రాస్ అడైర్
రాస్ అడైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| జననం | జార్జ్ రాస్ అడైర్ 1994 ఏప్రిల్ 21 హోలీవుడ్, కౌంటీ డౌన్, నార్దర్న్ ఐర్లాండ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చదువు | సలివాన్ అప్పర్ స్కూల్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| వృత్తి | క్రికెట్, రగ్బీ ఆటగాడు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ఎత్తు | 5 ft 11 in (180 cm) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బంధువులు | మార్క్ అడైర్ (సోదరుడు) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| క్రికెట్ సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బౌలింగు | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పాత్ర | పై వరుస బ్యాటరు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| జాతీయ జట్టు |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి T20I (క్యాప్ 56) | 2023 జనవరి 12 - జింబాబ్వే తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి T20I | 2025 సెప్టెంబరు 21 - ఇంగ్లాండ్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Years | Team | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2020–ప్రస్తుతం | నార్దర్న్ నైట్స్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2025 7 December | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Rugby union career | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జార్జ్ రాస్ అడైర్ (జననం హోలీవుడ్, కౌంటీ డౌన్, 1994 ఏప్రిల్ 21) ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన ఐరిష్ క్రికెటరు, మాజీ రగ్బీ యూనియన్ ఆటగాడు.
అతను దేశీయ క్రికెట్‌లో నార్తర్న్ నైట్స్ తరపున ఆడుతాడు. [1]
అతని తమ్ముడు మార్క్ అడైర్ కూడా క్రికెట్ ఆటగాడే. అతను ఐర్లాండ్ తరపున అన్ని ఫార్మాట్లలో ఆడాడు.[2][3]
రగ్బీ కెరీర్
[మార్చు]అడైర్ సుల్లివన్ అప్పర్ స్కూల్ తరపున స్కూల్స్ రగ్బీ ఆడాడు, 2011లో ఉల్స్టర్ స్కూల్స్ కప్‌లో ఆకట్టుకున్నాడు.
అతను ఇంగ్లాండ్, ఫ్రాన్స్‌లపై U19 స్థాయిలో ఐర్లాండ్ తరపున రెండు అంతర్జాతీయ క్యాప్‌లను పొందాడు. అతను బ్రిటిష్, ఐరిష్ కప్‌లో ఉల్స్టర్ రావెన్స్ తరపున ఆడాడు. ప్రో 12 లో ఉల్స్టర్ తరపున ఒక సీనియర్ ప్రదర్శనలో పాల్గొన్నాడు, 2015లో డ్రాగన్స్‌పై ఒక ట్రై చేశాడు.
అతను రెండున్నర సంవత్సరాలు RFU ఛాంపియన్‌షిప్‌లో జెర్సీ రెడ్స్ తరపున ఆడాడు. తుంటి వ్యాధి కారణంగా అతని కెరీర్ ముగిసింది. అతను మొత్తం 40 కి పైగా ప్రదర్శనలు ఇచ్చాడు. రెండు ఆపరేషన్ల తర్వాత, అతను బల్లినాహించ్ RFC తో అమెచ్యూర్ స్థాయిలో రగ్బీకి తిరిగి వచ్చాడు. 2019లో ఉల్స్టర్ సీనియర్ లీగ్‌ను గెలుచుకున్న జట్టులో ఉన్నాడు. ఉల్స్టర్ రగ్బీ అవార్డులలో క్లబ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు.
క్రికెట్ కెరీర్
[మార్చు]రాస్ 2020 ఆగస్టు 20న 2020 ఇంటర్-ప్రావిన్షియల్ ట్రోఫీలో నార్తర్న్ నైట్స్ తరపున తన ట్వంటీ20 రంగప్రవేశం చేసాడు.[4] 2021 జూన్ 30న నార్తర్న్ నైట్స్ తరపున 2021 ఇంటర్-ప్రావిన్షియల్ కప్‌లో లిస్ట్ A రంగప్రవేశం చేసాడు. [5]
2022 డిసెంబరులో రాస్, జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్ కోసం ఐర్లాండ్ క్రికెట్ జట్టుకు తన తొలి పిలుపు అందుకున్నాడు.[6] 2023 జనవరి 12న మొదటి T20I మ్యాచ్‌లో ఐర్లాండ్ తరపున ట్వంటీ20 అంతర్జాతీయ (T20I) రంగం లోకి అడుగు పెట్టాడు.[7]
2024 మేలో, అతను 2024 ICC పురుషుల T20 ప్రపంచ కప్ టోర్నమెంటు కోసం ఐర్లాండ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. [8]
2024 సెప్టెంబరు 29న దక్షిణాఫ్రికాతో అబుదాబిలో జరిగిన 2వ T20I లో అడైర్ తన తొలి T20I సెంచరీ సాధించాడు. అతను తొమ్మిది సిక్సర్లు కొట్టి, సరిగ్గా 100 (58) పరుగులు చేసాడు.[9] అతను ఈ ఘనత సాధించిన మూడవ ఐరిష్ వ్యక్తి. మొత్తం మీద ఐరిష్ క్రికెటర్లలో, కెవిన్ ఓ'బ్రియన్, పాల్ స్టిర్లింగ్, అమీ హంటర్, గాబీ లూయిస్‌లతో పాటు ఐదవవాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Rugby: Meet Jersey’s four new players", Jersey Evening Post, 14 April 2015
- ↑ "Rugby: Meet Jersey’s four new players", Jersey Evening Post, 14 April 2015
- ↑ Cricket: Ireland squad, BBC Sport, retrieved 2 June 2023
- ↑ "1st Match, Bready, Aug 20 2020, Cricket Ireland Inter-Provincial Twenty20 Trophy". ESPN Cricinfo. Retrieved 20 August 2020.
- ↑ "Rugby: Meet Jersey’s four new players", Jersey Evening Post, 14 April 2015
- ↑ "Ross Adair: Ex-Ulster rugby player brought into Ireland squad". BBC. 20 December 2022. Retrieved 20 December 2022.
- ↑ "Rugby: Meet Jersey’s four new players", Jersey Evening Post, 14 April 2015
- ↑ "Rugby: Meet Jersey’s four new players", Jersey Evening Post, 14 April 2015
- ↑ "Rugby: Meet Jersey’s four new players", Jersey Evening Post, 14 April 2015