Jump to content

రామ్ చరిత్ర నిషాద్

వికీపీడియా నుండి
రామ్ చరిత్ర నిషాద్
రామ్ చరిత్ర నిషాద్


పదవీ కాలం
2014 మే 16 – 2019 మే 23
ముందు తుఫానీ సరోజ్
తరువాత బి.పి. సరోజ్
నియోజకవర్గం మచ్లిషహర్

వ్యక్తిగత వివరాలు

జననం (1964-05-01)1964 మే 1
న్యూఢిల్లీ, భారతదేశం
మరణం 2021 May 3(2021-05-03) (వయసు: 57)
నోయిడా , ఉత్తర ప్రదేశ్, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ సమాజ్‌వాదీ పార్టీ
(2019 ఏప్రిల్ 19 – 2021)
ఇతర రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ (2014-2019)
జీవిత భాగస్వామి అనామిక శర్మ
సంతానం 2
నివాసం న్యూఢిల్లీ, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు
వెబ్‌సైటు kvguruji.com
మూలం [1]

రామ్ చరిత్ర నిషాద్ (1 మే 1964 - 3 మే 2021) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మచ్లిషహర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

రామ్ చరిత్ర నిషాద్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మచ్లిషహర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి బి.పి. సరోజ్ పై 1,72,1554 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై[2] పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ (శాశ్వత ప్రత్యేక ఆహ్వానితులు) సభ్యుడిగా, ఆర్థిక & కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా, రవాణా, పర్యాటక & సంస్కృతిపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, షెడ్యూల్డ్ కులాలు & షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ సభ్యుడిగా పని చేశాడు.

రామ్ చరిత్ర నిషాద్ కు 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఏప్రిల్ 19న భారతీయ జనతా పార్టీని వీడి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సమక్షంలో సమాజ్‌వాది పార్టీలో చేరి మీర్జాపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అప్నా దళ్ (సోనీలాల్) అభ్యర్థి అనుప్రియ పటేల్ చేతిలో 37,810 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

మరణం

[మార్చు]

రామ్ చరిత్ర నిషాద్ కరోనాతో అనారోగ్యానికి గురై నోయిడాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2021 మే 3న మరణించాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "मछलीशहरः लोकसभा में सक्रिय रहे निषाद का क्या जादू चलेगा". आज तक. 8 February 2019. Archived from the original on 17 June 2025. Retrieved 17 June 2025.
  2. "Lok Sabha results: Ten candidates who won by the slimmest of margins" (in ఇంగ్లీష్). The New Indian Express. 25 May 2019. Retrieved 17 June 2025.
  3. "मछलीशहर के पूर्व सांसद और सपा नेता रामचरित्र निषाद का निधन, कुछ दिन पहले कोरोना से हुए थे संक्रमित". Amar Ujala. 3 May 2021. Archived from the original on 17 June 2025. Retrieved 17 June 2025.