రాష్‌బేహరీ ఘోష్

వికీపీడియా నుండి
(రాస్‌ బిహారి ఘోస్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రాష్‌బేహరీ ఘోష్

రాష్‌బేహరీ ఘోష్, (సిఎస్ఐ, సిఐఇ) (1845 డిసెంబరు 23 – 1921 ఫిబ్రవరి 28) ఒక భారతీయ రాజకీయవేత్త, న్యాయవాది, సామాజికకార్యకర్త, పరోపకారి.

జీవితం తొలి దశలో[మార్చు]

రాష్‌బేహరీ ఘోష్ 1845 డిసెంబరు 23న బెంగాల్ ప్రెసిడెన్సీలోని పూర్వ బర్ధమాన్ జిల్లా, ఖండఘోష్ ప్రాంతంలోని టోర్కోనా గ్రామంలో జన్మించాడు. అతను బుర్ద్వాన్ రాజ్ కళాశాల, ప్రెసిడెన్సీ కళాశాల, కోల్‌కతాలో చదివాడు. అతను ఆంగ్లంలో ఎంఏ పరీక్ష మొదటి తరగతిలో ఉత్తీర్ణుడయ్యాడు.1871లో అతను లా పరీక్షలో ఆనర్స్ తో ఉత్తీర్ణుడయ్యాడు 1884 లో డాక్టర్ ఆఫ్ లాస్ డిగ్రీని పొందాడు . [1]

రాజకీయ జీవితం[మార్చు]

ఘోష్ భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడు, మితవాద విభాగం వైపు మొగ్గు చూపాడు.అతను పురోగతిపై లోతైన విశ్వాసం ఉన్ననాయకుడు, కానీ ఏ రూపంలో నైనా త్రీవవాదానికి వ్యతిరేకి. అతను రెండు పర్యాయాలు కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు. మొదట 1907 సూరత్ సెషన్‌లో, దాదాభాయ్ నౌరోజీ తరువాత, కాంగ్రెస్ మితవాదులు, తీవ్రవాదులుగా విడిపోయింది, ఆ తర్వాత మద్రాసులోమరుసటి సంవత్సరం1908లో మరొకసారి కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు.

ఘోష్ బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ (1891–1894, కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు 1906–1909) గా పనిచేసాడు. అతను 1896 కొత్త సంవత్సర ఆనర్స్‌లో ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ (CIE) సహచరుడుగా నియమించారు. ఘోష్ 1909 సంవత్సరం పుట్టినరోజు వేడుకలలో ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా (CSI) సహచరుడుగా నియమించబడ్డాడు. అతను 1915 న్యూ ఇయర్ ఆనర్స్‌లో నైట్ పొందాడు. ఆ సంవత్సరం జూలై 14న అతని నైట్‌హుడ్‌తో సత్కరించబడ్డాడు.

రచనలు[మార్చు]

ఘోష్ సామర్ధ్యం, రచనలు కలకత్తా విశ్వవిద్యాలయంలో ఠాగూర్ లా ప్రొఫెసర్‌షిప్ (1875–1876), కలకత్తా విశ్వవిద్యాలయంనుండి గౌరవ డిఎల్ డిగ్రీ (1884) వంటి వరుస గౌరవాలు పొందాయి.అతను తన న్యాయపరమైన అభ్యాసం ద్వారా చాలా సంపదను సంపాదించాడు, కానీ దానధర్మాలు ద్వారా దానిలో ఎక్కువ భాగం ఖర్చుచేశాడు.1913లో అతను కలకత్తా విశ్వవిద్యాలయంలో శాస్త్రీయ అధ్యయనాల కోసం పది లక్షలరూపాయల మూలధనంతో ఎండోమెంట్‌ను స్థాపించాడు. జాదవ్‌పూర్‌లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎన్.సి.ఇ) స్థాపించడానికి అతను 13 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చాడు. ఇది తరువాత జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంగా మారింది. ఘోష్ ఎన్.సి.ఇ.మొదటి అధ్యక్షుడుగా పనిచేసాడు.సర్ రాష్‌బేహరీ ఘోష్ మహా విద్యాలయం 2010 లో ఖండఘోష్, ఉఖ్రిద్‌లో సి,డి,బ్లాక్‌లనందు స్థాపించబడింది.అతనుతన గ్రామంలోపాఠశాలలు, ఆసుపత్రిని స్థాపించాడు. [2]

ఘోష్ పేరుమీద కలకత్తాలో ఒక వీధి[మార్చు]

భారతదేశ ప్రజల కోసం ఘోష్ అందించిన సహకారాన్ని పరిశీలిస్తే, కోల్‌కతాలో ఒకవీధికి అతని పేరును పెట్టారు. [3] ఒక ప్రధాన మార్గానికి రాష్‌బేహరి అవెన్యూ అని అతని పేరును పెట్టారు. ఇది చెట్ల - సహానగర్ వంతెన నుండి (షహీద్ జతిన్ దాస్ సేతు) నుండి ప్రారంభమై తూర్పు వైపు బల్లిగుంజ్ గరియాహత్ వరకు నడుస్తుంది.

ప్రస్తావనలు[మార్చు]

  1. Sinha, D P. "Past Presidents — Rashbehari Ghose". Article. All India Congress Committee. Archived from the original on 23 డిసెంబరు 2019. Retrieved 18 March 2013.
  2. "Sir Rashbehari Ghosh Mahavidyalaya". SRGM. Retrieved 24 March 2017.
  3. P Thankappan Nair, A History of Calcutta's Streets, Publisher: Calcutta: Firma KLM, 1987

వెలుపలి లంకెలు[మార్చు]