రామ్ సాగర్ రావత్
రామ్ సాగర్ రావత్ | |||
![]()
| |||
పదవీ కాలం 1999 – 2004 | |||
ముందు | బైజ్‌నాథ్ రావత్ | ||
---|---|---|---|
తరువాత | కమలా ప్రసాద్ రావత్ | ||
నియోజకవర్గం | బారాబంకి | ||
పదవీ కాలం 1989 – 1998 | |||
ముందు | కమలా ప్రసాద్ రావత్ | ||
తరువాత | బైజ్‌నాథ్ రావత్ | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1977 – 1989 | |||
నియోజకవర్గం | సిద్ధౌర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ధనౌలి ఖాస్, బారాబంకి జిల్లా, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | 1951 జూలై 13||
రాజకీయ పార్టీ | సమాజ్‌వాదీ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | జనతా పార్టీ, లోక్‌దళ్ | ||
జీవిత భాగస్వామి | శోభావతి | ||
నివాసం | బారాబంకి | ||
మూలం | [1] |
రామ్ సాగర్ రావత్ (జననం 13 జూలై 1951) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బారాబంకి లోక్‌సభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]
నిర్వహించిన పదవులు
[మార్చు]రామ్ సాగర్ రావత్ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1977 శాసనసభ ఎన్నికలలో సిధౌర్ నియోజకవర్గం నుండి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 1980లో సిధౌర్ నుండి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తర్వాత లోక్‌దళ్‌పార్టీలో చేరి 1986లో లోక్‌దళ్ అభ్యర్థిగా పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 1984లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో లోక్‌దళ్ అభ్యర్థిగా బారాబంకి లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి 1989 లోక్‌సభ ఎన్నికలలో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
రామ్ సాగర్ రావత్ 1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బారాబంకి లోక్‌సభ నియోజకవర్గం నుండి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి రెండవసారి, 1996లో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మూడవసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1998 లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోయి, 1999 లోక్‌సభ ఎన్నికలలో గెలిచి నాల్గొవసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
రామ్ సాగర్ 2004, 2004, 2019 లోక్‌సభ ఎన్నికలలో బారాబంకి లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "4 बार सांसद और 3 बार विधायक रहे रामसागर रावत ने पंचायत चुनाव में ठोकी ताल". ETV Bharat News. 14 April 2021. Archived from the original on 10 June 2025. Retrieved 10 June 2025.
- ↑ "बाराबंकीः BJP ने ढहा दिया था SP-BSP का ये किला, इसलिए राहुल गांधी लॉन्च कर दिया अपने करीबी नेता का बेटा" (in హిందీ). News18 हिंदी. 4 May 2019. Retrieved 10 June 2025.
- ↑ "Barabanki Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 31 May 2025. Retrieved 31 May 2025.