రావుల శ్రీధర్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రావుల శ్రీధర్‌రెడ్డి

పదవీ కాలం
2022 మార్చి 23 – 07 డిసెంబర్ 2023[1]

వ్యక్తిగత వివరాలు

జననం 1975
ఊకల్ గ్రామం, రాయపర్తి మండలం, వరంగల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు రావుల పురుషోత్తం రెడ్డి, సరస్వతీ దేవి
జీవిత భాగస్వామి రావుల రాధికా రెడ్డి
సంతానం 1 కుమారుడు, 1 కుమార్తె
నివాసం హైదరాబాద్

రావుల శ్రీధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2022 మార్చి 23న తెలంగాణ రాష్ట్ర విద్యా, సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా నియమితుడై[2][3], 30న బాధ్యతలు చేపట్టాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

రావుల శ్రీధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, రాయపర్తి మండలం, ఊకల్ గ్రామంలో రావుల పురుషోత్తం రెడ్డి, సరస్వతీ దేవి దంపతులకు జన్మించాడు. ఆయన ఖమ్మం జిల్లా, కొర్లగూడెంలో 10వ తరగతి వరకు, వరంగల్‌ ఎల్‌బీ కళాశాలలో ఇంటర్మీడియట్, హైదరాబాద్‌లోని ఎల్బీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. రావుల శ్రీధర్ రెడ్డికి భార్య రాధికా రెడ్డి (న్యాయవాది), ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

రాజకీయ జీవితం

[మార్చు]

రావుల శ్రీధర్ రెడ్డి డిగ్రీ పూర్తి చేశాక అంబుజ సిమెంట్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌లో సీనియర్‌ మేనేజిరియల్‌ స్థాయిలో పనిచేసి తెలంగాణ ఉద్యమ సమయంలో 2010లో ఉద్యోగానికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరాడు. అయన బీజేపీలో వివిధ స్థాయిల్లో పనిచేసి చేరారు. ఆయన 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.

రావుల శ్రీధర్ రెడ్డి బీజేపీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న సమయంలో తెలంగాణ పట్ల భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ 2020 నవంబరు 1న ఆ పార్టీకి రాజీనామా చేసి[4],[5] 2020 నవంబరు 2న కేటీఆర్ సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[6] ఆయనను 2022 మార్చి 23న తెలంగాణ రాష్ట్ర విద్యా, సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[7][8]

రావుల శ్రీధర్ రెడ్డి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి లోక్‌సభ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్‌గా నియమితుడయ్యాడు.[9]

ఇతర పదవులు

[మార్చు]

రావుల శ్రీధర్‌రెడ్డి ప్రస్తుతం తెలంగాణ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ చైర్మన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన తెలంగాణ ఒలంపిక్‌ అసోసియేషన్‌కు ఉపాధ్యక్షుడిగా, యోగా అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పనిచేశాడు.[10]

మూలాలు

[మార్చు]
  1. V6 Velugu (11 December 2023). "54 కార్పొరేషన్ల చైర్మన్లు ఔట్". Archived from the original on 19 February 2024. Retrieved 19 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Namasthe Telangana (24 March 2022). "మూడు కార్పొరేషన్లకు చైర్మన్లు". Archived from the original on 24 March 2022. Retrieved 24 March 2022.
  3. Namasthe Telangana (24 March 2022). "మనోళ్లకు చైర్మన్‌ పదవులు". Archived from the original on 24 March 2022. Retrieved 24 March 2022.
  4. Eenadu (24 March 2022). "భాజపాకు రావుల శ్రీధర్‌రెడ్డి రాజీనామా". Archived from the original on 24 March 2022. Retrieved 24 March 2022.
  5. Zee News Telugu (1 November 2020). "బీజేపీకి సీనియర్ నేత రాజీనామా.. అసంతృప్తితో కీలక నిర్ణయం". Archived from the original on 24 March 2022. Retrieved 24 March 2022.
  6. HMTV (2 November 2020). "టీఆర్ఎస్‌లో చేరిన రావుల శ్రీధ‌ర్ రెడ్డి". Archived from the original on 24 March 2022. Retrieved 24 March 2022.
  7. Prabha News (23 March 2022). "3 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం". Archived from the original on 24 March 2022. Retrieved 24 March 2022.
  8. Prabha News (30 March 2022). "శ్రీధ‌ర్ రెడ్డికి మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ శుభాకాంక్ష‌లు". Archived from the original on 30 March 2022. Retrieved 30 March 2022.
  9. Eenadu (6 April 2024). "పార్లమెంటు నియోజకవర్గాల్లో భారాస సమన్వయకర్తల నియామకం". Archived from the original on 6 April 2024. Retrieved 6 April 2024.
  10. Telangana Today (28 November 2020). "Sridhar Reddy re-elected as HDBA president". Archived from the original on 24 March 2022. Retrieved 24 March 2022.