రామ రాజశేఖర
| రామ రాజశేఖర | |||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|
| రాజా రాజధిరాజ | |||||||||
బృహదీశ్వర ఆలయంలో చేరమాన్ పెరుమాళ్ నాయనార్ (సాధారణంగా రాజశేఖరుడిగా గుర్తించబడతారు) చిత్రీకరణ. | |||||||||
| చేర రాజ్య పాలకుడు[1] | |||||||||
| పరిపాలన | సా.శ. 870/71 – సుమారు 883/84 ? | ||||||||
| పూర్వాధికారి | స్థాణు రవి కులశేఖర | ||||||||
| ఉత్తరాధికారి | విజయరాగ | ||||||||
| |||||||||
| రాజ్యం | చేర (మధ్యయుగ కేరళ) | ||||||||
| మతం | హిందూ మతం (శైవం) | ||||||||
రామ రాజశేఖర (పాలన సుమారు సా.శ. 870/71 – 883/84?) దక్షిణ భారతదేశం, కేరళ ప్రాంతానికి చెందిన మధ్యయుగ చేర పాలకుడు.[2][3][4] భక్తి సంప్రదాయంలో పూజించబడే శైవ (నాయనార్) కవి, సంగీతకారుడు చేరమాన్ పెరుమాళ్ నాయనార్‌గా చరిత్రకారులు సాధారణంగా రాజశేఖరుడిని గుర్తిస్తారు.[4][3][1]
రాజశేఖర సుమారు సా.శ. 870/71లో స్థాణు రవి కులశేఖర తరువాత అధికారంలోకి వచ్చినట్లు భావిస్తున్నారు.[2][5] వసుభట్ట రచించిన యమక కావ్యాలు "త్రిపురదహన", "సౌరికథోదయ" రాజశేఖరుని పోషణలో రూపొందాయి.[6] కురుమత్తూరు (అరిక్కోడ్), తిరువట్రువాయి (వాళప్పల్లి) నుండి లభించిన రెండు ఆలయ శాసనాలు రాజశేఖర రాజును ప్రస్తావించాయి.[2] వీటిలో మొదటిది మధ్యయుగ కేరళ చేర పెరుమాళ్ పాలకుని ఏకైక రాజ ప్రశస్తిని కలిగి ఉంది. ఇది రాజవంశాన్ని పురాణ సూర్య వంశానికి ముడిపెడుతుంది.[7]
రాజశేఖర తన పాలన చివరిలో సింహాసనాన్ని త్యజించి, చేరమాన్ పెరుమాళ్ నాయనార్‌గా పిలువబడే శైవ నాయనార్‌గా మారాడని భావిస్తారు.[2] ఇతని తరువాత విజయరాగ (సుమారు సా.శ. 883/84 - 895) పాలకుడయ్యాడు.[2]
ఆధారాలు
[మార్చు]శంకరునితో సంబంధం
[మార్చు]విద్యారణ్యుని "శంకరవిజయ"లో ప్రసిద్ధ హిందూ తత్వవేత్త ఆది శంకరుని సమకాలీనుడిగా "రాజశేఖర" అనే కేరళ రాజు ప్రస్తావన ఉంది.[6] అదేవిధంగా శంకరునికి ఆపాదించబడిన "శివానందలహరి" పరోక్షంగా కేరళ పాలకుడిని "రాజశేఖర"గా పేర్కొంటుంది.[8]
లఘుభాస్కరీయవ్యాఖ్యా
[మార్చు]సా.శ. 869/70 ప్రాంతంలో రాజు స్థాణు రవి కులశేఖర ఆస్థానంలో రచించిన గణితశాస్త్ర వ్యాఖ్యానం "లఘుభాస్కరీయవ్యాఖ్యా"లో "రామదేవ" అనే చేర పాలకుడు ప్రస్తావించబడ్డాడు. గూఢచారుల నుండి సమాచారం అందుకున్న తర్వాత ఇతను శత్రువులతో పోరాడటానికి బయలుదేరాడని వర్ణన ఉంది.[9] కొంతమంది పండితులు ఈ "రామదేవ"ను రామ రాజశేఖరుడిగా గుర్తిస్తారు.[10] లఘుభాస్కరీయవ్యాఖ్యాలోని 4వ అధ్యాయంలో రామదేవ రాజుగా ("రాజా"), సూర్యవంశ సభ్యుడిగా ("రవి-కుల-పతి") వర్ణించబడ్డాడు.[9]
వసుభట్ట పోషకుడు
[మార్చు]మధ్యయుగ కేరళ ప్రముఖ యమక కవి వసుభట్ట తన రచనలు "త్రిపురదహన", "సౌరికథోదయ"లలో తన పోషకుడైన రాజును "రామ" అని పేర్కొన్నాడు.[6]
"త్రిపురదహన" కావ్యం రాముని "రాజశేఖర" అని కూడా సూచిస్తుంది:[6]
కవులచే నమస్కరించబడే, ఎవరి సైన్యాన్ని చూస్తే శత్రు రాజులు చెల్లాచెదురవుతారో, దుష్టులను శిక్షించడంలో ఎంత స్థిరంగా ఉంటారో ధర్మాత్ములను ఆదుకోవడంలో అంత సిద్ధంగా ఉంటారో, ఎవరి ప్రవర్తన నిందలకు అతీతమో, ఐశ్వర్యంలో (భూతిధర = విభూతి ధరించినవాడు) అగ్రగణ్యుడిగా (రాజశేఖర = శివుడు) కీర్తించబడ్డాడో... అటువంటి రాజు పాలనలో...
వసుభట్ట రాసిన మరొక కావ్యం "యుధిష్ఠిరవిజయ" తన పోషక రాజు బిరుదు "కులశేఖర" అని పేర్కొంటుంది.[11] కేరళ ఆవిర్భావం గురించిన కేరళోత్పత్తి పురాణాలలో మొదటి చేర పాలకుడు (చేరమాన్ పెరుమాళ్) వసుభట్ట సమకాలీనుడిగా వర్ణించబడ్డాడు. అదే గ్రంథంలో వసుభట్ట కులశేఖర రాజు ఆస్థానకవిగా, మహాభారత భట్ట శిష్యుడిగా కూడా చిత్రించబడ్డాడు.[12]
యుధిష్ఠిరవిజయకు సంబంధించిన రెండు తరువాతి వ్యాఖ్యానాలు — అచ్యుత రాసిన "విజయదర్శిక", శివదాస రాసిన "రత్నప్రదీపిక" — "రామ" అనేది రాజు వ్యక్తిగత పేరు అని, "కులశేఖర" అనేది అతని బిరుదు అని వాదించాయి.[6] అయితే ఆధునిక పండితులు ఈ వ్యాఖ్యానకర్తలు చేర పాలకుల కాలానికి చాలా తర్వాత జీవించినందున వారు స్థాణు రవి కులశేఖరను రామ రాజశేఖరుడితో పొరబడి ఉంటారని భావిస్తున్నారు.[11] కొంతమంది పండితులు తరువాతి కాలపు చేర పాలకుడైన రామ కులశేఖరను కవి వసుభట్ట పోషకుడిగా గుర్తిస్తూ వసుభట్టను 11-12వ శతాబ్దాలకు చెందినవాడిగా భావిస్తారు.[13] అయితే అనేక కారణాల వల్ల ఈ అభిప్రాయం ఆమోదయోగ్యం కాదని సాధారణంగా పరిగణించబడుతుంది.[14]
రాజశేఖరుడిని థామస్ ఆఫ్ కానా రాగి శాసనాలలో ప్రస్తావించబడిన "కో-క్వా-రంగోన్" (Co-qua-rangon) అనే రాజుగా కూడా తాత్కాలికంగా గుర్తిస్తారు.[15]
శాసన ఆధారాలు
[మార్చు]| తేదీ | పాలనా సంవత్సరం | భాష, లిపి | ప్రదేశం | విషయాలు | |||
|---|---|---|---|---|---|---|---|
| స్వభావం | వివరాలు | ||||||
| సా.శ. 871[16] | వర్తించదు | గ్రంథ లిపి (సంస్కృతం)[17] | రాజ ప్రశస్తి[18] |
||||
| సా.శ. 750 - 850[22] | 12[23] | వట్టెళుత్తు, గ్రంథ/దక్షిణ పల్లవ గ్రంథ అక్షరాలు (ప్రారంభ మలయాళం)[23] |
|
ఆలయ కమిటీ తీర్మానం[23] |
| ||
మూలాలు
[మార్చు]- 1 2 3 Narayanan, M. G. S. (2013) [1972]. Perumals of Kerala. Thrissur (Kerala): CosmoBooks. pp. 64–65.[permanent dead link]
- 1 2 3 4 5 6 7 Devadevan, Manu (2014). "Changes in Land Relations during the Decline of the Cera State". In V., Kesavan; Davis Jr., D. R. (eds.). Irreverent History: Essays In Honour Of M. G. S. Narayanan. New Delhi: Primus Books. pp. 58 and 74–75.
- 1 2 Karashima, Noburu (2014). "States in the Deccan and Kerala". A Concise History of South India: Issues and Interpretations. Oxford University Press. pp. 145–47.
- 1 2 Veluthat, Kesavan (2017). "The Temple and the State in Medieval South India". Studies in People's History. 4 (1): 15–23. doi:10.1177/2348448917693729. S2CID 158422635.
- 1 2 Veluthat, Kesavan (2004). "Mahodayapuram-Kodungallur". South Indian Horizons. École française d'Extrême-Orient. pp. 471–85.
- 1 2 3 4 5 Unni, N. P. (1965). "Kulasekhara Varman - His Date and Identity". Kulasekhara Varman and his Works. University of Kerala. pp. 16–20. hdl:10603/175255.
- ↑ Varier, M. R. Raghava, ed. (2021). "Kurumathur Prasasthi of Rama Rajasekhara". Kerala Archaeological Series. 2. Trivandrum: Department of Archaeology, Government of Kerala: 45–47.
- ↑ Narayanan, M. G. S. (2013) [1972]. Perumals of Kerala. Thrissur (Kerala): CosmoBooks. pp. 64 and 77. Archived from the original on 2023-09-24. Retrieved 2026-03-09.
- 1 2 Narayanan, M. G. S. (2013) [1972]. Perumals of Kerala. Thrissur (Kerala): CosmoBooks. pp. 64–66 and 78–79. Archived from the original on 2023-09-24. Retrieved 2026-03-09.
- ↑ Narayanan, M. G. S. (2013) [1972]. Perumals of Kerala. Thrissur (Kerala): CosmoBooks. pp. 79–80. Archived from the original on 2023-09-24. Retrieved 2026-03-09.
- 1 2 Veluthat, Kesavan (1982). "The Status of the Monarch". Proceedings of the Indian History Congress. 43: 147–157. JSTOR 44141225.
- ↑ Narayanan, M. G. S. (2013) [1972]. Perumals of Kerala. Thrissur (Kerala): CosmoBooks. pp. 91–92. Archived from the original on 2023-09-24. Retrieved 2026-03-09.
- ↑ Vielle, Christophe (2012). "Real and Ideal Kings in Matrilineal Kerala". Religions of South Asia. 5 (1): 365–387. doi:10.1558/rosa.v5i1/2.365. hdl:2078.1/129594.
- ↑ Devadevan, Manu V. (2020). "The Semantic Universe of the Kudiyattam Theatre". The 'Early Medieval' Origins of India. Cambridge University Press. pp. 229–30.
- ↑ Narayanan, M. G. S. (2013) [1972]. Perumals of Kerala. Thrissur (Kerala): CosmoBooks. pp. 302–303. Archived from the original on 2023-09-24. Retrieved 2026-03-09.
- ↑ Varier, M. R. Raghava, ed. (2021). "Kurumathur Prasasthi of Rama Rajasekhara". Kerala Archaeological Series. 2. Trivandrum: Department of Archaeology, Government of Kerala: 45–47.
- 1 2 3 Veluthat, Kesavan (2018). "History and Historiography in Constituting a Region". Studies in People's History. 5 (1): 13–31. doi:10.1177/2348448918759852. S2CID 166060066.
- ↑ Varier, M. R. Raghava, ed. (2021). "Kurumathur Prasasthi of Rama Rajasekhara". Kerala Archaeological Series. 2. Trivandrum: Department of Archaeology, Government of Kerala: 45–47.
- 1 2 Tewari, Rakesh, ed. (2016). "Chera Inscription, Kurumattur, District Allapuram" (PDF). Indian Archaeology – A Review. 2010–2011. Archaeological Survey of India: 118. Archived from the original (PDF) on 2024-10-13. Retrieved 2026-03-09.
- ↑ Devadevan, Manu V. (2020). "Changes in Land Relations and the Changing Fortunes of the Cēra State". The ‘Early Medieval’ Origins of India. Cambridge University Press. p. 128.
- ↑ Varier, M. R. Raghava, ed. (2021). "Kurumathur Prasasthi of Rama Rajasekhara". Kerala Archaeological Series. 2. Trivandrum: Department of Archaeology, Government of Kerala: 45–47.
- 1 2 Rao, T. A. Gopinatha (ed.). "An Inscription of Rajasekhara". Travancore Archaeological Series. 2 (2). Government of Travancore: 8–14.
- 1 2 3 4 5 6 7 8 Narayanan, M. G. S. (2013) [1972]. Perumals of Kerala. Thrissur (Kerala): CosmoBooks. p. 435.[permanent dead link]
బయటి లింకులు
[మార్చు]- Mathew, Alex - Political identities in History (2006) Unpublished Doctoral Thesis (M. G. University)