హరిశ్చంద్ర రాయల

వికీపీడియా నుండి
(రాయల హరిశ్చంద్ర నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
హరిశ్చంద్ర రాయల

డా. హరిశ్చంద్ర రాయల రంగస్థల, టి.వి., సినీ నటుడు, రంగస్థల దర్శకుడు, రూపశిల్పి.[1] 30 సంవత్సరాలుగా తెలుగు నాటకరంగంలో కృషి చేస్తున్నారు. అంతేకాకుండా భారత దేశములోనే మేకప్, కాస్ట్యూమ్స్ అంశాలపై పిహెచ్డి చేసిన మొదటి వ్యక్తి హరిశ్చంద్రే.[2]

జననం[మార్చు]

హరిశ్చంద్ర వెంకటలక్ష్మి, హెచ్. రామాంజనేయులు దంపతులకు 1965, మే 6అనంతపురం జిల్లా లోని గుంతకల్ లో జన్మించారు. గుంతకల్ లోనేపాఠశాల, కళాశాల విధ్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. గుంతకల్ ఎస్.కె.పి. ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదివారు.[3]

రంగస్థల ప్రస్థానం[మార్చు]

హరిశ్చంద్ర తండ్రి హెచ్. రామాంజనేయులు రైల్వే ఉద్యోగిగా పనిచేసేవారు. ఆయన రంగస్థల నటులు, దర్శకులు కూడా. రామాంజనేయులు రైల్వేలో పనిచేస్తూనే తరచుగా నాటకాల్లో నటించి ఎంతో పేరుతెచ్చుకున్నారు.[2] తనలాగే తన కుమారుడు కూడా నాటకరంగంలో పేరు తెచ్చుకోవాలని చిన్నతనం నుంచి ఎంతో ప్రోత్సహించారు. అలా తండ్రి ప్రోత్సాహంతో హరిశ్చంద్ర ఎనిమిదవ తరగతి నుంచి పాఠశాలల్లో నాటకాలు వేస్తూ, నాటకాల పోటీల్లో నటించి ఉత్తమ రంగస్థల నటునిగా పేరుతెచ్చుకున్నారు.

1986, 87, 88 సంవత్సరాల్లో గుంటూరు లోని హిందూ కాలేజీ గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా నాటకాల పోటీలను నిర్వహించారు. ఆ మూడు సంవత్సరాలల్లో ప్రదర్శించిన నాటకాల్లో నటించి మూడు సంవత్సరాల పాటు ఉత్తమ రంగస్థల నటునిగా అవార్డులు అందుకున్నారు. 1983లో రంగస్థల నటులు ఆనంద్ వద్ద నటనలో శిక్షణ పొంది సాంఘిక నాటకాల నటనలో మెలకువలను నేర్చుకున్నారు. ఆ తరువాత అట్లూరి బలరామయ్య (రంగస్థల, సినీనటులు పుండరీకాక్షయ్య సోదరుడు) వద్ద కూడా నటనలో మెలకువలను నేర్చుకున్నారు. తన తండ్రి మిత్రులైన కోటేశ్వరరావు దగ్గర మేకప్ లో శిక్షణ పొందారు.

సెంట్రల్ యూనివర్సిటీ థియేటర్ ఆర్ట్స్ లో చేరిక[మార్చు]

తన తండ్రికి హైదరాబాద్ బదిలీ అవడంతో 1990వ సంవత్సరంలో హరిశ్చంద్ర హైదరాబాద్ కు వచ్చి హైదరాబాదు విశ్వవిద్యాలయము లో పిజి డిప్లొమా ఇన్ యాక్టింగ్ కోర్సు చేశారు. ఆ తర్వాత అదే యూనివర్సిటీలో ఎం.ఎ. థియేటర్ ఆర్ట్స్ పూర్తిచేశారు. 1995లో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టు(నెట్) ను పాసై, లెక్చరర్ కావడానికి అర్హత పొందారు.

మేకప్, కాస్ట్యూమ్స్ పై పరిశోధన[మార్చు]

2000లో ప్రొఫెసర్ సుధాకర్ రెడ్డి పర్యవేక్షణలో ‘‘చిందు భాగవతంలో మేకప్, కాస్ట్యూమ్స్’’ అనే అంశంపై పి.హెచ్డి పరిశోధన చేసి, భారతదేశంలోనే మేకప్, కాస్ట్యూమ్స్ పై పరిశోధన చేసిన మొదటివ్యక్తిగా హరిశ్చంద్ర పేరు తెచ్చుకున్నారు. ఈ పరిశోధన చేస్తున్న సమయంలో డి.ఎస్.ఎన్. మూర్తి, మొదలి నాగభూషణశర్మ, చాట్ల శ్రీరాములు, తల్లావజ్ఝుల సుందరం, భాస్కర్ శివాల్కర్, ఎన్.జె. భిక్షు, డాక్టర్ ప్రసాదరెడ్డి, డి. యస్. దీక్షితులు వంటి పలువురు రంగస్థల కళాకారులతో పరిచయాలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా ఇదే సమయంలో సెంట్రల్ యూనివర్సిటీ థియేటర్ ఆర్ట్స్ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీగా, మేకప్ ఆర్టిస్ట్ గా పనిచేశారు. ఇది ఆయనకు ఆర్థికంగా సహాయపడడమేగాకుండా నటునిగా గుర్తింపునిచ్చింది.

రంగస్థల నటునిగా[మార్చు]

డాక్టరేట్ పరిశోధన పూర్తయిన తరువాత రసరంజని సంస్థ ప్రదర్శించిన నాటకాల్లో నటిస్తూ, మేకప్ ఆర్టిస్ట్ గా కూడా రాణించారు. ప్రసాదరెడ్డి, డి.ఎస్.ఎన్. మూర్తి, మొదలి నాగభూషణశర్మ, చాట్ల శ్రీరాములు, తల్లావజ్ఝుల సుందరం వంటి రంగస్థల దర్శకుల దర్శకత్వంలో నటించారు.

రంగస్థల దర్శకుడిగా[మార్చు]

  1. భరత విలాపం[2]
  2. 'ఊరికొక్కరు' (బాలల నాటిక) (రచన, దర్శకత్వం)[4][5]

ఎరిత్రియాలో ఉద్యోగం[మార్చు]

2005లో ఆఫ్రికాలోని ఎరిత్రియా దేశానికి వెళ్లి అక్కడ నటన, దర్శకత్వం, మేకప్, కాస్ట్యూమ్స్ వంటి విభాగాలలో ఐదేళ్లపాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేశారు. ఎరిత్రియాలో పనిచేసిన అయిదేళ్ల సమయంలో తెలుగు నాటరంగాన్ని ఆ దేశవాసులకు పరిచయం చేశారు. ఎరిత్రియాలో మొదటిసారిగా వరుసగా మూడేళ్ల పాటు ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని జరిపించారు. అనంతరం నాలుగవ సంవత్సరం నుంచి అక్కడి ప్రభుత్వం ఈ దినోత్సవాన్ని అధికారికంగా జరిపిస్తోంది.[2]

సినిమా, టివి, రేడియోలో నటనానుభవం[మార్చు]

హరిశ్చంద్ర దూరదర్శన్, జెమిని, ఈటివి, ఈటివి2 ఛానెల్స్ లో ఇప్పటివరకు 100కు పైగా సీరియల్స్ లో నటించారు.

సీరియల్స్[మార్చు]

  1. ఋతురాగాలు
  2. కస్తూరి
  3. సంగ్రామం
  4. ముగ్ద
  5. సినిమానందలహరి
  6. అంతులేని కథ
  7. స్వాతి చినుకులు
  8. పంచమవేదం
  9. మహాకవి ధూర్జటి

సినిమాలు[మార్చు]

  1. ఒక్కడు
  2. అర్జున్
  3. అతడు
  4. రెండేళ్ళ తర్వాత (2005)
  5. అక్టోబర్ 19
  6. ఖలేజా
  7. బాహుబలి-1
  8. బాహుబలి-2
  9. మిట్టీ
  10. ఎన్.టి.ఆర్. కథా నాయకుడు
  11. మహానాయకుడు
  12. యాత్ర
  13. పర్‌ఫ్యూమ్ (2023)

లఘుచిత్రాలు[మార్చు]

  1. మరువకుమా అనురాగం..
  2. మాజి నక్సలైట్
  3. కనువిప్పు
  4. అద్దెకు మనిషి
  5. మై డాటర్
  6. శంకర్
  7. చోటిభి
  8. అనంతం

అవార్డులు[మార్చు]

దాదాపు 30 సంవత్సరాలుగా తెలుగు నాటకరంగంలో కొనసాగుతున్న హరిశ్చంద్రకు నటన, దర్శకత్వం, ప్రొడక్షన్ విభాగాల్లో ఎన్నో అవార్డులు వచ్చాయి.

  1. ఉత్తమ నటుడు: 32వ అఖిల భారత నాటకపోటీలు, బిహెచ్ఇఎల్, (మే)
  2. ఉత్తమ నటుడు: అఖిల భారత నాటకపోటీలు, యువ కళావాహిని 2005
  3. ఉత్తమ ప్రతినాయకుడు: 12వ అఖిల భారత నాటకపోటీలు, పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు
  4. ఉత్తమ ఆహార్యం: రచ్చబండ (నాటిక) - అప్పాజోస్యుల-విష్ణుభొట్ల-కందాళం ఫౌండేషన్ ఫౌండేషన్ నాటక పరిషత్తు, 2016, చిలకలూరిపేట

మూలాలు[మార్చు]

  1. "Exclusive: #BehindTheCamera! Except for the personal make-up man of the star actor, all others have no importance on the film sets: Make-up designer turned actor Rayala Harishchandra. - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 2021-12-12. Retrieved 2021-12-13.
  2. 2.0 2.1 2.2 2.3 ప్రజాశక్తి, ఫీచర్స్ (28 July 2018). "ఇది హ‌రిశ్చంద్ర మిట్టీ‌క‌థ‌". www.prajasakti.com. గంగాధర్‌ వీర్ల. Archived from the original on 28 July 2018. Retrieved 9 August 2019.
  3. తెలుగు వికీ విజన్ మీడియా. "బహుముఖ వేషధారి". telugutelevisionmedia1.blogspot.in. Retrieved 6 May 2017.[permanent dead link]
  4. ప్రజాశక్తి, రాజమండ్రి రూరల్‌. "న‌ట‌ధురీణులు బాల ప్ర‌వీణులు". Retrieved 6 May 2017.[permanent dead link]
  5. కళార్చన. "జాతీయ నాటకోత్సవాలలో ఎంపికైన రంగస్థల కళారూపాలు". kalarchana.in. Archived from the original on 22 ఆగస్టు 2017. Retrieved 6 May 2017.