రాయ్‌బరేలి జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాయ్‌బరేలి జిల్లా
रायबरेली ज़िला
ఉత్తర ప్రదేశ్ పటంలో రాయ్‌బరేలి జిల్లా స్థానం
ఉత్తర ప్రదేశ్ పటంలో రాయ్‌బరేలి జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనులక్నో
ముఖ్య పట్టణంరాయ్‌బరేలీ
Government
 • లోకసభ నియోజకవర్గాలురాయ్‌బరేలి
విస్తీర్ణం
 • మొత్తం4,609 కి.మీ2 (1,780 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం34,04,004
 • జనసాంద్రత740/కి.మీ2 (1,900/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత70%
 • లింగ నిష్పత్తి941
ప్రధాన రహదార్లుNH 24B, NH 231
Websiteఅధికారిక జాలస్థలి
మీర్జాపూర్ ఐహరీ గ్రామంలో బుధే నాథ్ ఆలయం

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో రాయ్‌బరేలీ జిల్లా (హిందీ:रायबरेली ज़िला) (ఉర్దు: ائے بریلی ضلع) ఒకటి. రాయ్‌బరేలీ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. రాయ్‌బరేలీ జిల్లా లక్నో డివిజన్‌లో భాగంగా ఉంది.

రాయ్ బరేలీ పట్టణం, మునిసిపాలిటీ. ఇది రాయ్ బరేలీ జిల్లా ముఖ్యపట్టణం. ఈ పట్టణం రైల్ కోచ్ పరిశ్రమ కలిగిఉంది. షాజహాన్ సమయంలో నిర్మించిన అనేక పురాతన మసీదులు ఉన్నాయి.

భౌగోళికం

[మార్చు]

జిల్లా వైశాల్యం 4,609 చ.కి.మీ. గౌగోళికంగా జిల్లా భూభాగం ఎగుడుదిగుడుగా ఉంటుంది. జిల్లాలో గంగా, సాయి నదులు ప్రవహిస్తున్నాయి. నదీప్రవాహాలు పడవప్రయాణించడానికి అనువుగా ఉంటాయి. జిల్లాలో ప్రధానంగా వరి, పప్పుధాన్యాలు, గోధుమలు, బార్లీ, సజ్జలు, గసాలు పండించబడుతున్నాయి. జిల్లాను ఓధ్- రోహిల్‌ఖండ్ రైలు మార్గం లక్నోతో అనుసంధానం చేస్తుంది.ఈ మార్గం 1898లో వారణాసి వరకు పొడిగించబడింది.

ఆర్ధికం

[మార్చు]

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో రాయ్‌బరేలీ జిల్లా ఒకటి అని గుర్తించింది.[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 34 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[1]

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,404,004,[2]
ఇది దాదాపు. పనామా దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. కనెక్టికట్ నగర జనసంఖ్యకు సమం..[4]
640 భారతదేశ జిల్లాలలో. 97 వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 739 .[2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 18.51%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 941:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 69.04%.[2]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

భాషలు

[మార్చు]

జిల్లాలో హిందీ వ్యవహార భాషలలో ఒకటైన అవధి భాష వాడుకలో ఉంది. ఇది అవధి భూభాగంలో 38 మిలియన్ ప్రజలకు వాడుకలో ఉంది. .[5]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Panama 3,460,462 July 2011 est.
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Connecticut 3,574,097
  5. M. Paul Lewis, ed. (2009). "Awadhi: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.