రామ్‌లీలా మైదానం
2012లో న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగిన వార్షిక రామ్‌లీలా దృశ్యం | |
![]() | |
| Full name | రామ్‌లీలా మైదాన్ న్యూఢిల్లీ |
|---|---|
| Address | న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్, ఢిల్లీ గేట్ న్యూ ఢిల్లీ, ఢిల్లీ |
| Location | న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, ఢిల్లీ గేట్ ల మధ్య |
| Coordinates | 28°38′31″N 77°13′51″E / 28.641892°N 77.230698°E |
| Elevation | 209 మీ. (686 అ.) |
| Public transit | చావ్రీ బజార్ మెట్రో స్టేషన్ |
| Parking |
|
| Type | మల్టీపర్పస్ గ్రౌండ్ |
| Capacity | దాదాపు 25 నుండి 30 వేల మంది వరకు |
| Field shape | చతురస్రం |
| Acreage | 10 ఎకరాలు (0.040 కి.మీ2) |
| Surface |
|
| Current use |
|
| Construction | |
| Built | 1883 |
| Rebuilt | 1930 |
| Years active | 1930 – ప్రస్తుతం |
రామ్‌లీలా మైదాన్, భారతదేశంలోని న్యూఢిల్లీలో ఉన్న ఒక పెద్ద మైదానం, దీనిని సాంప్రదాయకంగా వార్షిక రామ్‌లీలా ప్రదర్శన కోసం ఉపయోగిస్తారు.[1] దీనిని మతపరమైన పండుగలు, ప్రధాన రాజకీయ ర్యాలీలు, సమావేశాలు, వినోద కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. ఇది న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్, ఢిల్లీ గేట్ సమీపంలో ఉంది.
చరిత్ర
[మార్చు]1930కి ముందు రామ్‌లీలా మైదాన్ ఒక పెద్ద చెరువు. దీనిని 1930ల ప్రారంభంలో మట్టితో నింపారు. తద్వారా అక్టోబరులో జరిగే వార్షిక రామ్‌లీలా ఉత్సవాలు కొన్ని ఏళ్ళుగా నిర్వహించే ఎర్రకోట వెనుక యమునా నది ఇసుక మైదానాల నుండి ఇక్కడకు మార్చబడింది. ఇక్కడ మొఘల్ సైన్యానికి చెందిన హిందూ సైనికులు 1800లలో మొదటిసారిగా రామ్‌లీలా కార్యక్రమం ప్రారంభించారు.
ఈ మైదానం పాత ఢిల్లీ, న్యూ ఢిల్లీ ల మధ్య ఉంది. పాత నగరం చారిత్రాత్మక తుర్క్‌మాన్ గేట్ సమీపంలో ఉంది, మైదానం అరుణా అసఫ్ అలీ మార్గ్, జవాహర్ లాల్ నెహ్రూ రోడ్ ల మధ్య విస్తరించి ఉంది.[2] మహాత్మా గాంధీ, జవాహర్ లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, ఇతర అగ్ర జాతీయవాద నాయకులు ఇక్కడ ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించడంతో ఇది రాజకీయ సమావేశాలకు ప్రజాదరణ పొందిన ప్రదేశంగా మారింది. రామ్‌లీలా మైదాన చరిత్రకు గుర్తుగా దాని లోపల ఒక చిన్న చెరువు ఇప్పటికీ ఉంది.
ఇక్కడ ఏర్పాటు చేసిన రామ్‌లీలాను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా ప్రముఖ నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులు సందర్శిస్తారు.[3]
చారిత్రక సంఘటనలు
[మార్చు]1961లో అప్పటి ప్రధాని జవాహర్ లాల్ నెహ్రూ, రాణి ఎలిజబెత్ II భారత పర్యటన సందర్భంగా ఆమెకు స్వాగతం పలుకుతూ బహిరంగ సభను నిర్వహించాడు.[4] భారత చైనా యుద్ధం తరువాత 1963లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా, లతా మంగేష్కర్ "అయే మేరే వతన్ కే లోగో" అనే దేశభక్తి పాటను పాడింది.[5][4] రెండు సంవత్సరాల తరువాత 1965లో, ఇక్కడ జరిగిన బహిరంగ సభలో, అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అనే తన నినాదం వినిపిచ్చాడు.[4]
ప్రతిపక్ష నాయకులతో కలిసి జయప్రకాశ్ నారాయణ్ 1975 జూన్ 25న లక్ష మందికి పైగా పాల్గొన్న భారీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించాడు. ఇందిరా గాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రామ్‌లీలా మైదాన్ లో జరిగిన మొదటి నిరసన ఇది.[6] జయప్రకాశ్ నారాయణ్ అరెస్టుకు ముందు ఇదే చివరి ర్యాలీ.[7]
భారతదేశంలో అత్యవసర పరిస్థితి తొలగించిన వెంటనే, ఫిబ్రవరి 1977లో, అనేక మంది కాంగ్రెస్ వ్యతిరేక నాయకులు జనతా పార్టీ ఏర్పాటు చేయడానికి ఒక ఉమ్మడి వేదికపైకి వచ్చారు. ఈ ఉమ్మడి ర్యాలీని రామ్‌లీలా వద్ద ప్రతిపక్ష నాయకులు జగ్జీవన్ రామ్, మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజపేయి, చరణ్ సింగ్, చంద్ర శేఖర్ నాయకత్వం వహించారు. అప్పటికే అటల్ బిహారీ వాజపేయి ఒక నైపుణ్యం కలిగిన వక్తగా పేరు సంపాదించుకున్నందున, ఇతర వక్తలతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయన ప్రసంగం వినేందుకు వచ్చారు. జనతా పార్టీ తమ మద్దతును అందించిన షాహి ఇమామ్, బుఖారీ సీనియర్ ల ప్రసంగాలు వినడానికి పెద్ద సంఖ్యలో ముస్లింలు కూడా ఈ ర్యాలీకి వచ్చారు.[8]
అన్నా హజారే 2011 అవినీతి వ్యతిరేక పోరాటంలో భాగంగా సభతో పాటు 2013, 2015 లలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రివాల్ ప్రమాణ స్వీకారం ఇక్కడే జరిగాయి.[9][10]
ఇటీవలి సంఘటనలు
[మార్చు]
విదేశాలలో దాచిపెట్టిన నల్లధనాన్ని తిరిగి తీసుకురావడానికి బాబా రాందేవ్ 2011 జూన్ 4న నిరవధిక నిరాహార దీక్షకు కూడా రామ్‌లీలా మైదాన్ వేదికగా ఉంది, దీనికి 65,000 మంది మద్దతుదారులు వచ్చారు.[11] అయితే, జూన్ 6న ఢిల్లీ పోలీసులు పెద్ద బలగంతో కలిసి టియర్ గ్యాస్ షెల్లను విసిరి, ఆ ప్రదేశాన్ని తగలబెట్టారు. తెల్లవారుజామున ఒంటి గంటకు జనాలపై లాఠీ ఛార్జ్ చేయడంతో ఈ సంఘటన హైలైట్ అయింది.[12]
2011లో మళ్ళీ ఆగస్టు నెలలో అవినీతి వ్యతిరేక నిరసనలు జరిగాయి, అయితే ఈసారి కార్యకర్త అన్నా హజారే.
అదే సంవత్సరం నవంబరు నెలలో సామాజిక న్యాయం కోసం మైనారిటీల సమావేశం జరిగింది.[13]
కోవిడ్-19 కేసులు విపరీతంగా పెరగుతుండడంతో ఏప్రిల్ 2021లో, రామ్‌లీలా మైదానంలో పెద్దఎత్తున ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) సౌకర్యాలు కల్పించారు.[14]
మూలాలు
[మార్చు]- ↑ Jha, Manisha (3 June 2011), "Sprawling Ramlila Maidan braces for Baba Ramdev's 'satyagrah'", The Hindu, retrieved 20 August 2011
- ↑ Philip Lutgendorf (1991). The Life of a Text: Performing the Rāmcaritmānas of Tulsidas. University of California Press. pp. 253–. ISBN 978-0-520-06690-8.
- ↑ "This is not the first time Sonia Gandhi participated in Dusshera celebrations at Ramlila Maidan". factly. 10 October 2022. Retrieved 13 October 2024.
- ↑ 4.0 4.1 4.2 "The ground beneath her feet". Livemint. 5 April 2014. Retrieved 5 April 2014.
- ↑ "Unforgettable songs of national fervour". Hindustan Times. 14 August 2008. Archived from the original on 25 April 2013. Retrieved 5 April 2014.
- ↑ "Tryst with history and cries for freedom". The Times of India. 18 August 2011. Archived from the original on 22 September 2012. Retrieved 20 August 2011.
- ↑ "Tryst with history". STAR News. 18 August 2011. Archived from the original on 30 March 2012. Retrieved 20 August 2011.
- ↑ "Ramlila Ground: Tryst with history and cries for freedom". The Economic Times. 18 August 2011. Archived from the original on 21 January 2012. Retrieved 20 August 2011.
- ↑ "Arvind Kejriwal to take Metro to reach Ramlila Maidan". DNA (newspaper). 27 December 2013. Retrieved 29 December 2013.
- ↑ "It's AAP ki Dilli: Arvind Kejriwal takes oath as Delhi chief minister at packed Ramlila Maidan". Hindustan Times. 14 February 2015. Archived from the original on 14 February 2015. Retrieved 14 February 2015.
- ↑ Indo-Asian News Service (4 June 2011). "Government agrees to my demands, but fast on: Ramdev". Manglorean Media. Archived from the original on 12 జూలై 2011. Retrieved 21 July 2011.
- ↑ Press Trust of India (5 June 2011). "30 injured in police sweep at Ramlila Maidan". The Times of India. New Delhi. Archived from the original on 4 January 2012. Retrieved 22 July 2011.
- ↑ "Front seeks greater representation for Muslims". The Hindu. Chennai, India. 28 November 2011.
- ↑ "Delhi govt to add 1,000 ICU beds at Ramlila grounds" (in ఇంగ్లీష్). Hindustan Times. 28 April 2021. Retrieved 25 July 2021.
