రామ్ పోతినేని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామ్
రామ్ పోతినేని
జననం
పోతినేని రామ్

(1987-05-15) 1987 మే 15 (వయసు 36)[1]
ఇతర పేర్లురామ్
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2006 నుండి ఇప్పటివరకు

రామ్ pothineni, తెలుగు సినిమా నటుడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

రామ్ నిర్మాత "స్రవంతి" రవికిషోర్ తమ్ముడైన మురళి పోతినేని కొడుకు. హైదరాబాదులో పుట్టినా తన విద్యాభ్యాసం తమిళనాడులో చెన్నైలోని చెట్టినాడ్ విద్యాశ్రమం, సెంట్ జాన్ పాఠశాలలో చేసాడు.[2]

సినీ జీవితం[మార్చు]

నట శిక్షకుడు ఎన్.జె. భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు.[3] రామ్ నటించిన మొదటి చిత్రం దేవదాసు. ఇందులో ఇలియానా కథానాయిక. వై.వీ.ఎస్. చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2006 జనవరి 11 న విడుదలై బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాక రామ్ కి ఫిలింఫేర్ సౌత్ - ఉత్తమ నూతన నటుడు అవార్డును అందించింది. తన రెండో చిత్రం సుకుమార్ దర్శకత్వం వహించిన జగడం. ఈ చిత్రం 2007 మార్చి 16 న విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విఫలమైనప్పటికీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందాయి. 2008 లో శ్రీను వైట్ల దర్శకత్వంలో జెనీలియా సరసన రెడీ చిత్రంలో నటించాడు. ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంతో రామ్ పెద్ద హీరోల్లో ఒకడయ్యాడు.[4]

2009 లో రెండు చిత్రాల్లో నటించాడు. ఒకటి బి.గోపాల్ దర్శకత్వంలో మస్కా. ఇందులో హన్సికా మోట్వాని, షీలా కథానాయికలు. మరో చిత్రం ఎం.శరవణన్ దర్శకత్వంలో గణేష్. ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయిక. మస్కా ఓ మోస్తరు విజయం సాధించగా గణేష్ పరాజయం పాలైంది. కానీ ఈ రెండు చిత్రాల్లోనూ రామ్ తన నటనకు ప్రశంసలు సొంతం చెసుకున్నాడు. 2010 లో రామ్ శ్రీవాస్ దర్శకత్వంలో రామ రామ కృష్ణ కృష్ణ చిత్రంలో నటించాడు. ఇందులో ప్రియా ఆనంద్, బిందు మాధవి కథానాయికలు. ఈ చిత్రం కూడా ఓ మోస్తరు విజయాన్ని సొంతం చెసుకుంది. 2011 లో రామ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో కందిరీగ చిత్రంలో నటించాడు. ఇందులో హన్సిక, అక్ష కథానాయికలు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించింది.

2012 లో రామ్ ఏ.కరుణాకరన్ దర్శకత్వంలో ఎందుకంటే...ప్రేమంట! చిత్రంలో నటించాడు. ఇందులో తమన్నా కథానాయిక. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం భారీ పరాజయంగా నిలిచింది కానీ రామ్ మరియూ తమన్నాల నటనకు భారీ ఎత్తున ప్రశంసలు అందాయి.[5] 2013 లో రామ్ భాస్కర్ దర్శకత్వంలో ఒంగోలు గిత్త చిత్రంలో నటించాడు. ఇందులో కృతి కర్బంధ కథానాయిక. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైంది. ఆ తరువాత రామ్ కె. విజయభాస్కర్ దర్శకత్వంలో దగ్గుబాటి వెంకటేష్ తో కలిసి హిందీ చిత్రం బోల్ బచ్చన్ తెలుగు పునః నిర్మాణం అయిన మసాలా లో నటించాడు. అది కూడా ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు.2015 లో గోపిచంద్ మలినేని దర్శకత్వంలో పండగ చేస్కో చిత్తం తో మళ్ళీ విజయాన్ని అందుకున్నాడు. అదే సంవత్సరం శివమ్ అనే సినిమా తో భారీ ప్లాప్ అందుకున్నాడు.2016 లో కిశోర్ తిరుమల దర్శకత్వంలో నేను శైలజ సినిమా తో మరొక విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా లో రామ్ నటన కి మంచి మార్కులు పడ్డాయి. మళ్ళీ అదే సంవత్సరం హైపర్ అనే సినిమా తో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాడు. 2017 లో కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఉన్నది ఒకటే జిందగి అనే సినిమా లో నటించాడు అది కూడా నిరాశ పరిచింది. ప్రస్తుతం త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో హలొ గురు ప్రేమ కోసమే చిత్రంలో నటిస్తున్నాడు.[6]

నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం చిత్రం పాత్ర కథానాయిక ఇతర విశేషాలు
2006 దేవదాసు దేవదాస్ ఇలియానా విజేత, ఫిలింఫేర్ అవార్డ్ సౌత్ - ఉత్తమ నూతన నటుడు
2007 జగడం శీను ఇషా సహాని
2008 రెడీ చందు జెనీలియా పేర్కొనబడ్డాడు, ఫిలింఫేర్ అవార్డ్ సౌత్ - ఉత్తమ నటుడు
2009 మస్కా క్రిష్ హన్సికా
షీలా
2009 గణేష్ గణేష్ కాజల్ అగర్వాల్
2010 రామ రామ కృష్ణ కృష్ణ రామ కృష్ణ ప్రియ ఆనంద్
బిందు మాధవి
2011 కందిరీగ శీను హన్సిక
అక్షా పార్ధసాని
పేర్కొనబడ్డాడు, ఫిలింఫేర్ అవార్డ్ సౌత్ - ఉత్తమ నటుడు
2012 ఎందుకంటే...ప్రేమంట! కృష్ణ
రామ్
తమన్నా
2013 ఒంగోలు గిత్త వైట్ కృతి కర్బంద
2013 మసాలా రామ్ / రహ్మాన్ షాజన్ పదాంసీ
2015 పండగ చేస్కో కార్తీక్ రకుల్ ప్రీత్ సింగ్
2015 శివం రాశి ఖన్నా
2016 నేను శైలజ హరి కీర్తి సురేష్
2016 హైపర్ సూర్య రాశి ఖన్నా
2017 ఉన్నది ఒకటే జిందగీ అభిరామ్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, లావణ్య త్రిపాఠి
2018 హలో గురు ప్రేమకోసమే అనుపమ పరమేశ్వరన్
2019 ఇస్మార్ట్ శంకర్[7] శంకర్
2021 రెడ్ సిద్ధార్థ \ ఆదిత్య
రొమాంటిక్‌ రామ్ అతిధి పాత్రల్లో
2022 ది వారియర్ సత్య ఐ.పి.ఎస్
2023 skanda Bhaskar raju & skanda sreeleela & sai manjrekar

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-09-05. Retrieved 2013-03-18.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-04-07. Retrieved 2013-03-18.
  3. ఎన్టీఆర్, రామ్, నితిన్, ఇలియానా... అందరూ మా శిష్యులే!, ఈనాడు ఆదివారం సంచిక, 4 జనవరి 2015, పుట. 20-21
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-09-18. Retrieved 2013-03-18.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-12-26. Retrieved 2013-03-18.
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-11-04. Retrieved 2013-03-18.
  7. సాక్షి, సినిమా (18 July 2019). "'ఇస్మార్ట్‌ శంకర్‌' మూవీ రివ్యూ". Archived from the original on 18 July 2019. Retrieved 21 July 2019.