రాయదుర్గం, హైదరాబాదు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాయదుర్గం
సమీపప్రాంతం
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామేడ్చెల్-మల్కాజ్‌గిరి
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500062
లోక్‌సభ నియోజకవర్గంశంషాబాదు
శాసనసభ నియోజకవర్గంజూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ
సివిక్ ఏజెన్సిహైదరాబాదు మహానగరపాలక సంస్థ

రాయదుర్గం, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ భాగమైన ఈ రాయదుర్గం, ఐటి హబ్‌కు దగ్గరగా ఉంది.[1][2][3]

సమీప ప్రాంతాలు

[మార్చు]

దీనికి చుట్టుపక్కల షేక్‌పేట, హైటెక్ సిటీ, మణికొండ, జూబ్లీ హిల్స్, పుప్పలగూడ, టింబర్ లేక్ కాలనీ, చిత్రపురి కాలనీలు ఉన్నాయి.

రవాణా

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుండి రాయదుర్గానికి సిటీ బస్సు సర్వీసులు ( షేక్‌పేట్ దర్గా బస్టాప్, మధుర నగర్ కాలనీ, హెచ్.ఎస్. దర్గా, ఓ.యు. కాలనీ బస్టాప్ మీదుగా 217ఎ, 102ఆర్, 49ఇ, 102హెచ్, 102వా, 203, 102ఎన్, 116, 222, 28, 102ఎఫ్, 142ఎస్, 65ఎస్ మొదలైన నంబర్లు కలవి) నడుపబడుతున్నాయి. ఇక్కడ రాయదుర్గం మెట్రో స్టేషను కూడా ఉంది.[4][5] ఇక్కడికి 6 కి.మీ.ల దూరంలో బోరబండ రైల్వే స్టేషను, 24 కి.మీ.ల దూరంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.

వాణిజ్యకేంద్రం

[మార్చు]

రాయదుర్గం పరిధిలోని ఐటీ కారిడార్ ప్రాంతంలో టీ హబ్ 2, టీ వర్క్స్‌, ఇమేజ్ టవర్ సంస్థలు ఉన్నాయి.

మూలాలు

[మార్చు]