రామ్ సుతార్
| రామ్ సుతార్ | |
|---|---|
అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (కుడి) నుంచి 2016లో పద్మభూషణ్ అవార్డును అందుకున్న సుతార్ (ఎడమ). | |
| జననం | 1925 ఫిబ్రవరి 19 గోండూర్, ధులే, మహారాష్ట్ర, భారతదేశం |
| మరణం | 2025 డిసెంబరు 18 (వయసు: 100) నోయిడా |
| అవార్డులు | 2016 పద్మభూషణ్ 1999 పద్మశ్రీ |

రామ్ వాంజీ సుతార్ (1925 ఫిబ్రవరి 19 - 2025 డిసెంబరు 18)[1][2] ఒక భారతీయ శిల్పి. అతను స్టాట్యూ ఆఫ్ యూనిటీని కూడా రూపొందించాడు, ఇది 182 మీటర్ల (597 అడుగులు) ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం.[3]
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ట్యాంక్‌బండ్ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డా. బి.ఆర్. అంబేద్కర్ స్మృతివనంలో రామ్ సుతార్ రూపొందించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 125 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. 2023 ఏప్రిల్ 14న ఆంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా ముఖ్యముంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాడు.[4][5]
వ్యక్తిగత జీవితం
[మార్చు]సుతార్ 1925 ఫిబ్రవరి 19న మహారాష్ట్రలోని ధులే జిల్లాలోని గోందూర్ గ్రామంలో విశ్వకర్మ కుటుంబంలో జన్మించాడు. 1952లో ప్రమీలను వివాహం చేసుకున్నాడు.[6] ముంబైలోని సర్ జె.జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో శిల్పకళను అభ్యసించి డిగ్రీ పొందాడు.
కెరీర్
[మార్చు]గుజరాత్ రాష్ట్రంలో ఉన్న సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీని సుతార్ నిర్మించాడు. 45 అడుగుల ఎత్తైన చంబల్ స్మారక చిహ్నాన్ని, [7]న్యూఢిల్లీలోని భారత పార్లమెంటు భవనం ఆవరణలో ఉన్న 16 అడుగుల (4.9 మీ) ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహం కాంస్య విగ్రహం రామ్ వి. సుతార్ రూపొందించినదే.ఇది 1993లో ప్రారంభించబడింది. భారత పార్లమెంటు సభ్యుల నిరసనలకు ఒక ప్రసిద్ధ ప్రదేశంగా మారింది.
పురస్కారాలు
[మార్చు]పనులు
[మార్చు]- కురుక్షేత్రంలో కృష్ణార్జునులు, 2008.
- ఐక్యతా ప్రతిమ, 2018
- కర్ణాటకలోని విధాన సౌధ వద్ద మహాత్మా గాంధీ ప్రతిమ, 2014
మరణం
[మార్చు]రామ్ వాంజీ సుతార్ తన వందవ యేట ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నోయిడాలోని కుమారుడి నివాసంలో తుది శ్వాస విడిచాడు.[1]
మూలాలు
[మార్చు]- 1 2 "Ram Suthar: 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' శిల్పి రామ్ సుతార్ కన్నుమూత". EENADU. Retrieved 2025-12-18.
- ↑ "आंतरराष्ट्रीय ख्यातीचे शिल्पकार राम सुतार यांचं वृद्धापकाळानं निधन, शिल्पकलेचा तेजस्वी दीप मालवला". Abp Live (in మరాఠీ). 18 December 2025. Retrieved 18 December 2025.
- ↑ "India unveils the world's tallest statue". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2018-10-31. Retrieved 2021-12-02.
- ↑ "BR Ambedkar: జాతి గర్వించేలా.. జగమంతా కనిపించేలా." EENADU. 2023-04-13. Archived from the original on 2023-04-13. Retrieved 2023-04-13.
- ↑ "CM KCR:దేశమంతా దళిత బంధు ఇచ్చే రోజు వస్తుంది: సీఎం కేసీఆర్". EENADU. 2023-04-14. Archived from the original on 2023-04-14. Retrieved 2023-04-14.
- ↑ "RAM SUTAR AND ANIL SUTAR SCULPTORS". ramsutar.in. Archived from the original on 2020-07-30. Retrieved 2021-12-02.
- ↑ "'Statue of Unity' To Be Completed In 2 Years: Renowned Sculptor Ram Sutar". NDTV.com. Retrieved 2021-12-02.
- ↑ "Tagore Awards for Cultural Harmony: Manipuri dancer, Bangladeshi sculptor among recipients". The Indian Express (in ఇంగ్లీష్). 2018-10-26. Retrieved 2021-12-02.