రావికంటి వసునందన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రావికంటి వసునందన్
జననంరావికంటి వసునందన్
1949, మే 4
కమాన్‌పూర్, కరీంనగర్ జిల్లా, తెలంగాణ
వృత్తిఅధ్యాపకుడు
ప్రసిద్ధికవి, రచయిత, ప్రొఫెసర్
మతంహిందూ
తండ్రికిష్టయ్య
తల్లిజగ్గమ్మ

రావికంటి వసునందన్ బహుగ్రంథకర్త. పలు సత్కారాలను పొందినవాడు.

జీవిత విశేషాలు[మార్చు]

ఇతడు మే 4వ తేదీ 1949లో కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ గ్రామంలో కిష్టయ్య, జగ్గమ్మ దంపతులకు జన్మించాడు. ఎం.ఎ. చదివాడు. భూమిక - ఒక సమగ్ర పరిశీలనం అనే అంశంపై పరిశోధించి ఎం.ఫిల్ పట్టాను, ఆధునికాంధ్ర కవిత్వంలో మానవతావాదం - విశ్వంభర విలక్షణత అనే అంశంపై పరిశోధించి పి.హెచ్.డి పట్టాను సాధించాడు. బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయములో తెలుగు ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీవిరమణ పొందాడు. ఇతని రచనలు కొన్ని హిందీ, ఇంగ్లీషు భాషల్లోకి అనువాదమయ్యాయి.

రచనలు[మార్చు]

కథాకావ్యాలు[మార్చు]

  1. రతీప్రద్యుమ్నము
  2. గురుకులము
  3. భారతం (నిర్వచన పద్యకృతి)
  4. బలి
  5. అష్టాక్షరి
  6. పంచాక్షరి
  7. కృష్ణం కలయ...
  8. ఊర్మిళ

దీర్ఘకావ్యాలు[మార్చు]

  1. త్రయి
  2. మనస్సు
  3. పిల్లలమఱ్ఱి
  4. మట్టిముద్దలు
  5. ఆయుధం కవిత్వం
  6. ప్రవాహిని
  7. బాలబ్రహ్మం
  8. భక్తి
  9. భావగతం
  10. సీతమ్మ
  11. మనతెలంగాణ తల్లి
  12. చంపుడుగుళ్ళు
  13. శ్రీచరణశరణాగతి

గేయకావ్యాలు[మార్చు]

  1. వేణీసంగమం
  2. శ్రీ వేంకటేశ్వర తారావళి
  3. ఎందరో మహానుభావులు
  4. భగవద్రామానుజులు
  5. సూరి గుణగానం

విమర్శ, పరిశోధన గ్రంథాలు[మార్చు]

  1. భావదీపికలు (సాహిత్యవ్యాసాలు)
  2. భూమిక - ఒక సమగ్ర పరిశీలనం (ఎం.ఫిల్. సిద్ధాంత గ్రంథం)
  3. అష్టాక్షరి - (సినారె రచనలపై విమర్శా వ్యాసాలు)
  4. ఆధునికాంధ్ర సాహిత్యంలో మానవతావాదం - విశ్వంభర విలక్షణత (పి.హెచ్.డి సిద్ధాంతగ్రంథం)
  5. తెలుగు సంప్రదాయ కవిత్వం -సామాజిక నేపథ్యం
  6. వ్యాసభూమిక

వచన కవితాసంపుటాలు[మార్చు]

  1. సాధన
  2. కలం కదిలితే
  3. మెరుపు మెరిస్తే
  4. వాన కురిస్తే
  5. నేల నవ్వితే
  6. మనసు నిండితే
  7. సింగిణీ మొలిస్తే
  8. నెమలి ఆడితే
  9. గుండె పొంగితే
  10. అరవై పండితే
  11. ఆత్మ పలికితే
  12. లోవెలుగులు (ముక్తకాలు)
  13. శతమానంభవతి
  14. రావికన్నులు
  15. అనుయోగం (త్రిపదులు)
  16. అడుగడుగునా

బాలసాహిత్యం[మార్చు]

  1. బాలజ్యోతులు
  2. భారత నారీమణులు

ఆడియో క్యాసెట్లు[మార్చు]

  1. శ్రీరామ చరితామృతమ్‌
  2. జై గణేష్
  3. బాలాజీ

ఇతర రచనలు[మార్చు]

  1. ప్రజావిజయం[1] (రేడియో నాటకం)
  2. ప్రయోజన దండకాలు
  3. భక్త శిఖామణులు
  4. శ్రీ వేదవ్యాస విజయం
  5. వంద కందాలు
  6. వ్యాసప్రభాస (సంపాదకత్వం)
  7. నిరంతర సాహితీమూర్తి సినారె (సహ సంపాదకత్వం)
  8. అభినవ పోతన (ప్రధాన సంపాదకత్వం)
  9. యశస్వి (ప్రధాన సంపాదకత్వం)

పురస్కారాలు[మార్చు]

బిరుదులు[మార్చు]

ఇతడిని భారతీ సాహిత్య సమితి కోరుట్ల కవిశిరోమణి బిరుదుతో సత్కరించింది.

మూలాలు[మార్చు]

  1. రావికంటి, వసునందన్ (1990). ప్రజావిజయం. హైదరాబాద్: జగ్గమాంబ ప్రచురణలు. Retrieved 5 February 2015.
  2. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (14 July 2016). "'సమాజానికి నిజమైన వైద్యులు సాహితీవేత్తలే'". www.andhrajyothy.com. Archived from the original on 12 July 2020. Retrieved 12 July 2020.
  3. ఘనంగా సాహితీ పురస్కారాల ప్రదానోత్సవం, తెలుగువాణి, తెలుగు విశ్వవిద్యాలయ ప్రచురణ, ఏప్రిల్-ఆగస్టు 2016, హైదరాబాదు పుట. 42.