రావి వారి పాలెం, మోపిదేవి
రావివారి పాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం. — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°04′22″N 80°56′12″E / 16.072762°N 80.936746°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | మోపిదేవి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521125 |
ఎస్.టి.డి కోడ్ | 08671. |
రావి వారి పాలెం, కృష్ణా జిల్లా, మోపిదేవి మండలానికి చెందిన గ్రామం.
గ్రామ చరిత్ర
[మార్చు]రావివారిపాలెం సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలగ్రామం. "రావి" అనే ఇంటి పేరు కలవారు ఎక్కువ ఉండటం వలన ఈ ఊరికి "రావి వారి పాలెం" అని పేరు వచ్చింది.[ఆధారం చూపాలి] 'రావి సీంగరప్ప ఈవూరికి మూలపురుషుడు.[ఆధారం చూపాలి] ఆయన 1700 సంవత్సరం నాటికి ఈ రావివారిపాలెం ఒక పెద్ద అరణ్యంగా వుండెడిది. ఆ కాలంలో ఈ గ్రామం దేవరకోట సంస్థానంలో వుండెడిది. రావి సింగరప్ప, వారి సొదరుల వారసులే ఈ గ్రామంలోని రావివారు. దాదాపు 150 కుటుంబాలు ఉన్నాయి.
గ్రామ భౌగోళికం
[మార్చు]సముద్రమట్టానికి 6 మీ.ఎత్తులో ఉంది
గ్రామానికి రవాణా సౌకర్యాలు
[మార్చు]ఒకే ఒక ఎర్ర బస్సు సౌకర్యం ఉంది. మోపిదేవి, అవనిగడ్డ నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ -64 కి.మీ.దూరంలో ఉంది
గ్రామంలో విద్యా సౌకర్యాలు
[మార్చు]జిల్లా గ్రంథాలయ సంస్థ వారి పురాతన గ్రంథాలయం
[మార్చు]- ఈ గ్రంథాలయం ఏర్పాటుకు, 1966లో, శ్రీ కావూరు కోదండరామయ్య, 20 సెంట్లస్థలాన్ని ఉచితంగా అందజేసినారు. ఆ స్థలంలో ఒక పెంకుటిల్లు నిర్మించి, గ్రంథాలయం నిర్మించారు. అప్పటినుండి ఈ గ్రంథాలయం యువతకు, ప్రజలకు విఙానాన్ని అందించుచున్నది. [7]
- ఈ గ్రంథాలయానికి నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం రు. 15 లక్షలను మంజూరు చేసింది. [6]
మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల
[మార్చు]ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య నానాటికీ తగ్గిపోతూ, మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతున్నా, విద్యార్థుల సంఖ్య 40% పెంచి మనుగడకు నిర్వచనం చెప్పారు, ఈ పాఠశాల ఉపాధ్యాయులు. ఈ పాఠశాల దినదినాభివృద్ధి చెందుచున్నది. బోడగుంట నుండి వచ్చే విద్యార్థులకోసం, ఒక రిక్షా ఏర్పాటుచేశారు. ఉపాధ్యాయుల కృషికి గ్రామస్థులు, దాతలు, పూర్వ విద్యార్థులు, గ్రామంలోని స్నేహితుల బృందం, రోటరీ క్లబ్ అడిగిందే తడవుగా మౌలిక వసతులు కల్పించుచూ, ఉపాధ్యాయుల ఉత్సాహాన్ని ఇనుమడింపజేస్తున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేయుచున్న శ్రీమతి గాజుల పార్వతీదేవి, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైనారు. [1]
గ్రామంలో మౌలిక వసతులు
[మార్చు]వైద్య సౌకర్యం
[మార్చు]ప్రభుత్వ ఆసుపత్రి.
ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం
[మార్చు]పాల ఉత్పత్తి దారుల సహకార సంఘo
[మార్చు]గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
[మార్చు]పేరయ్య చెరువు.
గ్రామ పంచాయతీ
[మార్చు]ఈ గ్రామం మోపిదేవి గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ రామాలయం
[మార్చు]గ్రామదేవత శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయం
[మార్చు]ఈ ఆలయంలో 2014, ఆగష్టు-14 నుండి 17 వరకు అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం నిర్వహించారు. ఈ ఆలయంలో 2014, ఆగష్టు-15, శుక్రవారం నాడు, అమ్మవారి జాతర మహోత్సవాలలో భాగంగా, 15 మంది వేదపండితుల ఆధ్వర్యంలో, నూతనంగా పోతురాజు శిలల ప్రతిష్ఠాపన, దంపతులు, అత్యంత వైభవంగా నిర్వహించారు. రైతులు నైవేద్యాలు సమర్పించి కొలిచారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది. [3], [4]&[5]
చర్చి
[మార్చు]గ్రామంలో ప్రధాన పంటలు
[మార్చు]రెండు చెరువులు, పారాయి చెరువు, నూకాలమ్మ చెరువు ఉన్నాయి. ఊరి ఉత్తరం వైపునుంచీ ఒక కృష్ణానది కాలువ పారుతుంది. ఇక్కడి ప్రధాన పంట వరి (సార్వా), అపరాలు మినుములు లేక పెసలు. నేల ఒండ్రు మన్ను.
గ్రామంలోని ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)
[మార్చు]- చరిత్ర కల ఈ ఊరు ఒకప్పటి కమ్యూనిస్టు ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించింది.
- అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర రావు, కమ్యూనిస్టు నాయకుడు కొండపల్లి సీతారామయ్య వంటి వారికి ఈ ఊరితో బాంధవ్యం ఉంది.
గ్రామ విశేషాలు
[మార్చు]- ఊరిలోని అనేక కుటుంబాల నుంచీ దేశ విదేశాలలో స్థిరపడి ప్రముఖ స్థానాలలో ఉన్న కుటుంబ సభ్యులు ఉన్నారు.
- ఈ గ్రామానికి 2014, ఫిబ్రవరి-4న, కంచికామకోటి పీఠాధిపతి గ్రామాన్ని సందర్శించారు. [2]
- ఈ గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు శ్రీమతి పరుచూరి వెంకటసుబ్బమ్మ, 101 సంవత్సరాల వయస్సులో, 2015, నవంబరు-23వ తేదీనాడు పరమపదించారు. [8]
మూలాలు
[మార్చు][1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, జనవరి-6; 1వపేజీ. [2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, జనవరి-31; 2వపేజీ. [3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, ఆగష్టు-12; 2వపేజీ. [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, ఆగష్టు-16; 3వపేజీ. [5] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, ఆగష్టు-18; 2వపేజీ. [6] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, డిసెంబరు-3; 3వపేజీ. [7] ఈనాడు అమరావతి; 2015, అక్టోబరు-28; 39వపేజీ. [8] ఈనాడు అమరావతి; 2015, నవంబరు-24; 40వపేజీ.