Jump to content

రామ్ సహాయ యాదవ్

వికీపీడియా నుండి
హిస్ ఎక్సలెన్సీ
ది రైట్ హానరబుల్
 రామ్ సహాయ యాదవ్
రామ్ సహాయ యాదవ్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2023 మార్చి 20
రాష్ట్రపతి రామ్ చంద్ర పౌడెల్
ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్
ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలి
సుశీల కర్కి (మధ్యంతర)
ముందు నంద కిషోర్ పున్

అటవీ & పర్యావరణ మంత్రి
పదవీ కాలం
2021 అక్టోబర్ 8 – 2022 జూలై 3
అధ్యక్షుడు బిధ్య దేవి భండారి
ప్రధాన మంత్రి షేర్ బహదూర్ దేవుబా
ముందు కృష్ణ గోపాల్ శ్రేష్ఠ
తరువాత ప్రదీప్ యాదవ్

పార్లమెంటు సభ్యుడు , ప్రతినిధి సభ
పదవీ కాలం
2018 మార్చి 4 – 2023 మార్చి 20
ముందు రామచంద్ర యాదవ్
తరువాత ఉపేంద్ర యాదవ్
నియోజకవర్గం బారా 2

రాజ్యాంగ సభ సభ్యుడు
పదవీ కాలం
2008 మే 28 – 2012 మే 28

వ్యక్తిగత వివరాలు

జననం (1971-07-24) 1971 జులై 24 (వయసు: 54)
బస్వరియా తోలే, నేపాల్
ఇతర రాజకీయ పార్టీలు
  • నేపాల్ సద్భావన పార్టీ
  • ఎంజెఎఫ్-ఎన్
  • ఫెడరల్ సోషలిస్ట్ ఫోరం
  • పీపుల్స్ సోషలిస్ట్ పార్టీ, నేపాల్
జీవిత భాగస్వామి చంపా దేవి యాదవ్
సంతానం 3
వెబ్‌సైటు [1]

రామ్ సహాయ ప్రసాద్ యాదవ్ (జననం 24 జూలై 1971) నేపాల్ రాజకీయ నాయకుడు. ఆయన 2023 నుండి నేపాల్ 3వ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. రామ్ సహాయ 2018 నుండి 2023 వరకు నేపాల్ ఫెడరల్ పార్లమెంట్ సభ్యుడిగా, 2022 నుండి 2023 వరకు అటవీ & పర్యావరణ మంత్రిగా పని చేశాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

రామ్ సహాయ ప్రసాద్ యాదవ్ 1971 జూలై 24న నేపాల్‌లోని బస్వారియా తోలేలో జన్మించాడు. యాదవ్ మాధేషి తెగకు చెందినవాడు, అతని కుటుంబం రైతులు. ఆయన బాస్బారియా గ్రామీణ మునిసిపాలిటీలోని శ్రీ నేపాల్ నేషనల్ ప్రైమరీ స్కూల్, కచోర్వాలోని శ్రీ జనతా లోయర్ సెకండరీ స్కూల్‌లో చదువుకున్నాడు. ఆయన 1990లో బీహార్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కౌన్సిల్‌లో సైన్స్ & మ్యాథమెటిక్స్ ISCలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆయన 1993లో SLK కాలేజీ నుండి సైన్స్ బ్యాచిలర్ డిగ్రీని, 1998లో ఠాకూర్ రామ్ మల్టిపుల్ క్యాంపస్ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిగ్రీని పొందాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

యాదవ్ చంపా దేవి యాదవ్‌ను వివాహం చేసుకున్నాడు, వారికీ ముగ్గురు పిల్లలు ఉన్నారు.

రాజకీయ జీవితం

[మార్చు]

రామ్ సహాయ యాదవ్ 1991 నుండి 2008 వరకు కలైయాలోని శ్రీ పన్నాదేవి కన్యా సెకండరీ స్కూల్‌లో సైన్స్ , గణిత ఉపాధ్యాయుడిగా పని చేశాడు.

యాదవ్ 1990లో నేపాల్ సద్భావన పార్టీలో చేరి ఆ పార్టీ 3వ, 4వ & 5వ సమావేశాలకు హాజరయ్యాడు. ఆయన మాధేషి జన అధికార్ ఫోరం, నేపాల్ మొదటి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఫెడరల్ సోషలిస్ట్ పార్టీ, మాధేషి జన అధికార్ ఫోరం, నేపాల్ విలీనం అయ్యి ఫెడరల్ సోషలిస్ట్ ఫోరం, నేపాల్ (FSFN)ను ఏర్పాటు చేశాయి, దీనికి యాదవ్ 2015లో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

యాదవ్ 2008 ఎన్నికల్లో 1వ నేపాల్ రాజ్యాంగ సభలో ఒక స్థానాన్ని గెలుచుకున్నాడు, కానీ 2వ నేపాల్ రాజ్యాంగ సభలో ఒక స్థానాన్ని కూడా గెలుచుకోలేదు. ఆయన 2017 ఎన్నికల్లో నేపాలీ కాంగ్రెస్ నామినీ రాధే చంద్ర యాదవ్‌ను ఓడించి బారా 2 నుండి నేపాల్ ఫెడరల్ పార్లమెంట్ 1వ సెషన్‌కు ఎన్నికయ్యాడు. ఆయన 2022 లో తిరిగి ఎన్నికయ్యాడు.

యాదవ్ ప్రధాన మంత్రి షేర్ బహదూర్ దేవుబా తన మంత్రివర్గంలో అటవీ & పర్యావరణ మంత్రిగా పని చేసి ఆ తరువాత 2023 ఎన్నికల్లో పీపుల్స్ సోషలిస్ట్ పార్టీ, నేపాల్ (PSP-N) నామినీగా యాదవ్ ఉపాధ్యక్ష పదవిని గెలుచుకున్నాడు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. "Ram Sahaya Prasad Yadav elected Nepal's Vice-President". The Economic Times. 17 March 2023. Archived from the original on 14 September 2025. Retrieved 14 September 2025.
  2. "Ram Sahaya Prasad Yadav elected as Vice President of Nepal" (in ఇంగ్లీష్). CNBCTV18. 17 March 2023. Archived from the original on 14 September 2025. Retrieved 14 September 2025.