రావు సాహెబ్ యశ్వంత్ జనార్థన్ గల్వంకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జనార్ధన్ గల్వంకర్

శ్రీ సాయి సచ్చరిత్ర రచించిన హేమాద్పంత్ కు అల్లుడైన జనార్ధన్ గల్వంకర్ బొంబాయిలోని సెక్రటేరియట్ లో హామ్ శాఖలో సూపరింటెండెంట్ గా పనిచేస్తూ ఉండేవాడు. హేమాద్ పంత్ అతనికి బాబా గురించి తెలిపి అతనిని నాలుగుసార్లు బాబా దర్శనానికి తీసుకెళ్ళాడు . అయినా అతనికి బాబాపై భక్తి శ్రద్ధలు కలుగలేదు .

ఒకసారి జనార్ధన్ గల్వంకర్ కు స్వప్న దర్శనమిచ్చారు బాబా . అతనిని రెండు రూపాయలు దక్షిణ కోరారాయన . మరొకసారి మరలా కలలో కనిపించి అతడెలా నడుచుకోవాలో బోధించారు . అతనికి కలలో రెండు విషయాలు చెప్పారు . (1) నీతి, నిజాయితీతో ప్రవర్తించాలి . (2) సౌశీల్యము, ధర్మ బద్ధమైన గృహస్దాశ్రమమూ పాటించాలి . ఈ రెండు బోధలను అతను ఆచరించడానికి శాయశక్తులా కృషి చేశాడు . వాటిని చక్కగా పాటించగలిగాడు కూడా . బాబా ఒకసారి భక్తులతో గల్వంకర్ గురించి మాట్లాడుతూ, "అతడు పూర్వజన్మల నుంచే నిజాయితీపరుడు ,పవిత్రుడు "అన్నారు . పూర్వజన్మల నుంచి వస్తూవున్న ఈ సద్గుణాలనే మరలా ఈ జన్మలోనూ అతడు ఆచరించేలా చేసి వాటిని మంచి సంస్కారాలుగా అతనిలో స్ధిరపడేలా చేశారు సాయి . బాబా బోధలు తన నిత్య జీవితంలో ఆచరించాడతడు . కనుకనే అతడు బాబా అనుగ్రహానికి పాత్రుడయ్యాడు .

జనార్ధన్ గల్వంకర్ 1917 లో మరలా బాబాను దర్శించాడు . కానీ ఈ సారి అవిశ్వాశంతో కాకుండా చక్కటి భక్తిశ్రద్ధలతో బాబా ను దర్శించాడు . బాబా అతని తలపై తమ చేయి ఉంచి ఆశీర్వదించారు . బాబా దివ్య స్పర్శ అతనిలో అద్బుతమైన పారవశ్యం కలిగించింది . అతనికి బయటి ప్రపంచం తెలియనంత ఆనందం కలిగింది. అతడు పారవశ్యంలో ఉన్న సమయంలో బాబా అతని పూర్వ జన్మల గురించి భక్తులకు చెప్పారు . అంతేకాదు ,తామే గల్వంకర్ ను ఆ కుటుంబంలో పుట్టించామని చెప్పారు బాబా . బాబా తమ భక్తుల పుట్టుకలు ,జన్మల గురించి శ్రద్ధ వహిస్తారన్న మాట ! సాయి దివ్యస్పర్శ తగులగానే అతనిలో ఎంతో మంచి మార్పు కలిగింది . వెంటనే బాబా ,"నేనీ మూడున్నర మూరల శరీరమే ననుకుంటున్నారా ? నేనే అంతటా ఉన్నాను . ఆ విషయం గుర్తించడం నేర్చుకోవాలి !" అన్నారు .

ఈ మాటలు అతనిలో ఆధ్యాత్మిక పరివర్తన కలిగించాయి . ఎంతో లౌకికుడైన గల్వంకర్ లో తీవ్రమైన ఆధ్యాత్మిక చింతన మొదలైంది . అప్పటి నుంచి భగవద్గీత, ఏకనాథ భాగవతము మొ ॥ న ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు చదివాడు గల్వంకర్ . బాబా పట్ల శ్రద్ధ పెరగడంలో అవెంతో ఉపకరించాయి . తన జీవితంలోని పరిస్ధితులు, సంఘటనలు బాబా బోధలను ఆచరణలోకి పెట్టేందుకు చక్కని అవకాశాలుగా కనిపించసాగాయి . అతడు తన ఉద్యోగం చేస్తూనే తానున్నచోటే సాయి బోధనలను ఆచరణలో పెట్టసాగాడు . నిరంతరం బాబా గురించే ఆలోచిస్తూ ఉండడం వల్ల అతడున్నచోటే సాయి సన్నిధి అయింది . బాబా తమ మహా సమాధి తర్వాత కూడా అతనికి అటువంటి అనుభవాలను ప్రసాదించారు .

1921 సం ॥లో అతడు తన కుటుంబంతో సహా తీర్ధయాత్రలకు వెళ్ళాడు . వారు కాశీ, ప్రయాగ చేరి అక్కడ భరద్వాజాశ్రమం దర్శించడానికి వెళ్ళారు . గల్వంకర్ అక్కడ ఎవరైనా మహాత్ముని దర్శనం జరిగితే బాగుండునను కున్నాడు . బాబాను మనస్ఫూర్తిగా మహాత్ముని దర్శనం కోసం ప్రార్థించసాగాడు . వారు కాసేపు అక్కడ కూర్చుని బయలుదేరారు . కొద్దిసేపట్లోనే వారికి రోడ్డు ప్రక్కనే ఒక మహాత్ముని దర్శనమైంది . ఆయన 7 సం ॥ ల కొకసారి ప్రయాగ వస్తూ ఉంటారు . ఆయన ఎవ్వరినీ దగ్గరకు రానివ్వరు . దక్షిణ అసలే తీసుకోరు . కానీ మహాత్ముడు గల్వంకర్ ను చూడగానే ఎంతో ప్రేమగా పలకరించి తమ దగ్గరకు రమ్మనారు . అతడు ఆయనకు నమస్కరించి తన జేబులో ఉన్న మూడణాలు దక్షిణగా సమర్పించాడు . ఆయన ఆ దక్షిణ ఎంతో ప్రీతిగా స్వీకరించారు . ఆ మహాత్ముడి రూపంలో సాయియే తనకు దర్శనమనుగ్రహిస్తున్నారని గల్వంకర్ కు అర్ధమైంది .

1932 లో గల్వంకర్ కు ఒకరోజు స్వప్న దర్శనమిచ్చారు సాయి . ఆ స్వప్నంలో సాయి గల్వంకర్ ను "నీకు ఏమి కావాలి ?" అని అడిగారు . అతడు వివేకంతో, " సాయీ ,నాకేమీ వద్దు . సాటిలేని మీ ప్రేమ మాత్రమే కావాలి !!" అన్నాడు . బాబా అతనితో, "అది నీకు తప్పక లభిస్తుంది "అని అభయమిచ్చారు . అప్పటి నుంచి అతనికి బాబా ప్రేమ అనుభవమై ఆనంద పారవశ్యం కలుగుతూ ఉండేది . అంతటి భాగ్యశాలి గల్వంకర్ !!

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]