రావులకొల్లు (పొన్నలూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రావులకొల్లు
—  రెవిన్యూ గ్రామం  —
రావులకొల్లు is located in Andhra Pradesh
రావులకొల్లు
రావులకొల్లు
అక్షాంశ రేఖాంశాలు: 15°18′22″N 79°46′05″E / 15.306091°N 79.768024°E / 15.306091; 79.768024
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం పొన్నలూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం
 - పురుషుల సంఖ్య 1,163
 - స్త్రీల సంఖ్య 1,129
 - గృహాల సంఖ్య 576
పిన్ కోడ్ 523109
ఎస్.టి.డి కోడ్ 08598

రావులకొల్లు, ప్రకాశం జిల్లా, పొన్నలూరు మండలానికి చెందిన గ్రామము.[1] పిన్ కోడ్: 523 109. ఎస్.టి.డి.కోడ్:08598.

గ్రామ చరిత్ర[మార్చు]

రావులకొల్లు అనే పదం రావుల అనే పూర్వపదం, కొల్లు అనే ఉత్తరపదాల నుంచి వచ్చింది. రావుల అనే పదం వృక్షనామసూచి కాగా కొల్లు అనే పదం కొలనుకు రూపాంతరం, జలనామసూచి. కొలను అన్నది అటు మరీ చిన్న గుంట కాక, ఇటు మరీ పెద్ద చెరువు కాక మధ్యస్థంగా ఉండే భౌగోళిక విశేషం.[2]

సమీప గ్రామాలు[మార్చు]

ఉప్పలదిన్నె 2 కి.మీ, పచ్చవ 4 కి.మీ, పొన్నలూరు 5 కి.మీ, వెల్లటూరు 5 కి.మీ, వర్ధినేనిపాలెం 6 కి.మీ, వేంపాడు 7 కి.మీ.

సమీప పట్టణాలు[మార్చు]

పొన్నలూరు 4.5 కి.మీ, కొండపి 15.7 కి.మీ, వోలేటివారిపాలెం 15.7 కి.మీ, కందుకూరు 18.4 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

ఉత్తరాన కొండపి మండలం, దక్షణాన వోలేటివారిపాలెం మండలం, తూర్పున కందుకూరు మండలం,పశ్చిమాన పెదచెర్లోపల్లి మండలం.

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

ఈ గ్రామానికి చెందిన శ్రీ పూనాటి మాలకొండయ్య, మధ్య తరగతి కుటుంబీకులు. పెద్దగా ఆసిపాస్తులు లేవు. ఈయన కాయకష్టం చేసి తన కుమారుడైన నాగేశ్వరరావును ఛార్టర్డ్ అకౌంటెంటు చదివించారు. నాగేశ్వరరావు వృత్తిరీత్యా బెంగుళూరులో స్థిరపడినాడు. అయినా స్వంత ఊరుపై మమకారంతో "మన ఊరు ఛారిటబుల్ ట్రస్ట్" అను స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. గ్రామంలో అంత్యక్రియలు, కర్మకాండలు నిర్వర్తించేటందుకు శ్మశానంలో సరియైన వసతి లేకపోవడంతో ఈయన 3 లక్షల రూపాయలతో విశ్రాంతిభవనం నిర్మించారు. దాని ప్రక్కన 50 వేల రూపాయలతో ఒక చేతిపంపును గూడా ఏర్పాటు చేశారు. ఇదిగాక, గ్రామస్తుల మంచినీటి అవసరాలు తీర్చేటందుకు 8 లక్షల రూపాయలతో,ఒక శుద్ధజల కేంద్రం స్థాపించి, 15 పైసలకే 20 లీటర్ల నీటిని అందజేస్తునారు. ఈ యంత్రం అద్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నడవటం విశేషం. [3]

గణాంకాలు[మార్చు]

1.2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,099.[3] ఇందులో పురుషుల సంఖ్య 1,050, మహిళల సంఖ్య 1,049, గ్రామంలో నివాస గృహాలు 508 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,350 హెక్టారులు.
2.జనాభా (2011) - మొత్తం 2,292 - పురుషుల సంఖ్య 1,163 -స్త్రీల సంఖ్య 1,129 - గృహాల సంఖ్య 576

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 232. Retrieved 10 March 2015.
  3. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లింకులు[మార్చు]

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[3] ఈనాడు ప్రకాశం; 2014,జనవరి-16; 8వపేజీ.