయనం కోసం పాట్నా కాలేజీలో ప్రవేశించాడు; ఈ ఉద్యమం దూకుడుగా మారింది. 1928 లో దేశవ్యాప్తంగా ప్రదర్శనలు జరుగుతున్న సమయంలో సైమన్ కమిషన్ వచ్చింది. పాట్నాలో కూడా ప్రదర్శనలు జరిగాయి. గాంధీ మైదానంలో ర్యాలీకి వేలాది మంది వచ్చారు. ఇందులో దినకర్ కూడా పాల్గొన్నాడు. సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసన సందర్భంగా, బ్రిటిష్ ప్రభుత్వ పోలీసులు కనికరం లేకుండా లాఠీ చార్జ్ చేసారు. అప్పుడు పంజాబ్ కేసరి లాలా లాజపతి రాయ్ గాయపడ్డాడు. దేశం మొత్తం గందరగోళంలో ఉంది. ఈ ఆందోళనల వల్ల దినకర్ మనస్సు మరింత తీవ్రంగా మారింది. అతను తన భావోద్వేగాలను కవితా రూపంలో రాసాడు.[5]

దినకర్యొ మొదటి కవిత 1924 లో ఛత్రా సహోదర్ (బ్రదర్ ఆఫ్ స్టూడెంట్స్) అనే పేపర్‌లో ప్రచురించబడింది. ఛత్రా సహోదర్ నర్సింగ్ దాస్ సంపాదకత్వంలో స్థాపించబడిన స్థానిక వార్తాపత్రిక. 1928 లో, సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో రైతుల సత్యాగ్రహం గుజరాత్ బార్డోలిలో విజయవంతమైంది. విజయ్-సందేశ్ (మెసేజ్ ఆఫ్ విక్టరీ) పేరుతో పుస్తక రూపంలో ప్రచురించబడిన ఈ సత్యాగ్రహం ఆధారంగా అతను పది కవితలు రాశాడు. ఈ కూర్పు ఇప్పుడు అందుబాటులో ఉంది. పాట్నా కళాశాల ఎదురుగా "యువక్" కార్యాలయం ఉండేది. ప్రభుత్వ ఆగ్రహం నుండి తప్పించుకోవడానికి, దినకర్ తన కవితలను "అమితాబ్" అనే మారుపేరుతో ప్రచురించాడు. 1928 సెప్టెంబరు 14 న, జతిన్ దాస్ బలిదానంపై అతని కవిత ప్రచురించబడింది. ఈ సమయంలో అతను బిర్బాలా, మేఘనాడ్-వాద్ అనే రెండు చిన్న కవితల రచనలు చేసాడు. కాని వాటిలో ఏవీ ఇప్పుడు అందుబాటులో లేవు. 1930 లో, అతను ప్రాన్-భాంగ్ (ప్రతిజ్ఞ ఉల్లంఘన) అనే కవితను రాసి స్వరపరిచాడు. దీనిని రామ్‌చంద్ర శుక్లా తన ఆత్మకథలో పేర్కొన్నాడు. కాబట్టి అతని కవితా వృత్తి ప్రయాణం విజయ్-సందేశ్‌తో ప్రారంభమైనట్లు భావించాలి. దీనికి ముందు అతని కవితలు పాట్నా నుండి ప్రచురించబడిన దేశ్ పత్రికలో తరచూ ప్రచురితమయ్యేవి.[5]

దినకర్ మొట్టమొదటి కవితా సంకలనం రేణుక 1935 నవంబరులో ప్రచురించబడింది[5]. విశాల్ భారత్ సంపాదకుడు బనార్సీ దాస్ చతుర్వేది, హిందీ మాట్లాడే ప్రజలు రేణుక ప్రచురణను వేడుకగా జరుపుకోవాలని రాశాడు.[5] ఈ సమయంలో, చతుర్వేదిజీ సేవాగ్రామ్ వెళ్ళాడు. రేణుక కవితా సంకలనం కాపీని మహాత్మా గాంధీకి ఇచ్చాడు.[5]

ప్రఖ్యాత చరిత్రకారుడు డాక్టర్ కాశీ ప్రసాద్ జైస్వాల్ దినకర్‌ను కొడుకులాగే ప్రేమించినట్లు చెబుతాడు. దినకర్ కవితా వృత్తి ప్రారంభ రోజుల్లో జైస్వాల్ అతనికి అన్ని విధాలుగా సహాయం చేశాడు.[5] జైస్వాల్ 1937 ఆగస్టు 4 న మరణించాడు. ఇది యువ కవికి కష్టం కలిగించింది.[5] తరువాత అతను హైదరాబాద్ నుండి ప్రచురించబడిన "కల్పన" అనే పత్రికలో ఇలా వ్రాశాడు: "జైస్వాల్జీ నా మొదటి ఆరాధకుడు కావడం మంచి విషయం. ఇప్పుడు నాకు సూర్యుడు, చంద్రుడు, వరుణుడు, కుబేరుడు, ఇంద్రుడు, బృహస్పతి, షాచి, బ్రాహ్మణి వంటి వారిలో ఎవరూ జైస్వాల్జీ లాంటివారు కాదని స్పష్టమైంది. అతని మరణ వార్త విన్నప్పుడు, ప్రపంచం నాకు చీకటి ప్రదేశంగా మారింది. ఏమి చేయాలో నాకు తెలియదు. " వాస్తవానికి జైస్వాల్జీ దినకర్ కవిత్వంలో చారిత్రక భావాన్ని మెచ్చుకున్న మొదటి వ్యక్తి.[5]

సాహితీ సేవలు[మార్చు]

అతని రచనలు ఎక్కువగా 'వీర రసం' ప్రధానమైనవి. అయితే అతని రచన ఊర్వశి దీనికి మినహాయింపుగా చెప్పవచ్చు. అతని గొప్ప రచనలలో రష్మీరథి, పరశురామ్ కి ప్రతీక్ష మొదలైనవి ఉన్నాయి. భూషణ్ నుండి 'వీర రసం' ప్రధానమైన గొప్ప హిందీ కవిగా అతను ప్రశంసలు అందుకున్నాడు.[4]

మాతృభాష హిందీ కాని ప్రజలలో అతను బాగా ప్రాచుర్యం పొందాడనీ, ఒకరి స్వంత మాతృభాష ప్రేమకు చిహ్నం అని ఆచార్య హజారీ ప్రసాద్ ద్వివేది రాసాడు.[8]

దినకర్ తన రచనలలో పద్యం, గద్యం, భాషలు, హిందీ సాహితీ సేవలకు గాను నాలుగు జ్ఞానపీఠ్ పురస్కారాలు ప్రదానం చేసి గౌరవించాలని రాసాడు.[8]

దేశంలో విప్లవాత్మక ఉద్యమానికి దినకర్ స్వరం అందిస్తున్నారని రాంబ్రిక్ బెనిపురి రాశాడు.[8]

అతను సామాజిక-ఆర్థిక అసమానతలు, అణగారినవారి దోపిడీని లక్ష్యంగా చేసుకుని సామాజిక, రాజకీయ వ్యంగ్యాస్త్రాలు కూడా రాశాడు.[9]

అతని కురుక్షేత్రం మహాభారతం యొక్క శాంతి పర్వ ఆధారంగా రాసిన ఒక కథనం. రెండవ ప్రపంచ యుద్ధం జ్ఞాపకాలు కవి మనస్సులో తాజాగా ఉన్న సమయంలో ఇది వ్రాయబడింది.[10]

మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధానికి దారితీసిన సంఘటనలపై కంపోజ్ చేసిన మరో కవిత కృష్ణ కి చేతావని. దేశం సరిహద్దులను దాటి కవి సామాజిక ఆందోళనను ప్రతిబింబించే కవితల సంకలనం సమాధేని.[10]

అతని రష్మీరథి హిందూ ఇతిహాసం మహాభారతం ఉత్తమ కథనాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

పురస్కారాలు, గౌరవాలు[మార్చు]

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కాశీ నగ్రి ప్రచారిణి సభ నుండి పురస్కారాలు అందుకున్నాడు. కురుక్షేత్ర ఇతిహాసం రచనకు భారత ప్రభుత్వం నుండి పురస్కారాన్ని అందుకున్నాడు[4]. అతను రసిన ఊర్వశికి 1959 లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.[11] అతను 1959 లో భారత ప్రభుత్వం నుండి పద్మ భూషణ్ గ్రహీత పురస్కారాన్ని అందుకున్నాడు. అతనికి భాగల్పూర్ విశ్వవిద్యాలయం ఎల్ఎల్డి డిగ్రీని ప్రదానం చేసింది. గురుకుల్ మహావిద్యాలయ అతనిని విద్యావాచస్పతిగా సత్కరించారు[4]. 1968 నవంబరు 8 న ఉదయపూర్ లోని రాజస్థాన్ విద్యాపీఠ్ అతనిని సాహిత్య-చూడామణి పురస్కారాన్నిచ్చి సత్కరించింది.[4] అతను రాసిన "ఊర్వశి" నవలకు జ్ఞానపీఠ్ పురస్కారం లభించింది.[12] అతను 1952 లో రాజ్యసభలో నామినేటెడ్ సభ్యుడయ్యాడు. దినకర్ అభిమానులు అతను "రాష్ట్రకవి" (భారత కవి) గౌరవానికి నిజంగా అర్హుడని నమ్ముతారు.

మూలాలు[మార్చు]

 1. जीवनी एवं रचनाएँ अनुभूति पर.
 2. "साहित्य अकादमी पुरस्कार". Archived from the original on 2016-08-07. Retrieved 2020-04-24.
 3. "Special Postage Stamps on Linguistic Harmony of India". Latest PIB Releases. Press Information Bureau of the Government of India. September 1999. Retrieved 26 September 2008.
 4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 4.7 4.8 Vijendra Narayan, Singh (2005). Bharatiya Sahitya ke Nirmata: Ramdhari Singh 'Dinkar'. New Delhi: Sahitya Akademi. ISBN 81-260-2142-X.
 5. 5.00 5.01 5.02 5.03 5.04 5.05 5.06 5.07 5.08 5.09 5.10 Kumar Vikram, Arun Kumar Sinha (2010). Ramdhari Singh Dinkar: Makers of Indian Literature. Sahitya Akademi. p. 151. ISBN 978-81-260-2664-7.
 6. Bhattacharya, Sabyasachi (2011). Rabindranath Tagore: An Interpretation. New Delhi: Penguin/Viking. pp. 320 (at p. 240). ISBN 978-0-670-08455-5.
 7. "Top 100 famous epics of the World" (in ఇంగ్లీష్). Archived from the original on 2013-12-14. Retrieved 9 డిసెంబరు 2013.
 8. 8.0 8.1 8.2 Dinkar, Ramdhari Singh (2008). Chintan ke Aayam. Lokbharti Prakashan.
 9. Lal, Mohan (1992). Encyclopaedia of Indian Literature. Sahitya Akademi. p. 820. ISBN 978-81-260-1221-3.
 10. 10.0 10.1 Das, Sisir Kumar (1995). A History of Indian literature. Sahitya Akademi. p. 908. ISBN 978-81-7201-798-9.
 11. Sahitya Akademi Awards 1955–2007 Archived 2018-08-01 at the Wayback Machine Sahitya Akademi Award Official website.
 12. "Jnanpith Laureates Official listings". Jnanpith Website. Archived from the original on 13 అక్టోబరు 2007. Retrieved 24 ఏప్రిల్ 2020.

బాహ్య లంకెలు[మార్చు]