రామ్ నాథ్ కోవింద్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

రామ్ నాథ్ కోవింద్ (జననం 1 అక్టోబర్ 1945,ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌ దెహత్‌ జిల్లాలోని డేరాపూర్‌ తహశీల్‌లోని పరాంఖ్‌ గ్రామం ).ప్రస్తుతం బీహార్ 36వ గవర్నర్ గా రామ్ నాథ్ కోవింద్ ఉన్నారు.రామ్ నాథ్ కోవింద్ భారతీయ జనతా పార్టీ కి చెందిన రాజకీయ నాయకులు .1994-2000 మరియు 2000-2006 రెండు నిబంధనల్లో సమయంలో ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభ కు ఎన్నిక అయ్యారు .దిల్లీలొ న్యాయవాదిగా పనిచేసారు. ఇతను బిజెపి దళిత మోర్చా యొక్క మాజీ అధ్యక్షుడు (1998-2002).మరియు ఆల్-ఇండియా కోలి సమాజ్ అధ్యక్షుడు. బిజేపి పార్టీ జాతీయ ప్రతినిధిగా పనిచేశారు. 8 ఆగస్టు 2015 న భారత రాష్ట్రపతి అతన్ని బీహార్ గవర్నర్ గా నియమించారు. 19 జులై 2017 న ఎన్డీయే కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ పేరును భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రకటించారు .