రాయ్‌సేన్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Raisen జిల్లా
रायसेन जिला
మధ్య ప్రదేశ్ పటంలో Raisen జిల్లా స్థానం
మధ్య ప్రదేశ్ పటంలో Raisen జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
డివిజనుBhopal
ముఖ్య పట్టణంRaisen
Government
 • లోకసభ నియోజకవర్గాలుHoshangabad
Area
 • మొత్తం8,395 km2 (3,241 sq mi)
Population
 (2011)
 • మొత్తం13,31,699
 • Density160/km2 (410/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత74.26%
 • లింగ నిష్పత్తి899
Websiteఅధికారిక జాలస్థలి
సాంచి గొప్ప స్థూపం

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో రాయ్‌సెన్ జిల్లా ఒకటి. రాయ్‌సేన్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లా భోపాల్ డివిజన్‌లో ఉంది.

పేరువెనుక చరిత్ర[మార్చు]

రాయ్‌సెన్ జిల్లాలో ఉన్న బ్రహ్మాండమైన కోట పేరును కోటకు నిర్ణయించారు. ఈ కోటను శాండ్ హిల్ మీద నిర్మించబడింది. పర్వతపాదాల వద్ద పట్టణం నిర్మించబడింది. కోట పేరు పూర్వం రాజవసిని, రాజశయన్ అని ఉండేదని అదే పేరు కాలక్రమంగా రాయ్‌సేన్ అయిందని భావిస్తున్నారు.

భౌగోళికం[మార్చు]

జిల్లా 22 47' నుండి 23 33' డిగ్రీల ఉత్తర అక్షాంశం, 7721' నుండి 78 49' డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లా పశ్చిమ సరిహద్దులో సీహోర్ జిల్లా, ఉత్తర సరిహద్దులో సాగర్ జిల్లా, ఈశాన్య, తూర్పు సరిహద్దులో నర్సింగ్‌పూర్ జిల్లా, దక్షిణ సరిహద్దులో హోషంగాబాద్ జిల్లా, సరిహద్దులో సీహోర్ జిల్లా ఉన్నాయి. జిల్లా వైశాల్యం 8,395 చ.కి.మీ. [1]

విభాగాలు[మార్చు]

జిల్లాలో 8 తాలూకాలు ఉన్నాయి : రాయ్సేన్, గొహర్గంజ్,బేగంగంజ్, గైరాత్‌గంజ్, సిల్వాని,బరేలి, ఉదైపురా, బడీ. [1]

చరిత్ర[మార్చు]

1950 మే 5 న రాయ్‌సేన్ జిల్లా రూపొందించబడింది. .[1] రాయ్‌సేన్ జిల్లా గతంలో భోపాల్ రాస్థానంలో భాగంగా ఉండేది. [2]

జిల్లాలో యునెస్కో చేత ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించబడిన " సాంచి బౌద్ధ స్థూపం " ఉంది.[3] జిల్లాలో మరొక యునెస్కో చేత ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించబడిన" భీంబెత్క రాక్ షెల్టర్ " కూడా ఉంది. [4]

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,331,699,[5]
ఇది దాదాపు. మొరీషియస్ దేశ జనసంఖ్యకు సమానం.[6]
అమెరికాలోని. మైనే నగర జనసంఖ్యకు సమం.[7]
640 భారతదేశ జిల్లాలలో. 365వ స్థానంలో ఉంది.[5]
1చ.కి.మీ జనసాంద్రత. 157 [5]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 18.36%.[5]
స్త్రీ పురుష నిష్పత్తి. 899:1000 [5]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 74.26%.[5]
జాతియ సరాసరి (72%) కంటే.
Young girls in the Raisen district

పర్యాటకం[మార్చు]

  • రాయ్‌సేన్ జిల్లాలో పలు పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి.
  • సాంచి :- ప్రపంచ వారసత్వసంపదగా ప్రకటించబడింది.
  • భోజ్పూర్ :- భోజ్పూర్ ఆలయంలో దేశంలో బృహత్తరమైన శివలింగం ఉంది. ఈ లింగం ఎత్తు 5.5 మీటర్ల ఎత్తు, 2.3 మీటర్ల వ్యాసం కలిగి ఉంది. ఈ లింగం ఏకశిలలో చెక్కబడింది.

ప్రయాణ సౌకర్యాలు[మార్చు]

రాయ్‌సేన్ పట్టణం భోపాల్ నగరానికి 45 కి.మీ దూరంలో ఉంది. జిల్లా చక్కగా జాతీయరహదారి -86 కు అనుసంధానితమై ఉంది. జాతీయరహదారి -12 కూడా జిల్లా గుండా పయనిస్తుంది.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 "Raisen". Raisen district administration. Retrieved 2010-08-14.
  2. "Raisen". Encyclopædia Britannica. Retrieved 2010-08-14.
  3. "An Historical and Artistic Description of Sanchi (1918)". Archived from the original on 2009-02-10. Retrieved 2010-08-14.
  4. "Rock Shelters of bhimbhetka". UNESCO. Retrieved 2010-08-14.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  6. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Mauritius 1,303,717 July 2011 est.
  7. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Maine 1,328,361

వెలుపలి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]