Jump to content

రారా...కృష్ణయ్య

వికీపీడియా నుండి
రారా...కృష్ణయ్య
దర్శకత్వంమహేశ్. పి
రచనమహేశ్. పి
తారాగణంసందీప్ కిషన్,
రెజీనా,
తనికెళ్ళ భరణి,
జగపతిబాబు
ఛాయాగ్రహణంశ్రీరామ్
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంఅచ్చు రాజమణి
విడుదల తేదీ
జూలై 4, 2014 (2014-07-04)[1]
దేశంభారత్
భాషతెలుగు

రారా...కృష్ణయ్య 2014 జూలై 14న విడుదలైన తెలుగు చిత్రం.

వంశ పారంపర్యంగా చేస్తున్న దందాను కొనసాగించడం ఇష్టంలేక తన అన్నయ్య జగ్గు భాయ్ (జగపతిబాబు) కు దూరంగా వెళ్లి మాణిక్యం (తనికెళ్ల భరణి) అనే ట్రావెల్స్ వ్యాపారి వద్ద డ్రైవర్ పనిచేస్తుంటాడు కిట్టూ అలియాస్ కృష్ణయ్య (సందీప్ కిషన్). తాను నమ్మిన మాణిక్యం కిట్టూని మోసగిస్తాడు. తనకు జరిగిన మోసానికి జీర్ణించుకోలేని కిట్టూ.. తండ్రి కుదుర్చిన పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడని మాణిక్యం కూతురు నందూ (రెజీనా) ను కిడ్నాప్ చేస్తాడు. నందూని కిడ్నాప్ చేసిన తర్వాత కృష్ణయ్య జీవితంలో ఏలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. కృష్ణయ్య కుటుంబం చేసే దందా ఏమిటి? నందూ, కృష్ణయ్యల మధ్య చిగురించిన ప్రేమ వ్యవహారం పెళ్ళి వరకు వచ్చిందా? ఈ కిడ్నాప్ కథలో, తమ్ముడి ప్రేమ వ్యవహారంలో జగ్గూ భాయ్ పాత్రేంటి అనే ప్రశ్నలకు సమాధానమే 'రారా...కృష్ణయ్య' చిత్రం.

నటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • సంగీతం: అచ్చు రాజమణి
  • ఫోటోగ్రఫీ: శ్రీరాం
  • నిర్మాత: వంశీ కృష్ణ శ్రీనివాస్
  • కథ, దర్శకత్వం: మహేశ్ బాబు.పి

మూలాలు

[మార్చు]
  1. "'Aagadu', 'Anjaan' and 'Ra Ra Krishnayya': 10 Tamil and Telugu films we are looking forward to this year". IBN Live. June 21, 2014. Archived from the original on 2014-06-24. Retrieved June 22, 2014.

బయటి లంకెలు

[మార్చు]