రింగ్‌టోన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రింగ్‌టోన్ లేదా రింగ్ టోన్ (Ringtone) అనేది ఇన్‌కమింగ్ కాల్ లేదా పాఠ్య సందేశాన్ని (టెక్స్ట్ మెసేజ్) సూచించేందుకు టెలిఫోన్ చేసే శబ్దం. ఇది వాచ్యంగా ఒక శబ్దం కాదు, ఈ పదం ప్రస్తుతం తరచుగా మొబైల్ ఫోన్‌లలో ఉపయోగించే అనుకూలపరచదగిన శబ్దాలను సూచిస్తుంది.

నేపథ్యం[మార్చు]

ఒక ఇన్‌కమింగ్ కాల్‌కు సంబంధించిన సంకేతాన్ని నెట్‌వర్క్ గుర్తించినప్పుడు ఫోన్ మోగుతుంది, తద్వారా వినియోగదారును దీని గురించి అప్రమత్తం చేస్తుంది. ల్యాండ్‌లైన్ టెలిఫోన్‌ల విషయంలో, కాల్ సంకేతం టెలిఫోన్‌కు అనుసంధానం చేసివుండే స్విచ్ లేదా ఎక్స్ఛేంజ్ ద్వారా సృష్టించబడే ఒక విద్యుత్ ప్రవాహంగా ఉంటుంది. మొబైల్ ఫోన్‌ల విషయంలో ఇన్‌కమింగ్ కాల్‌ను సూచించేందుకు ఫోన్‌కు నెట్‌వర్క్ ఒక సందేశాన్ని పంపుతుంది.

ఒక ఇన్‌కమింగ్ టెలిఫోన్ కాల్ వస్తున్నప్పుడు వచ్చే శబ్దాన్ని టెలిఫోన్ "రింగ్" అంటారు. టెలిఫోన్‌లకు మొదట గంటలు మరియు ఒక విద్యుదయస్కాంత-ప్రేరేపిత క్లాపర్‌లతో కూడిన ఒక మోగే వ్యవస్థ ఉంటుంది, ఈ వ్యవస్థ నుంచి మోగుతున్న శబ్దం సృష్టించబడుతుంది, ఈ వాస్తవం నుంచే రింగ్ టోన్ అనే పదం ఉద్భవించింది. ముందుగా వివరించిన విద్యుత్ సంకేతం విద్యుత్ అయస్కాంతాలకు శక్తిని అందిస్తుంది, ఇవి వేగంగా కదిలి క్లాపర్‌ను విడిచిపెట్టడం, అది గంటలను కొట్టడం జరుగుతుంది. ఈ విద్యుదయస్కాంత గంట వ్యవస్థ ఇప్పటికీ విస్తృత వినియోగంలో ఉంది. ఒక వినియోగదారు టెలిఫోన్‌కు పంపబడే శబ్ద సంకేతం ఉత్తర అమెరికాలో 20 హెర్జ్ పౌనఃపున్యం వద్ద 90 వోల్ట్‌ల ఏసి ఉంటుంది. ఐరోపాలో అయితే 25 హెర్జ్‌ల వద్ద 60-90 వోల్ట్‌ల ఏసిని పంపుతారు.

ఇప్పటికీ సృష్టించబడే శబ్దాన్ని రింగ్‌గా పిలుస్తున్నారు, ఇటీవల తయారు చేసిన టెలిఫోన్‌లు ఎలక్ట్రానిక్స్ సాయంతో సరళమైన శబ్దాన్ని, కిచకిచ శబ్దాన్ని లేదా ఇతర శబ్దాన్ని సృష్టిస్తాయి. ఇన్‌కమింగ్ కాల్స్ యొక్క లక్షణాలను సూచించేందుకు రింగ్ సంకేతం యొక్క వైవిధ్యాన్ని ఉపయోగించవచ్చు (ఉదాహరణకు, తక్కువ నిడివితో మోగే శబ్దాలను ఒక నిర్దిష్ట నెంబర్ నుంచి వచ్చే కాల్‌కు సంకేతంగా ఉపయోగించవచ్చు).

మోగే సంకేతాన్ని ఒక విద్యుత్ టెలిఫోనీ సంకేతంగా చెప్పవచ్చు, ఇది ఇన్‌కమింగ్ కాల్ వచ్చినప్పుడు ఒక టెలిఫోన్ వినియోగదారును అప్రమత్తం చేసేందుకు ఉపయోగపడుతుంది. పీఓటీఎస్ టెలిఫోన్ వ్యవస్థలో, ఒక శబ్ద సంకేతాన్ని, అంటే లైన్‌లోకి సుమారుగా 100 వోల్ట్‌ల [అమెరికాలో 90 వోల్ట్‌ల ఏసీ మరియు 20 హెర్జ్] డిసి సంకేతాన్ని పంపడం ద్వారా ఇది సృష్టించబడుతుంది. స్థిర ప్రవాహ డిసి కేంద్రాభిముఖ్యతను మార్చదు; ఇది సున్నా నుంచి గరిష్ఠ వోల్టేజ్‌కు మరియు తిరిగి సున్నాకు ప్రవహిస్తుంది. ప్రస్తుతం ఈ సంకేతాన్ని ఎక్కువ దూరం డిజిటల్‌గా బదిలీ చేయవచ్చు, ఎక్కువ భాగం ల్యాండ్‌లైన్‌లు పూర్తిగా డిజిటల్ కాకపోవడం వలన కేవలం మోగే ప్రవాహంగా ఈ సంకేతం అందించబడుతుంది. పాత ఫోన్‌లలో, ఈ వోల్టేజ్‌ను ఒక అధిక-అవరోధ విద్యుత్ అయస్కాంతం ఫోన్‌లో బెల్‌ను మోగేలా చేసేందుకు ఉపయోగిస్తారు.

20వ శతాబ్దపు చివరి కాలంలో మరియు ఆ తరువాత అందుబాటులోకి వచ్చిన ఫిక్స్‌డ్ ఫోన్‌లలో ఈ రింగింగ్ కరెంట్ వోల్టేజ్‌ను గుర్తించి, ఎలక్ట్రానిక్స్ సాయంతో ఒక సరళమైన శబ్దాన్ని సృష్టిస్తుంది. మొబైల్ ఫోన్‌లు పూర్తిగా డిజిటల్‌గా ఉంటాయి, అందువలన సెల్ బేస్ స్టేషన్‌ల ద్వారా సమాచారాన్ని ప్రసారం చేసేందుకు ఉపయోగించే ప్రోటోకాల్‌లో భాగంగానే వాటికి రింగ్‌కు సంబంధించిన సంకేతం వస్తుంది.

పీఓటీఎస్ స్విచ్చింగ్ వ్యవస్థల్లో, టెలిఫోన్ హ్యాండ్‌సెట్‌ను స్విచ్ హుక్ నుంచి తీసినప్పుడు లైను యొక్క అవరోధం సుమారుగా 600 వోమ్‌లకు తగ్గించబడుతుంది, అప్పుడు రింగింగ్ ట్రిప్ అవుతుంది. ఇది టెలిఫోన్ కాల్‌కు సమాధానమిచ్చినట్లు సంకేతాన్ని ఇస్తుంది, టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ఆపై తక్షణమే రింగింగ్ సంకేతాన్ని తొలగించి కాల్‌ను కనెక్ట్ చేస్తుంది. రింగ్ ట్రిప్ లేదా ప్రి-ట్రిప్ అని పిలిచే సమస్యకు ఇది మూలంగా ఉంటుంది, లైన్‌లో రింగింగ్ సంకేతం కండక్టర్‌ల మధ్య అత్యధిక స్థాయిలో తక్కువ నిరోధాన్ని ఎదుర్కొన్నప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది, వినియోగదారు యొక్క టెలిఫోన్ రింగ్ అయ్యే అవకాశం ఏర్పడటానికి ముందే రింగ్‌ను ఇది ట్రిప్ చేస్తుంది (అతికొద్ది సమయంపాటు); పొడి వాతావరణం మరియు సరిగా ఏర్పాటు చేయని లైన్‌లలో ఈ సమస్య సాధారణంగా కనిపిస్తుంది.

వినియోగదారులు ఫోన్ ఎత్తేందుకు అది మోగడం ఆగిపోయే వరకు వేచివుండాలని ప్రారంభ పరిశోధన ఒకటి తెలియజేసింది.[ఉల్లేఖన అవసరం] ఈ సమస్యను పరిష్కరించేందుకు సంకేతంలోకి బ్రేక్‌లను (విరామాలను) చేర్చారు, దీని ఫలితంగానే ఈ రోజు రింగ్‌ల మధ్య విరామాలు ఉంటున్నాయి. ప్రారంభ పార్టీ లైన్ వ్యవస్థల్లో ఈ క్రమం ఫోన్‌ను ఎవరు ఎత్తాలనే దానిని సూచిస్తే మోర్స్ కోడ్ లెటర్‌గా ఉండేది, అయితే ప్రస్తుతం ప్రత్యేక లైన్‌లు అందుబాటులోకి రావడంతో, సింగిల్ రింగ్ మరియు డబుల్ రింగ్‌లు ఉపయోగంలో ఉన్న క్రమాలుగా ఉన్నాయి, మొదట ఉపయోగించిన మోర్స్ కోడ్ లెటర్‌లు టి (డ్యాష్) మరియు ఎం (డ్యాష్ డ్యాష్).[clarification needed]

రింగింగ్ క్రమాన్ని రింగ్ కాడెన్స్‌గా గుర్తిస్తారు. ఇది పీఓటీఎస్ ఫిక్స్‌డ్ ఫోన్‌లకు మాత్రమే వర్తిస్తుంది, వీటిలో అధిక వోల్టేజ్ రింగ్ సంకేతం రింగింగ్ క్రమాన్ని సృష్టించేందుకు స్విచ్చాన్ మరియు స్విచ్చాఫ్ అవుతుంది. ఉత్తర అమెరికాలో, ప్రామాణిక రింగ్ కాడెన్స్ 2-4 లేదా రెండు సెకన్లు రింగ్ తరువాత నాలుగు సెకన్ల నిశ్శబ్దం ఉంటుంది. ఆస్ట్రేలియా మరియు యుకేలలో, ప్రామాణిక రింగ్ కాడెన్స్ 400 ఎంఎస్ ఆన్, 200 ఎంఎస్ ఆఫ్, 400 ఎంఎస్ ఆన్, 2000 ఎంఎస్ ఆఫ్ ఉంటుంది. ఈ క్రమాలు ప్రాంతాన్నిబట్టి మారవచ్చు, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఇతర క్రమాలను ఉపయోగిస్తున్నారు.

చిన్న కార్యాలయం మరియు ఇంటిలో నిర్వహించబడే కార్యాలయం విషయంలో పార్టీ లైన్ రింగ్‌ను పోలిన ఒక సేవ అందుబాటులోకి వచ్చింది, ఇది ఫాసిమిల్ మిషిన్‌లు మరియు టెలిఫోన్‌లు ఒకే లైన్‌ను పంచుకునేందుకు వీలు కల్పించింది, అయితే వీటికి వేర్వేరు టెలిఫోన్ నెంబర్‌లు ఉంటాయి; ఈ క్లాస్ సౌకర్యాన్ని సాధారణంగా విలక్షణ రింగ్ ఉంటారు, అయితే కంపెనీలు వీటికి స్మార్ట్ రింగ్, డ్యూయట్, మల్టిపుల్ నెంబర్, ఐడెంట్-ఎ-కాల్ మరియు రింగ్‌మాస్టర్ వంటి ట్రేడ్‌మార్క్ పేర్లను పెట్టాయి. సహచరులు లేదా యువకుల కోసం ఒకే లైన్‌లో కేటాయించిన రెండో ఫోన్ నెంబర్‌కు కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించవచ్చు, ఇటువంటి సందర్భంలో కొన్నిసార్లు దీనిని టీన్ లైన్ అనే పేరుతో వ్యాపారం చేయడం జరుగుతుంది.

రింగ్ సంకేతాల యొక్క మొదటి మరియు రెండో బరస్ట్‌ల మధ్య నిశ్శబ్ద సమయంలో కాలర్ ఐడి సంకేతాలు పంపబడతాయి.

దృష్టిని ఆకర్షించేందుకు విరామాలతో కూడిన రింగ్ సంకేతాన్ని రూపొందించారు, విడిచివిడిచి వచ్చే రెండు టోన్‌ల రింగ్‌ను సులభంగా వినవచ్చని అధ్యయనాలు సూచించాయి.[ఉల్లేఖన అవసరం] పార్టీ లైన్‌లలో ఉపయోగించే సంకేతీకరించిన రింగ్ విషయంలో దీని వలన ఎటువంటి ఉపయోగం లేదు.

చరిత్ర[మార్చు]

ఏటీ & టీ ఏడు వేర్వేరు గోంగ్ మేళనాలను అందించింది, వీటిని మోడల్ 500 మరియు 2500 ల్యాండ్‌లైన్ టెలిఫోన్ సెట్‍‌లలో కనిపించే సి రకం రింగ్ కోసం అందుబాటులోకి తెచ్చింది. వినికిడి సమస్య ఉన్న వినియోగదారులకు ఈ గోంగ్‌లు విలక్షణమైన శబ్దాలను అందించాయి, పలు ఫోన్‌లను ఒకదానికొకటి సమీపంలో ఉంచినప్పుడు ఏ ఫోన్ రింగ్ అవుతుందో గుర్తించేందుకు ఇవి ఉపయోగపడతాయి.[1] డోర్‌బెల్ లేదా ఒక సాధారణ ఫోన్ మాదిరిగా మోగేందుకు బెల్ చిమ్‌ను అందుబాటులోకి తెచ్చారు.

ఫోన్ లైన్‌లకు తృతీయ-పక్ష పరికరాలను అనుసంధానం చేసేందుకు అనుమతించిన 1974 ఎఫ్‌సిసి తీర్పు తరువాత తయారీదారులు యాంత్రిక శబ్దాలకు బదులుగా ఎలక్ట్రానిక్ శబ్దాలు లేదా మెలోడీలతో మోగే టెలిఫోన్ రింగర్ ఉపకరణాలను తయారు చేయడం మొదలుపెట్టారు. ప్రజలు తమ సొంత రింగర్‌లను కూడా తయారు చేసుకున్నారు, ఒక మ్యూజికల్ గ్రీటింగ్ కార్డు నుంచి సేకరించిన చిప్‌తో కాల్ వచ్చినప్పుడు శ్రావ్యమైన శబ్దం మోగేలా ఈ రింగర్‌లు తయారు చేశారు.[2] 1989నాటి ఒక పుస్తకంలో వర్ణించినట్లుగా, ఇటువంటి రింగర్‌లో ఒక బొమ్మ కుక్కను కూడా అమర్చారు, కాల్ వచ్చినప్పుడు ఈ కుక్క అరవడం మరియు తోక ఊపడం జరుగుతుంది.[3] చివరకు ఎలక్ట్రానిక్ టెలిఫోన్ రింగర్‌లు సర్వవ్యాప్తమయ్యాయి. ఈ రింగర్‌లలో కొన్ని ఒక సింగిల్ టోన్‌ను సృష్టించాయి, ఇతరాలు రెండు లేదా మూడు శబ్దాల క్రమాన్ని లేదా ఒక సంగీత శబ్దాన్ని సృష్టించాయి.[4]

అనుకూలపరచదగిన రింగ్ టోన్‌లతో మొదట మార్కెట్‌లోకి వచ్చిన మొబైల్ ఫోన్ జపాన్‌కు చెందిన ఎన్‌టిటి డొకోమో డిజిటల్ మోవ్ ఎన్103 హైపర్‌ను ఎన్ఈసి తయారు చేయగా, అది మే 1996లో విడుదలైంది.[5] దీనిలో ఎంఐడిఐ ఫార్మాట్‌లో ముందుగానే అమర్చిన కొన్ని పాటలు ఉన్నాయి. సెప్టెంబరు 1996లో, ఐడివో ప్రస్తుత ఏయు, డెన్సో తయారు చేసిన డిజిటల్ మినిమో డి 319ను విక్రయించింది. వినియోగదారు ముందుగానే నిక్షిప్తం చేసిన పాటలకు బదులుగా ఒక వాస్తవ మెలోడీని అమర్చుకునే వీలు కల్పించిన మొదటి మొబైల్ ఫోన్‌గా ఇది గుర్తింపు పొందింది. జపాన్‌లో ఈ ఫోన్‌లకు బాగా ప్రాచుర్యం లభించింది; ప్రసిద్ధ పాటల స్నిప్పెట్‌లను ఉపయోగించేందుకు ఫోన్‌లను ఏ విధంగా అనుకూలపరచవచ్చో వివరాలు అందిస్తూ 1998లో ప్రచురించబడిన ఒక పుస్తకం[6] యొక్క 3.5 మిలియన్ కాపీలు విక్రయించబడ్డాయి.

డౌన్‌లోడ్ చేసుకోదగిన మొదటి మొబైల్ రింగ్ సేవను 1998 మూడో రుతువులో ఫిన్లాండ్‌లో సృష్టించడం మరియు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది, రేడియోలింజా (ఇప్పుడు ఎలిసాగా గుర్తించబడుతున్న ఫిన్లాండ్ మొబైల్ ఆపరేటర్) హార్మోనియం అనే పేరుతో ఈ సేవను ప్రారంభించింది.[7] మోనోఫోనిక్ రింగ్ టోన్‌లను సృష్టించేందుకు వినియోగదారులకు వీలు కల్పించే సాధనాలు మరియు వీటిని ఒక మొబైల్ హ్యాండ్‌సెట్‌కు ఎస్ఎంఎస్ ద్వారా ఓవర్-ది-ఎయిర్ (ఓటీఏ) (గాలిలో) అందించే వ్యవస్థ రెండూ హార్మోనియంలో ఉన్నాయి. నవంబరు 1998లో, డిజిటల్‌ఫోన్ గ్రూప్ (సాఫ్ట్‌బ్యాంక్ మొబైల్) జపాన్‌లో ఇటువంటి సేవనే ప్రారంభించింది.

రింగ్‌టోన్ సృష్టికర్తలు[మార్చు]

ఒక రింగ్ టోన్ సృష్టికర్త వినియోగదారు తమ యొక్క వ్యక్తిగత సంగీత సేకరణ నుంచి ఒక పాటను తీసుకునేందుకు, వారికి నచ్చినదానిని ఎంపిక చేసుకునేందుకు మరియు ఆ ఫైల్‌ను వారి మొబైల్ ఫోన్‌కు పంపేందుకు అనుమతిస్తారు. ప్రత్యక్ష అనుసంధానం ద్వారా మొబైల్ ఫోన్‌కు ఫైల్‌లను పంపవచ్చు (ఉదా., యుఎస్‌బి కేబుల్), బ్లూట్, పాఠ్య సందేశం లేదా ఇ-మెయిల్ ద్వారా కూడా వీటిని పంపవచ్చు.

మొదటి రింగ్‌టోన్ సృష్టికర్తగా హార్మోనియం గుర్తింపు పొందింది, దీనిని వెసా-మేట్టి పానానెన్ అనే ఫిన్లాండ్ కంప్యూటర్ ప్రోగ్రామర్ అభివృద్ధి చేశారు, ఇది 1997లో నోకియా స్మార్ట్ మెసేజింగ్‌తో విడుదలైంది.[8][9]

కొన్ని కంపెనీలు వినియోగదారులు సొంతగా సంగీత శబ్దాలను సృష్టించుకునేందుకు వీలు కల్పిస్తాయి, మెలోడీ కంపోజర్ లేదా నమూనా/లూప్ ఉపకరణం (అనేక సోనీ ఎరిక్‌సన్ ఫోన్‌లలో ఉండే మ్యూజిక్ డిజే వంటివి) వంటివి వినియోగదారులకు సొంతగా రింగ్ టోన్‌లను సృష్టించుకోవడానికి వీలు కల్పిస్తాయి. ఇవి తరచుగా ఒక నిర్దిష్ట ఫోన్ మోడల్ లేదా బ్రాండ్‌కు మాత్రమే అందుబాటులో ఉండే ఎన్‌కోడింగ్ ఫార్మాట్‌లను ఉపయోగిస్తాయి. ఎంఐడిఐ లేదా ఎంపీ3 వంటి ఇతర ఫార్మాట్‌లకు ఎక్కువగా మద్దతు ఉంటుంది; ఒక సాధారణ రింగ్ టోన్‌గా ఉపయోగించుకోవడానికి వాటిని తప్పనిసరిగా ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవాలి.

ఒక వ్యక్తి రింగ్‌టోన్‌ను కొనుగోలు చేసినప్పుడు, సేవలు అందించే సంస్థ (రింగ్‌టోన్‌లను విక్రయించే కంపెనీ) తమ సొంత టోన్‌ను సృష్టించడం లేదా ముందుగా ఉన్న టోన్‌ను చేర్చి మిశ్రమ టోన్‌ను చేయడం చేస్తుంది. రింగ్ టోన్‌ను సృష్టించిన తరువాత, దీనిని ఒక ప్రత్యేక ఫైల్ ఫార్మాట్‌లో ఉంచి ఎస్ఎంఎస్ ద్వారా వినియోగదారు ఫోన్‌కు పంపుతారు. ముందుగా ఉన్న పాటను కంపెనీ ఉపయోగించినట్లయితే, వారు పాట యజమానిగా ఉన్న వ్యక్తికి భరణం చెల్లించాల్సి ఉంటుంది. పాట యజమానికి పూర్తిగా డబ్బు రాదు; మొత్తం డబ్బులో గణనీయమైన భాగం సెల్ ఫోన్ సేవా సంస్థకు ఇవ్వాల్సి ఉంటుంది.[10]

డౌన్‌లోడ్ చేయదగిన సాఫ్ట్‌వేర్ లేదా డిజిటల్ ఆడియో ఎడిటర్ అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో రింగ్ టోన్ సృష్టించడానికి వీలు కల్పించే మొదటి తృతీయ పక్ష సేవా సంస్థగా 2005లో "స్మాష్‌దిటోన్స్" (ఇప్పుడు "మొబైల్17") గుర్తింపు పొందింది. తరువాత, యాపిల్ యొక్క ఐఫోన్ తమ వినియోగదారులు ఫోన్ యొక్క ఐట్యూన్స్ లైబ్రరీలోని ఏ పాట నుంచైనా రింగ్‌టోన్‌ను సృష్టించుకునేందుకు వీలు కల్పించింది[11], అయితే దీనిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, 40-సెకన్ల పరిమితి ఉండటం మరియు .m4r ఎక్స్‌టెన్షన్ పేరుతో ఉండే ఏఏసి ఫార్మాట్‌లోనే ఫైల్ ఉండాల్సి రావడం ఈ ఇబ్బందుల్లో భాగంగా ఉన్నాయి.

డిజిటల్ మ్యూజిక్ లేదా ఇతర శబ్ద ఫైల్‌ల నుంచి వినియోగదారులు రింగ్ టోన్‌లు తయారు చేసుకునేందుకు వివిధ రకాల వెబ్‌సైట్‌లు వీలు కల్పిస్తున్నాయి; అప్‌లోడ్ చేసుకునే పాటల సంఖ్యపై ఎటువంటి పరిమితి లేకుండా నేరుగా మొబైల్ ఫోన్‌లోకి ఈ వెబ్‌సైట్‌లు వాటిని పంపుతాయి.

రింగ్‌టోన్ వ్యాపారం[మార్చు]

వినియోగదారులు రింగ్‌టోన్‌లకు $3 వరకు చెల్లించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తుండటంతో, మొబైల్ సంగీతం, సంగీత పరిశ్రమలో ఒక లాభదాయక భాగంగా మారింది.[12] అంచనాలు భిన్నంగా ఉన్నప్పటికీ; మాన్‌హట్టన్‌కు చెందిన మార్కెటింగ్ మరియు కన్సల్టింగ్ సంస్థ కాన్సెక్ట్ 2004లో ప్రపంచవ్యాప్తంగా $4 బిలియన్‌ల విక్రయాలు జరిగినట్లు అంచనా వేసింది.[9] ఫార్చూన్ మేగజైన్ అంచనాల ప్రకారం, 2005లో ప్రపంచవ్యాప్తంగా రింగ్‌టోన్‌ల వ్యాపారం విలువ $2 బిలియన్‌ల వద్ద ఉంది.[13] సౌండ్ ఫైళ్లు పెరిగిపోవడంతో రింగ్‌టోన్‌లకు మంచి ప్రజాదరణ లభించింది. ఉదాహరణకు 2003లో, యుఎస్ $900 మిలియన్ల విలువైన జపనీస్ రింగ్‌టోన్ మార్కెట్‌లో యుఎస్ $66.4 మిలియన్‌ల విలువైన రింగ్‌టోన్ విక్రయాలు జరిగాయి.[14] 2003లో, అంతర్జాతీయ రింగ్‌టోన్ పరిశ్రమ విలువ US $2.5 మరియు $3.5 బిలియన్‌ల మధ్య ఉంటుంది.[14] 2007లో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో రింగ్ టోన్ విక్రయాలు $714 మిలియన్‌ల గరిష్ఠ స్థాయిని చేరుకున్నట్లు 2009లో పరిశోధన సంస్థ ఎస్ఎన్ఎల్ కగన్ వెల్లడించింది.[15] ఎస్ఎన్ఎల్ కగన్ 2008లో US విక్రయాలు $542 మిలియన్‌లకు పడిపోయాయని అంచనా వేసింది, వినియోగదారులు సొంతగా రింగ్‌టోన్‌లు చేసుకోవడం నేర్చుకోవడం వలన ఈ విక్రయాలు తగ్గాయని తెలిపింది.[12]

బిల్లు వివాదాలు[మార్చు]

రింగ్ టోన్ వ్యాపారం పరిశ్రమ యొక్క వ్యాపార విధానాలపై వివాదాన్ని సృష్టించింది.

చట్టపరమైన దావాలు[మార్చు]

జేమ్‌స్టెర్[మార్చు]

ఏప్రిల్ 2005లో కల్లాహాన్‌కు చెందిన మెక్‌కూన్ అండ్ విల్లీస్ అనే న్యాయవాద సంస్థ జేమ్‌స్టెర్!పై దావా వేసింది. శాన్ డియెగోకు చెందిన ఒక వ్యక్తి మరియు అతని పదేళ్ల కుమార్తె తరపున ఈ కేసు పెట్టారు.[16] ఈ దావా ప్రకారం జేమ్‌స్టెర్! మోసపూరిత మరియు తప్పుడు ప్రకటనలను ఉపయోగించడం ద్వారా సెల్యులార్ టెలిఫోన్ ఖాతాదారులను నష్టపరిచిందని ఆరోపించారు. పాఠ్య సందేశం (టెక్స్ట్ మెసేజ్) ద్వారా ప్రకటనకు స్పందించిన సెల్ ఫోన్ వినియోగదారులకు ఒక ఉచిత రింగ్ టోన్‌ను అందిస్తున్నట్లు ప్రకటనలు ఇచ్చారని, అయితే వినియోగదారులు తద్వారా ఒక నెలసరి సేవను పొందబోతున్నట్లు తెలియజేయడంలో సంస్థ విఫలమైందని ఆరోపించారు.[17] ఈ దావాలో మరో నలుగురు వ్యక్తులు కూడా ఉన్నారు, ఈ వివాదాన్ని నవంబరు 2009లో పరిష్కరించుకున్నారు.[18][19]

శాటర్‌ఫీల్డ్ - సైమన్ & షుస్టర్ కేసు[మార్చు]

జూన్ 2007లో, క్లాస్ యాక్షన్ కేసు శాటర్‌ఫీల్డ్-సైమన్ & షుస్టర్, నెం. C 06-2893 CW, 2007 U.S. డిస్ట్రిక్ట్ లెక్సిస్ 46325 (N.D. Cal. 2007 జూన్ 26)లో తీర్పు (తరువాత తీర్పును కొట్టివేశారు) వెలువడింది. ఒక ప్రసిద్ధ రచయిత యొక్క మొబైల్ క్లబ్‌ను ప్రోత్సహించేందుకు సెల్యులార్ ఫోన్‌లకు ఎస్ఎంఎస్ పాఠ్య సందేశాలను బదిలీ చేయడానికి సంబంధించిన వివాదంపై ఈ కేసు పెట్టారు. ప్రతివాదులైన, ప్రచార సందేశాలు బదిలీ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న ప్రచురణ సంస్థ మరియు సందేశాలను వాస్తవానికి పంపించిన సర్వీస్ ప్రొవైడర్ వాదనల ప్రకారం, సూచించిన ఖాతాదారు, అంటే బాలుడి తల్లి ఒక ఉచిత రింగ్ టోన్ పొందడానికి ప్రోత్సాహక సందేశాలను తనకు బదిలీ చేసందుకు అనుమతి ఇచ్చినట్లు, ఆన్‌లైన్‌లోని పత్రంలో ఒక బాక్స్‌లో "అవును! నెక్స్‌టోన్స్ అనుబంధ సంస్థలు మరియు బ్రాండ్‌ల నుంచి ప్రచార సందేశాలను పొందడం నాకు సమ్మతమే…." అనేదానిపై టిక్ చేసినట్లు చెప్పారు.

న్యాయమూర్తి క్లాడియా విల్కెన్ ఎస్ఎంఎస్ పాఠ్య సందేశాలు టిసిపిఏ పరిధిలోకి రావని, అందువలన ఎస్ఎంఎస్ సందేశాలు పంపిన పద్ధతి ఆటోమేటిక్ టెలిఫోన్ డయలింగ్ సిస్టమ్ ప్రామాణిక నిర్వచనం పరిధిలో ఉండదని తీర్పు చెప్పారు, ఉచితంగా రింగ్ టోన్ పొందేందుకు విస్తృతంగా రాసిన అనుమతి పత్రంలో ప్రచార సందేశాలు పొందేందుకు వాది అంగీకరించారని సూచించారు. తొమ్మిదో సర్క్యూట్ కోర్టు ఆఫ్ అప్పీల్స్ ఈ తీర్పును తోసిపుచ్చింది, ప్రచురణ సంస్థ సైమన్ & షుస్టర్ ఈ దావా కింద 90 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని తీర్పు చెప్పింది. న్యాయమూర్తి క్లాడియా విల్కెన్ ఆగస్టు, 2010న పరిహారానికి తుది ఆమోదం తెలిపారు, దావా వేసిన ప్రతి సభ్యుడికి $175 నగదు చెల్లిస్తూ ఈ వివాదాన్ని చివరకు పరిష్కరించారు.[20][21]

ప్రజా సౌకర్యాల కమిషన్ ఫిర్యాదు[మార్చు]

జులై 20, 2005న యుటిలిటీ కన్స్యూమర్స్ యాక్షన్ నెట్‌వర్క్ అనే కాలిఫోర్నియా స్వచ్ఛంద సంస్థ కాలిఫోర్నియా పబ్లిక్ యుటిలిటీ కమిషన్ (CPUC)లో సింగ్యులర్ వైర్‌లెస్‌పై ఫిర్యాదు చేసింది, రింగ్ టోన్ వంటి సమాచార ప్రసారంతో సంబంధం లేని సేవలకు అనధికారిక బిల్లులు వసూలు చేయడంపై ఈ ఫిర్యాదులో అభ్యంతరం వ్యక్తం చేశారు.[22] సింగ్యులర్ సంస్థ తమ ఖాతాదారుల నుంచి జేమ్‌స్టెర్! కోసం బిల్లు వసూలు చేసిందని యుసిఏఎన్ పేర్కొంది. అంతేకాకుండా ఇటువంటి ఇతర రింగ్ టోన్ సేవల విషయంలో వినియోగదారులకు ఎటువంటి సమాచారం లేకుండా, కనీస అనుమతులు తీసుకోకుండా ఛార్జీలు వసూలు చేశారని ఆరోపించింది.[23] అనేక సిపియుసి నిబంధనలను సింగ్యులర్ ఉల్లంఘిస్తున్నట్లు యుసిఏఎన్ ఆరోపించింది, వైర్‌లెస్ ఫోన్ బిల్లులో సమాచార ప్రసార యేతర సేవా ఛార్జీల గురించి తమకు వీటి విషయంలో ఎటువంటి బాధ్యత లేదని మరియు దీనికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానమివ్వలేమని వినియోగదారులకు పదేపదే చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.[23][24]

రింగ్‌టోన్‌లపై స్పందనలు[మార్చు]

రింగ్‌టోన్‌లకు సంబంధించి ఎటిక్వెట్ సెల్ ఫోన్ సంస్కృతిలో ఒక అత్యంత వివాదాస్పదమైన కోణంగా ఉంది. ఇన్‌కమింగ్ కాల్ గురించి గ్రహీతను అప్రమత్తం చేసేందుకు అలంకారాత్మక విలువ కోసం వీటిని తరచుగా ఉపయోగిస్తున్నప్పటికీ, గ్రహీత చుట్టూ ఉన్న ఇతర వ్యక్తులు ఈ శబ్దాన్ని ఇబ్బందికరంగా పరిగణించవచ్చు. కొన్ని కంపెనీలు పని ప్రదేశాల్లో రింగ్‌టోన్‌లను నిషేధించిన సందర్భాలు లేకపోలేదు; ఒక ఆస్ట్రేలియా కంపెనీ తమ ఉద్యోగుల ఫోన్‌ల నుంచి రింగ్‌టోన్ వచ్చిన ప్రతిసారీ జరిమానా విధించడం ద్వారా మరో అడుగు ముందుకేసింది. సెల్ ఫోన్ ఉన్న వృత్తి నిపుణుల్లో, 18 శాతం మంది ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగిస్తున్నప్పుడు తమ రింగ్ టోన్ లిస్ట్‌లోకి వెళ్లి ఒకదాని తరువాత ఒకదానిని వినడం చేస్తున్నట్లు ఒక అధ్యయనం తెలియజేసింది.[25] రింగ్‌‌టోన్‌లకు సంబంధించి మరో స్పందన ఏమిటంటే, వీటి ద్వారా ఒక నిర్దిష్ట సంస్కృతి ఏర్పడింది. వ్యక్తులను వారి రింగ్‌టోన్‌ల బట్టి గుర్తించే సంస్కృతి ప్రారంభమైంది, మొబైల్ ఫోన్‌ల ఎంపిక ద్వారా కూడా వ్యక్తులను గుర్తించే సంస్కృతి ఒకటి దీనికి ముందే ఏర్పడింది. కాల్‌ను స్వీకరించేవారితోపాటు, బహిరంగ పరిస్థితుల్లో ఉండేవారిని దృష్టిలో ఉంచుకొని కూడా రింగ్‌టోన్‌లను తయారు చేయడం జరుగుతుంది, తద్వారా ఇతరులకు కూడా వినసొంపైన రింగ్‌టోన్‌ను సృష్టించడంపై మొగ్గు చూపుతున్నారు (లికోప్ 148). ఒక ఫోన్‌ను ఎంపిక చేసుకోవడం ద్వారా ఆ వ్యక్తి ఏరకానికి చెందినవారో చెప్పడమే కాకుండా, తమకు ఇష్టమైన సంగీతంతో కూడా ఇతరుల దృష్టిని ఆకర్షించవచ్చనే భావనలు ఉన్నాయి. తమను తాము ప్రత్యేకమైన వ్యక్తిగా చాటుకునేందుకు వ్యక్తులు సందేశాలను పంపినట్లుగా ఇది కూడా ఉంటుంది. ఇదిలా ఉంటే, సమూహంలో తక్కువగా గుర్తించబడేవి మరియు అటువంటి పరిస్థితికి తగినవిగా ఉండేందుకు రింగ్‌టోన్‌లను ఎంపిక చేస్తున్నట్లు ఒక చర్చ జరుగుతుంది. కొందరు వినియోగదారులు తమను అనేక మందిలో ప్రత్యేకంగా నిలబెట్టేందుకు ఒక మిశ్రమ సాంస్కృతిక మూలాల నుంచి తమ రింగ్‌టోన్‌ను ఉద్దేశపూర్వకంగా ఎంచుకోవడం జరుగుతుంది. తమకు సంబంధించిన వ్యక్తులు తమను స్వీకరిస్తారనే భావనతో ఇటువంటి సంగీత రింగ్‌టోన్‌లను ఎంపిక చేసే అవకాశం కూడా ఉంది (లికోప్ 148). ట్యూన్‌లను సులభంగా గుర్తించే అవకాశం ఉండటం వలన, వ్యక్తులు వీటిని పట్టించుకోకుండా ఉండటం లేదా దృష్టి మరలకుండా చూసుకునేందుకు వీలుంటుంది.[26]

రింగ్ టోన్‌లలో రకాలు[మార్చు]

మోనోఫోనిక్
మోనోఫోనిక్ రింగ్ టోన్ అనేది సంగీత స్వరాల సాధారణ శ్రేణి, ఒక సమయంలో ఒక స్వరం మాత్రమే వస్తుంది.
పాలిఫోనిక్
పాలిఫోనిక్ రింగ్ టోన్‌లో ఏకకాలంలో వినిపించే అనేక స్వరాలు ఉంటాయి. మొదటి పాలిఫోనిక్ రింగ్ టోన్‌లకు ఎంఐడిఐ వంటి క్రమపరిచిన రికార్డింగ్ పద్ధతులను ఉపయోగించారు. ఒక నిర్ణీత సమయంలో ఏ స్వరం వినిపించాలో ఈ రికార్డింగ్‌లు నిర్ణయిస్తాయి, వాస్తవ పరికర శబ్దం నేపథ్య పరికరంపై ఆధారపడివుంటుంది. తరువాత, సమన్వయ పరికరాలను కూర్పు సమాచారంతోపాటు చేర్చవచ్చు, ప్రతి ఫోన్ యొక్క నిక్షిప్త శబ్ద నిధికి వెలుపల మరిన్ని వివిధ శబ్దాలను ఉపయోగించేందుకు ఇది వీలు కల్పించింది.
ట్రూటోన్
ట్రూటోన్ (దీనిని "రియల్‌టోన్", "మాస్టర్‌టోన్", "సూపర్‌ఫోనిక్ రింగ్‌టోన్" లేదా "ఆడియో రికార్డింగ్" అనే పేర్లతో కూడా పిలుస్తారు) అనేది సాధారణంగా ఒక ఆడియో రికార్డింగ్, ఎక్కువగా ఎంపీ3 లేదా ఏఏసి వంటి ఒక సాధారణ ఫార్మాట్‌లో ఇది ఉంటుంది. తరచుగా పాటల నుంచి సేకరించే ఈ ట్రూటోన్‌లు రింగ్ టోన్‌లు బాగా ప్రజాదరణ పొందాయి. డిసెంబరు 2002లో మొదటి ట్రూటోన్ సేవను ఏయు ప్రారంభించింది.[27] కెమిస్ట్రీలోని "మై గిఫ్ట్ టు యు" అనే పాట మొదటి ట్రూటోన్‌గా పంపిణీ చేయబడింది.
సింగ్ టోన్
కరోక్ శైలిలో సృష్టించే రింగ్ టోన్‌ను సింగ్ టోన్ అని పిలుస్తారు, దీనిని ఒక నేపథ్య ట్రాక్‌తో వినియోగదారు గాత్రాన్ని రికార్డు చేసి (సమయం మరియు ట్యూన్ రెండింటిలో సర్దుబాటు చేస్తారు) సృష్టిస్తారు.
వీడియో రింగ్‌టోన్
వీడియో రింగ్ టోన్ అనేది ఒక వీడియో భాగాన్ని రింగ్‌టోన్‌గా ఉపయోగించడాన్ని సూచిస్తుంది (దీనిని ఎక్కువగా 3జి ఫోన్‌లలో ఉపయోగిస్తారు). ఎటువంటి వీడియోనైనా ఈ రింగ్‌ టోన్‌గా ఉపయోగించవచ్చు, అయితే ఎక్కువగా మ్యూజిక్ వీడియోలను ఈ రింగ్‌టోన్‌లుగా ఉపయోగిస్తున్నారు. ఎటువంటి విరామం లేకుండా శబ్దం మరియు వీడియో ట్రాక్ ఉండే టోన్‌లు వీటికి ఉత్తమ ఉదాహరణలు. వీడియో మరియు ఆడియో కాలర్ ఐడెంటిఫికేషన్ కోసం ఫోన్‌లోని కాంటాక్ట్‌లకు వ్యక్తిగత వీడియో రింగ్‌టోన్‌లను ఉఫయోగించడం సాధ్యపడుతుంది.

రింగ్ టోన్ ఎన్‌కోడింగ్ ఫార్మాట్‌లు[మార్చు]

 • 3GP: ఒక వీడియో రింగ్‌టోన్ కోసం ఉపయోగించే ఒక మల్టీమీడియా కంటైనర్ ఫార్మాట్. 3జియుఎంటీఎస్ మల్టీమీడియా సర్వీసెస్ కోసం థర్డ్ జనరేషన్ పార్టనర్‌షిప్ ప్రాజెక్ట్ 3జిపిపి ద్వారా కనిపెట్టబడింది. దీనిని 3జి మొబైల్ ఫోన్‌లలో ఉపయోగిస్తారు, కొన్ని 2జి మరియు 4జి ఫోన్‌లలో కూడా ఉపయోగించవచ్చు.
 • AAC: సోనీ ఎరిక్‌సన్ W810i వంటి కొన్ని ఫోన్‌లు ".m4a" AAC ఫార్మాట్‌కు మద్దతు ఇస్తాయి. ఐఫోన్ కూడా ".m4r" AAC ఫార్మాట్‌కు మద్దతు ఇస్తుంది. ".m4r" ఫార్మాట్ కూడా ".m4a" ఫార్మాట్ మాదిరిగానే ఉంటుంది, అయితే ఇది ఒక ".m4r" ఫైల్‌లో DRM శైలి కాపీ భద్రతకు వీలు కల్పిస్తుంది.
 • AMR: ఎంపీ3 ప్రామాణికం కాకముందు నోకియా ఆడియో కంప్రషన్ ఫార్మాట్‌ను ఉపయోగించింది.
 • ఇమెలోడీ: పాత మోనోఫోనిక్ ఎరిక్‌సన్ ఫార్మాట్.
 • ఐమెలోడీ: నోకియా యొక్క స్మార్ట్ మెసేజింగ్‌కు మద్దతు లేని అనేక కొత్త ఫోన్‌లు ఈ మోనోఫోనిక్ ఫార్మాట్‌ను ఉపయోగిస్తున్నాయి.
 • KWS: క్యోసెరా యొక్క రింగర్ ఫార్మాట్.
 • MID / MIDI: ప్రసిద్ధ సౌండ్ ఫార్మాట్.
 • మోర్స్ కోడ్: .MORSE ఎక్స్‌టెన్షన్‌తో ఉండి మోర్స్ కోడ్ పాటలుగా మార్చబడే టెక్స్ట్ ఫైళ్లు.
 • MOT: మోటరోలా ఫోన్‌లకు ఉద్దేశించిన ఒక పాత రింగర్ ఫార్మాట్.
 • MP3: ఎంపీ3 ఫార్మాట్‌లోని రింగ్‌టోన్‌లకు దాదాపుగా అన్ని ఫోన్‌లు మద్దతు ఇస్తాయి.
 • నోకియా / SCKL / OTT: నోకియా స్మార్ట్ మెసేజింగ్ ఫార్మాట్. నోకియా ఫోన్‌లు రింగ్ టోన్‌లను ఒక పాఠ్య సందేశంగా పొందగలవు. రింగ్ టోన్ సాధనాలు ఈ పాఠ్య సందేశాలను సృష్టిస్తాయి. అనుకూలమైన ఫోన్ ఉన్న ఎవరైనా తమ సొంత రింగ్ టోన్‌లను డేటా కేబుల్ లేకుండా లోడ్ చేసేందుకు ఇది వీలు కల్పిస్తుంది. నోకియా కాకుండా ఇతర ఫోన్‌లు కూడా దీనిని ఉపయోగిస్తాయి.
 • OGG వోర్బిస్s: ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్‌లలో దీనిని ఉపయోగిస్తున్నారు.
 • PDB: పామ్ డేటాబేస్. క్యోసెరా 6035 మరియు హ్యాండ్‌స్ప్రింగ్ ట్రెయో వంటి పిడిఏ ఫోన్‌లలో రింగ్ టోన్‌లను లోడ్ చేసేందుకు ఈ ఫార్మాట్‌ను ఉఫయోగిస్తారు.
 • PMD: క్వాల్‌కమ్ మరియు జపనీస్ కంపెనీ ఫెయిత్ సంయుక్తంగా రూపొందించిన ఫార్మాట్ ఇది, దీనిలో MIDI, నమూనా (PCM) ఆడియో, స్టాటిక్ గ్రాఫిక్‌లు, యానిమేషన్, టెక్స్ట్, వైబ్రేషన్ మరియు ఎల్ఈడీ ఈవెంట్‌లు ఉంటాయి.
 • QCP: క్వాల్‌కమ్ ప్యూర్‌వాయిస్ సాఫ్ట్‌వేర్ ద్వారా సృష్టించబడే ఫైల్ ఫార్మాట్ ఇది. సాధారణ గాత్ర రికార్డింగ్‌లకు ఇది బాగా సరిపోతుంది.
 • RTTTL: రింగ్ టోన్‌లకు సంబంధించిన ఒక ప్రసిద్ధ టెక్ట్స్ ఫార్మాట్.
 • RTX: RTTTL మాదిరిగా ఉండే అధునాతన సౌకర్యాలు గల ఫార్మాట్ ఇది. RTXపై ఆక్టేవ్‌లు భిన్నంగా ఉంటాయి.
 • సామ్సంగ్1 & సామ్సంగ్2: సామ్సంగ్ కీప్రెస్ ఫార్మాట్.
 • సీమెన్స్ కీప్రెస్: సీమెన్స్ టెక్స్ట్ ఫైల్ ఫార్మాట్‌లో సృష్టించవచ్చు మరియు రీడ్ చేయవచ్చు.
 • సీమెన్స్ SEO: సీమెన్స్ SEO బైనరీ ఫార్మాట్.
 • SMAF: ఉపకరణ శబ్ద డేటాతో MIDIని చేర్చిన యమహా మ్యూజిక్ ఫార్మాట్ (వీటిని మాడ్యూల్ ఫైల్‌లుగా కూడా గుర్తిస్తారు). ఫైల్ పేర్లకు "MMF" లేదా "MLD" అనే ఎక్స్‌టెన్షన్ ఉంటుంది.
 • SRT: సిపురా టెక్నాలజీ Sipura Technology VoIP ఫోన్‌లకు ఉద్దేశించిన సిపురా రింగ్ టోన్.

వీటిని కూడా చూడండి[మార్చు]

 • నోకియా ట్యూన్
 • రింగ్‌బ్యాక్ టోన్
 • రింగిల్ (సంగీతం)
 • టీన్ బజ్

సూచనలు[మార్చు]

 1. C-టైప్ రింగర్స్- మెయిటేనెన్స్. బెల్ సిస్టమ్ ప్రాక్టిస్, ఇష్యూ 4 (సెప్టెంబరు 1978), సెక్షన్ 501-250-303
 2. సోకోలోవ్‌స్క్రీ, స్టీవ్ (1989). "కస్టమైజ్ యువర్ ఫోన్", ఛాప్టర్ 8 "టెలిఫోన్ మెలోజీ రింగర్". TAB బుక్స్, బ్లూ రిడ్జ్ సమ్మిట్, PA. ISBN 0-8306-9354-8.
 3. సోకోలోవ్‌స్కీ, స్టీవ్ (1989). "కస్టమైజ్ యువర్ ఫోన్", Ch. 20 "యానిమేటెడ్ టెలిఫోన్ రింగర్". TAB బుక్స్, బ్లూ రిడ్జ్ సమ్మిట్, PA. ISBN 0-8306-9354-8.
 4. బిగెలోవ్, కార్ మరియు విండెర్ (2001). "అండర్‌స్టాండింగ్ టెలిఫోన్ ఎలక్ట్రానిక్స్", ఫోర్త్ ఎడిషన్. న్యూనెస్. ISBN 0-7506-7175-0.
 5. (Japanese లో) asahi.com, సేకరణ తేదీ సెప్టెంబరు 6, 2008 (క్యాచీ)
 6. ケータイ着メロ ドレミBOOK (Japanese లో). 1998. Unknown parameter |trans_title= ignored (help); Unknown parameter |month= ignored (help)CS1 maint: unrecognized language (link)
 7. టైమ్ మేగజైన్ యూరప్: ది స్వీట్ సౌండ్ ఆఫ్ సక్సెస్
 8. ఫస్ట్ ఎవర్ ఎంఈఎఫ్ స్పెషల్ రికగ్నిషన్ అవార్డ్ గోస్ టు ది పయనీర్ ఆఫ్ మొబైల్ రింగ్ టోన్ బిజినెస్ - వెస్కు పాననెన్, జూన్ 4, 2004 పత్రికా ప్రకటన, మొబైల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫోరమ్ నుంచి
 9. 9.0 9.1 రింగ్ మై బెల్, ది న్యూ యార్కర్ నుంచి 2005నాటి కథనం.
 10. గోపీనాథ్ ఎస్. (2005). రింగ్‌టోన్స్ ఆర్ ది ఆడిటరీ లాజిక్ ఆఫ్ గ్లోబలైజేషన్. ఫస్ట్ మండే, 10(12), 3.
 11. ఎవాల్యూషన్ ఆఫ్ రింగ్‌టోన్స్ ఫ్రమ్ సెండ్‌మి మొబైల్
 12. 12.0 12.1 Greg Sandoval (September 3, 2009). "Apple to offer ready-made ringtones". CNET. CNN.
 13. Mehta, Stephanie N. (December 12, 2005). "Wagner's ring? Way too long". Fortune. p. 40. Cite web requires |website= (help)
 14. 14.0 14.1 గోపీనాథ్, సుమంత్. "రింగ్‌టోన్స్ ఆర్ ది ఆడిటరీ లాజిక్ ఆఫ్ గ్లోబలైజేషన్." ఫస్ట్ మండే 10.12 (2005): 3. ముద్రణ.
 15. ష్రింకింగ్ రింగ్ టోన్ సేల్స్ లీడ్ టు డిక్లైన్ ఇన్ యుఎస్ మొబైల్ మ్యూజిక్ మార్కెట్, ఎంట్రిప్రెన్యూర్ మేగజైన్ వెబ్‌సైట్ ప్రచురించిన ఆగస్టు 5, 2005 పత్రికా ప్రకటన
 16. "జేమ్‌స్టెర్ స్లామ్డ్ ఫర్ మొబైల్ సెల్లింగ్ ప్రాక్టీసెస్", ఇన్ఫోవరల్డ్, ఏప్రిల్ 5, 2005. సేకరణ తేదీ మార్చి 15, 2007.
 17. సమ్మరీ ఆఫ్ ఫోర్డ్ వ. వెరిసైన్ ఇంక్., జేమ్‌స్టెర్, మరియు ఇతరులు, కల్లాహాన్, మెక్‌క్యూన్ అండ్ విల్లీస్. సేకరణ తేదీ మార్చి 15, 2007
 18. http://jamstermarketinglitigation.com/pdfs/SettlementAgreement.pdf
 19. http://www.casd.uscourts.gov/ 05-cv-00819-JM
 20. https://ecf.cand.uscourts.gov/doc1/03517096469
 21. http://www.topclassactions.com/close/571-stephen-king-text-message-class-action-lawsuit-settlement
 22. "స్ప్రింట్ అండ్ సింగ్యులర్ నేమ్డ్ ఇన్ కంప్లైట్స్", ది న్యూయార్క్ టైమ్స్ , జులై 21, 2005. సేకరణ తేదీ మార్చి 16, 2007
 23. 23.0 23.1 యుటిలిటీ కన్స్యూమర్ యాక్షన్ నెట్‌వర్క్ వర్సస్ సింగ్యులర్ వైర్‌లెస్-కంప్లైంట్ అండ్ రిక్వెస్ట్ ఫర్ సీజ్ అండ్ డెసిస్ట్ ఆర్డర్ , కాలిఫోర్నియా పబ్లిక్ యుటిలిటీస్ కమిషన్, జులై 20, 2005. సేకరణ తేదీ మార్చి 16, 2007. ఉదహరింపు పొరపాటు: చెల్లని <ref> ట్యాగు; "ceasedesist" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
 24. యుటిలిటీ కన్స్యూమర్స్ యాక్షన్ నెట్‌వర్క్ వర్సస్ సింగ్యులర్ వైర్‌లెస్ - ఒపీనియన్ అప్రూవింగ్ సెటిల్‌మెంట్ , కాలిఫోర్నియా పబ్లిక్ యుటిలిటీస్ కమిషన్, అక్టోబరు 19, 2006. సేకరణ తేదీ మార్చి 16, 2007.
 25. [1]
 26. లికోప్, క్రిస్టియన్. ది మొబైల్ ఫోన్స్ రింగ్. న్యూయార్క్ సిటీ: MIT ప్రెస్, 2008. 142-149. ముద్రణ
 27. (Japanese లో) 2002 న్యూస్ రిలీజ్ ఆన్ KDDI (au) అఫీషియల్ వెబ్‌సైట్, సేకరణ తేదీ సెప్టెంబరు 7, 2008.

బాహ్య లింకులు[మార్చు]

మూస:Telsigs