రాహుల్ మమ్‌కూతతిల్
| రాహుల్ మామ్‌కూట్టతిల్ | |||
| |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2024 నవంబర్ 23 | |||
| ముందు | షఫీ పరంబిల్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | పాలక్కాడ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1989 నవంబర్ 12 అదూర్, పతనంతిట్ట, కేరళ | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| తల్లిదండ్రులు | ఎస్. రాజేంద్ర కురుప్, బీనా | ||
| బంధువులు | రజని (అక్క) | ||
రాహుల్ మమ్‌కూతతిల్ (ఆంగ్లం: Rahul Mamkootathil; జననం 1989 నవంబరు 12) కేరళ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 నవంబరులో పాలక్కాడ్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
జననం, విద్యాభ్యాసం
[మార్చు]రాహుల్ మమ్‌కూతతిల్ 1989 నవంబరు 12న పాతానంతిట్టలోని అదూర్‌లో మాజీ ఇండియన్ ఆర్మీ అధికారి ఎస్. రాజేంద్ర కురుప్, బీనా దంపతులకు జన్మించాడు. ఆయన తన పాఠశాల విద్యను అదూర్‌లోని తపోవన్ పబ్లిక్ స్కూల్‌లో, పందళంలోని సెయింట్ జాన్స్ స్కూల్‌లో పూర్తి చేసి ఆ తర్వాత పతనంతిట్టలోని కాథోలికేట్ కాలేజ్ నుండి గ్రాడ్యుయేషన్, ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కొట్టాయంలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నుండి ప్రస్తుతం పిహెచ్‌డి చేస్తున్నాడు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]రాహుల్ మామ్‌కూట్టతిల్ 2006లో కేరళ స్టూడెంట్స్ యూనియన్ (కేఎస్‌యూ) పతనంతిట్టలోని కాథోలికేట్ కాలేజీలో రాజకీయాలలోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ కేఎస్‌యూ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, ఆ తర్వాత 2013లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2023లో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. ఆయన 2024లో పాలక్కాడ్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) అభ్యర్థి సి. కృష్ణకుమార్ పై 18,840 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4][5][6]
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (23 November 2024). "Palakkad Assembly bypoll: UDF's Rahul Mamkootathil sets record victory" (in Indian English). Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
- ↑ Onmanorama (31 October 2024). "Former HSBC techie, doc-turned-IAAS and St Stephen's alumnus add glitter to Kerala's bypolls". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
- ↑ Election Commision of India (23 November 2024). "Palakkad Assembly Constituency By Poll Result 2024". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
- ↑ "Kerala bypoll results 2024: UDF cadre celebrate Palakkad win with trolleys". The Hindu (in Indian English). 23 November 2024. Archived from the original on 23 November 2024. Retrieved 23 November 2024.
- ↑ The News Minute (23 November 2024). "Palakkad bye-poll: Congress' Rahul Mamkootathil wins with historic margin of 18,840" (in ఇంగ్లీష్). Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.
- ↑ Onmanorama (23 November 2024). "Shafi successor Rahul Mamkootathil sets record in Palakkad with over 18k margin" (in ఇంగ్లీష్). Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.