రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్

వికీపీడియా నుండి
(రాయల్ ఛాలెంజర్స్ బెంగలూర్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ప్రాతినిధ్యం వహిస్తున విరాట్ కోహ్లి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలలో బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు. ఈ జట్టుకు విరాట్ కోహ్లి ప్రాతినిధ్యం వహిస్తుండగా డానియల్ వెటోరీ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

ఈ జట్టు ఇప్పటి దాకా ఏ ఐపిఎల్ ఫైనల్ గెలుచుకోలేదు కానీ 2009, 2016 సంవత్సరాల మధ్యలో మూడు సార్లు రన్నరప్ గా నిలిచింది. చెప్పుకోదగిన ఆటగాళ్ళున్నా ఇప్పటిదాకా ఒక్కసారి కూడా కప్ గెలవకపోవడం వల్ల వీళ్ళని అండర్ అచీవర్స్ గా పరిగణించబడుతున్నారు.[1][2]

ఐ.పి.ఎల్ లో అత్యధిక (263/5), అత్యల్ప (49) పరుగులు సాధించిన రెండు రికార్డులు ఈ జట్టు పేరుమీదనే ఉండటం గమనార్హం.

చరిత్ర[మార్చు]

సెప్టెంబరు 2007 లో భారత క్రికెట్ బోర్డు నియంత్రణ మండలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏర్పాటును ప్రకటించింది. 2008 నుంచి మొత్తం ఎనిమిది జట్ల మధ్య 20-20 ఆటల పోటీలు జరుగుతాయని ప్రకటించింది.[3] ఈ ఎనిమిది జట్లు భారతదేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల నుంది ప్రాతినిథ్యం వహిస్తాయని పేర్కొంది. ఇందులో బెంగళూరు కూడా ఒకటి. ఈ జట్ల కోసం ఫిబ్రవరి 20, 2008 న వేలం నిర్వహించగా బెంగళూరు జట్టును విజయ్ మాల్యా 111.6 మిలియన్ డాలర్లు చెల్లించి కొనుగోలు చేశాడు. ఇది రెండో అతిపెద్ద మొత్తం కాగా మొదటిది ముంబై జట్టు కోసం రిలయన్స్ చెల్లించింది.

మూలాలు[మార్చు]

  1. Veerappa, Manuja (24 August 2019). "Sanjay Bangar may be named RCB batting coach". The Times of India. Retrieved 22 November 2019.
  2. Ananthanarayanan, N (28 May 2018). "IPL 2018: Royal Challengers Bangalore aim to shed underachievers tag". Hindustan Times. Retrieved 22 November 2019.
  3. "Franchises for board's new Twenty20 league". ESPNcricinfo. 13 September 2007. Retrieved 6 June 2013.

బయటి లింకులు[మార్చు]