Jump to content

రాహుల్ అహెర్

వికీపీడియా నుండి
డా.రాహుల్ దౌలత్రావ్ అహెర్
రాహుల్ అహెర్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014
ముందు శిరీష్‌కుమార్ కొత్వాల్
నియోజకవర్గం చందవాడ్

వ్యక్తిగత వివరాలు

జననం 1973 ఆగస్టు 16
నాసిక్, మహారాష్ట్ర, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు దౌలత్రావ్ అహెర్
జీవిత భాగస్వామి అనూజ
సంతానం 2 కుమారులు
వృత్తి రాజకీయ నాయకుడు

డా.రాహుల్ దౌలత్రావ్ అహెర్ (జననం 16 ఆగస్టు 1973) మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన చందవాడ్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

రాహుల్ అహెర్ తన తండ్రి దౌలత్రావ్ అహెర్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ కొత్వాల్ శిరీష్‌కుమార్ వసంతరావుపై 11,161 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ కొత్వాల్ శిరీష్‌కుమార్ వసంతరావుపై 27,744 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4]

రాహుల్ అహెర్ 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో చందవాడ్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ప్రహార్ జనశక్తి పార్టీ అభ్యర్థి గణేష్ నింబాల్కర్‌పై 48,961 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. "Chandvad Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). 23 November 2024. Retrieved 22 December 2024.
  2. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  3. The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  4. "Maharashtra Election 2019 Winners Full List: Check full list of winning candidates in Maharashtra Vidhan Sabha Chunav 2019". The Financial Express (in English). 25 October 2019. Archived from the original on 26 October 2022. Retrieved 26 October 2022.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  5. CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. "Maharastra Assembly Election Results 2024 - Chandwad" (in ఇంగ్లీష్). Election Commission of India. 23 November 2024. Archived from the original on 22 December 2024. Retrieved 22 December 2024.