Jump to content

రాయలసీమ హాస్య కథలు

వికీపీడియా నుండి

రాయలసీమ హాస్య కథలు (కథా సంకలనం)

[మార్చు]

రాయలసీమ హాస్య కథలను పాఠకులకు పరిచయం చేయడం కోసం డా. ఎం. హరికిషన్ గారి సంపాదకత్వలో ఈ కథా సంకలనం రూపొందించబడింది. 2022 జూన్ లో దీప్తి ప్రచురణలు విజయవాడ వారు ఈ సంకలనాన్ని ప్రచురించారు. ఇందులో రాయలసీమ రచయితలులు రాసిన 44 కథలు ఉన్నాయి.

సంకలనకర్త డా.ఎం.హరి కిషన్ ఈ సంకలనం గురించి తెలియజేస్తూ రాయలసీమ రచయితల వస్తు వైవిధ్యాన్ని సాహితీ ప్రేమికులకు అందించడం కోసం నేను చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఈ హాస్యకథల సంకలనం. ఈ పని మొదలు పెట్టాక నాకు అర్థమయిన విషయం ఏమిటంటే హాస్య కథలు వెదకడం అంత సులభం కాదని. రాయలసీమలోనే కాదు తెలుగు నేల మొత్తంలో గూడా హాస్య రచయితలను వేళ్ళమీద లెక్కబెట్టవచ్చు. హాస్య రచనలుగా పేర్కొనే చాలా వాటిని చదివినప్పుడు నవ్వు పెదవిగూడా దాటదు. రాయలసీమ రచయితల ప్రధాన దృష్టి సామాజిక చిత్రణే అయినప్పటికీ ఒకటి రెండు కథలు కొన్ని కలాల నుంచి అప్పుడప్పుడు వెలువడ్డాయి. అటువంటి వాటిలోంచి ఆరోగ్యకరమైన హాస్య్యాన్ని అందించే 44 కథల్ని ఏరి మీ ముందుకు తెస్తున్నాను. ఇందులో పగలబడి నవ్వించేవి, చిరునవ్వులు తెప్పించేవి ఎన్నున్నాయో పాఠకులే తేల్చాలి. ఈ పుస్తకం సమగ్ర సంకలనమేమీ కాదు. వివిధ దశల్లో వచ్చిన, నాకు నచ్చిన కొన్ని కథల్ని మాత్రమే ఈ సంకలనంలోకి తీసుకున్నాను. కొన్ని కథలు నా దృష్టికి వచ్చినా రచయితల నుంచి సకాలంలో అందకపోవడం చేత ప్రచురించలేక పోయాను అని తెలియజేశారు.

సంపాదకుడు:== డా.ఎం. హరికిషన్ - కర్నూలు

[మార్చు]

ప్రధాన వ్యాసం: ఎం. హరికిషన్

ఈ సంకలనంలోని కథలు - కథా రచయితలు

[మార్చు]

1. అతిథి దేవోభవ - ఆదోని బాష          

2. అదివో... అల్లదివో .... - చిలుకూరి దీవెన      

3. ఆషాడం పెళ్ళి     -     తరిమెల అమరనాథ్‌ రెడ్డి      

4. ఇంతింతై కప్పడింతై    - ఎస్‌.వి.ప్రసాద్‌      

5. ఉండు నాయనా దిష్టితీస్తా    -  జిల్లేళ్ళ బాలాజీ  

6. ఏడుకొండలు ఎలక్షన్‌ డ్యూటీ    - రాచపూటి రమేష్‌  

7. కొత్త పెళ్ళాం ముక్కుపుడక    - ఆర్‌.సి.కృష్ణస్వామి రాజు  

8. కారణం?    -     డా.లక్ష్మీ రాఘవ    

9. గజారోహణం    - ఎస్‌.డి.వి.అజీజ్‌       

10. గ్రహబలం    - టి.సురేష్‌ బాబు        

11. చిన్ని - సుంకోజి దేవేంద్రాచారి              

12. చెల్లని నోటు    -     డి.కె.చదువుల బాబు      

13. చంద్రికలు    -     డా.కె.చంద్ర మౌళిని      

14. ఛత్రపతి -     కలువకొలను సదానంద      

15. జూసి...    - సడ్లపల్లె చిదంబర రెడ్డి      

16. జెండాపై కపిరాజు    - ఇనాయతుల్లా    

17. తమాయించిన మూలింటవ్వ    - ఆచార్య మహాసముద్రం దేవకి  

18. తులామానం     -     ఎం.వి.రమణా రెడ్డి      

19. తెలు(గు)గోడు -     నాయుని కృష్ణమూర్తి      

20. దెయ్యం    - జి.ఆర్‌.మహర్షి          

21. నేనూ ఓ కాకిని -     వై.సి.పి.వెంకట రెడ్డి      

22. నేతి జిడ్డు    - సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి          

23. పనసకాయ దొంగలు    - గోపిని కరుణాకర్‌    

24. పేరు పేపరు    - డా.శైల కుమార్‌          

25. ఫిర్యాదు    - మధురాంతకం నరేంద్ర          

26. బదిలీ -     కె.ఎ.ముని సురేష్‌ పిళ్ళై          

27. బాబోయ్‌ పాము -     టి.ఎస్‌.ఎ. కృష్ణమూర్తి        

28. బాన గొర్రెలు     -  ఎండపల్లి భారతి        

29. భానుమూర్తి భాషాభిమానం    - తంగిరాల మీరా సుబ్రమణ్యం  

30. భువన విజయం    - ఎం.ఆర్‌.అరుణకుమారి      

31. బేకారు యోగం    - వియోగి      

32. మాయ    -     డా.కొమ్మిశెట్టి మోహన్‌    

33. మేమూ తెలుగువాళ్ళమే - కల్లూరు రాఘవేంద్రరావు      

34. మోసగాళ్ళ దేశం    - డా.ఎం.హరి కిషన్‌      

35. రోబో న్యూవర్షన్‌    -     పేట యుగంధర్‌  

36. సన్మానం    - మధురాతకం రాజారాం          

37. సియ్యల పండగ    - తవ్వా ఓబుల్‌ రెడ్డి        

38. స్వీయ మానసిక సెలెబ్రిటి    - జంధ్యాల రఘుబాబు  

39. సుబ్బు ఐడియా    - పేరూరు బాలసుబ్రమణ్యం      

40. సొమ్మొకడిది - సోకెవడిది    - జి.ఉమా మహేశ్వర్‌    

41.సైన్‌ ఫ్లో    - సాహిత్య ప్రకాశ్‌        

42. సౌండు కాంట్రాక్టరు గారిల్లు    - ఎ.జయలక్ష్మి రాజు  

43. శ్యామ సుందరీయం    - డా.వి.ఆర్‌.రాసాని      

44. శ్రీవారూ తాళం చెవి    - చిలుకూరి దేవపుత్ర