రామ్ బరన్ యాదవ్
| రామ్ బరన్ యాదవ్ | |||
| |||
నేపాల్ 1వ అధ్యక్షుడు
| |||
| పదవీ కాలం 2008 జూలై 23 – 2015 అక్టోబర్ 29 | |||
| ప్రధాన మంత్రి | పుష్ప కమల్ దహల్ | ||
|---|---|---|---|
| ఉపరాష్ట్రపతి | పరమానంద్ ఝా | ||
| ముందు | స్థానం ఏర్పాటు (నేపాల్ తాత్కాలిక దేశాధినేతగా గిరిజాప్రసాద్ కొయిరాలా) | ||
| తరువాత | బిద్యా దేవీ భండారీ | ||
నేపాలీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ[1]
| |||
| పదవీ కాలం 2006 – 2008 | |||
| అధ్యక్షుడు | గిరిజాప్రసాద్ కొయిరాలా | ||
| ముందు | గిరిజాప్రసాద్ కొయిరాలా | ||
| తరువాత | ప్రకాష్ మాన్ సింగ్ కృష్ణ ప్రసాద్ సీతౌలా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1948 February 4 సపాహి, ధనుషా, నేపాల్ | ||
| రాజకీయ పార్టీ | నేపాలీ కాంగ్రెస్ (1968–2008) | ||
| జీవిత భాగస్వామి | జులేఖ యాదవ్ | ||
| సంతానం | చంద్ర మోహన్ యాదవ్ చంద్ర శేఖర్ యాదవ్ అనితా యాదవ్ | ||
| పూర్వ విద్యార్థి | PGIMER చండీగఢ్, మెడికల్ కాలేజ్ & హాస్పిటల్, కోల్‌కతా | ||
రామ్ బరన్ యాదవ్ ( మైథిలి : डा. राम वरण यादव ; నేపాలీ : डा. राम वरण यादव; జననం 4 ఫిబ్రవరి 1948)[2] నేపాలీ రాజకీయ నాయకుడు, వైద్యుడు. ఆయన 2008లో గణతంత్ర ప్రకటన తర్వాత 2008 జూలై 23 నుండి 2015 అక్టోబర్ 29 వరకు నేపాల్ మొదటి అధ్యక్షుడిగా పని చేశాడు.[3] ఆయన 1999 నుండి 2001 వరకు ఆరోగ్య మంత్రిగా, నేపాలీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పని చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]రామ్ బరన్ యాదవ్ 1991 నుండి 1994 వరకు ఆరోగ్య శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.[4] ఆయన 1999 ఎన్నికల్లో నేపాలీ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రతినిధుల సభకు ఎన్నికై ఆరోగ్య శాఖ మంత్రి అయ్యాడు.[5][6][7]
రామ్ బరన్ యాదవ్ మే 2007లో జనక్‌పూర్‌లోని యాదవ్ నివాసంపై జనతాంత్రిక్ తెరాయ్ ముక్తి మోర్చా (JTMM) ఉగ్రవాదులు దాడి చేశారు. JTMM ఇంటి వద్ద జప్తు నోటీసును ఉంచి, దానిపై తమ జెండాలను ఎగురవేసి, బాంబు పేల్చింది.[8] ఏప్రిల్ 2008 రాజ్యాంగ అసెంబ్లీ ఎన్నికల్లో యాదవ్ ధనుసా-5 నియోజకవర్గంలో పోటీ చేసి 10,392 ఓట్లను సాధించి ఆ స్థానాన్ని గెలుచుకున్నాడు.[9]
యాదవ్ 21 జూలై 2008న జరిగిన రెండవ రౌండ్ ఓటింగ్‌లో నేపాల్ మొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. రాజ్యాంగ సభలో పోలైన 590 ఓట్లలో 308 ఓట్లు సాధించి, రెండవ రౌండ్ ఓటింగ్‌లో నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) నామినేట్ చేసిన రామ్ రాజా ప్రసాద్ సింగ్‌ను ఓడించాడు.[10] యాదవ్ 2008 జూలై 23న అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు. నేపాల్ ప్రధాన న్యాయమూర్తి కేదార్ ప్రసాద్ గిరి రాష్ట్రపతి భవన్‌లోని శీతల్ నివాస్‌లో యాదవ్‌తో పదవీ ప్రమాణం, గోప్యతా ప్రమాణం చేయించాడు, యాదవ్ ఉపాధ్యక్షుడు పరమానంద ఝాతో కూడా ప్రమాణం చేయించాడు.[11]
యాదవ్ నేపాలీ కాంగ్రెస్ పార్టీలో వివిధ బాధ్యతలను నిర్వర్తించాడు. ఆయన 15 సంవత్సరాలు కేంద్ర వర్కింగ్ కమిటీ సభ్యుడిగా, పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా, పార్టీ క్రమశిక్షణా కమిటీ సభ్యుడిగా పని చేసి, అధ్యక్షుడిగా ఎన్నికయ్యే ముందు నేపాలీ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ ".::::: Nepali Congress Party :::::". www.nepalicongress.org. Archived from the original on 6 May 2008. Retrieved 22 February 2022.
- ↑ "DR. RAM BARAN YADAV PRESIDENT OF THE REPUBLIC OF NEPAL". Office of The President, Nepal. Archived from the original on 2 June 2012.
- ↑ "Physician to become Nepal's first president". International Herald Tribune. 2008-07-22. Retrieved 2008-07-22.
- ↑ [1] Archived 24 మార్చి 2009 at the Wayback Machine
- ↑ Election Commission of Nepal Archived 12 అక్టోబరు 2006 at the Wayback Machine
- ↑ aung bakyu (1999-06-09). "N980412". Myanmargeneva.org. Archived from the original on 2012-03-15. Retrieved 2010-08-09.
- ↑ Front Pages 31 May 1999 / Jestha 17, 2056 Awake Weekly Chronicle (Nepal) Archived 19 జూన్ 2006 at the Wayback Machine
- ↑ "The Tribune, Chandigarh, India - World". Tribuneindia.com. Retrieved 2010-08-09.
- ↑ "Ca Election report". Election.gov.np. Retrieved 2010-08-09.
- ↑ "No Nepali president candidate wins simple majority_English_Xinhua". Big5.xinhuanet.com. 2008-07-19. Archived from the original on 25 April 2009. Retrieved 2010-08-09.
- ↑ "nepalnews.com, President Yadav, VP Jha sworn in". Nepalnews.com. Archived from the original on 12 October 2008. Retrieved 2010-08-09.