Jump to content

రిచర్డ్ నీల్

వికీపీడియా నుండి

రిచర్డ్ ఎడ్మండ్ నీల్ (జననం 1949 ఫిబ్రవరి 14) మసాచుసెట్స్ 1వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుండి 1989 నుండి అమెరికా ప్రతినిధిగా పనిచేస్తున్న రాజకీయ నాయకుడు.[1] 1989 నుండి 2013 వరకు, 2వ జిల్లాగా లెక్కించబడిన వాటిలో స్ప్రింగ్‌ఫీల్డ్, వెస్ట్ స్ప్రింగ్‌ఫీల్డ్, హోక్లీస్, అగావామ్, చికోపీ, వెస్ట్‌ఫీల్డ్ ఉన్నాయి. నీల్ 2013 నుండి యునైటెడ్ స్టేట్స్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు మసాచుసెట్స్ ప్రతినిధి బృందానికి డీన్‌గా పనిచేశాడు. అతడు న్యూ ఇంగ్లాండ్ హౌస్ ప్రతినిధులకు డీన్ గా కూడా పనిచేశాడు.[2]

ప్రారంభ జీవితం

[మార్చు]
అధికారిక చిత్రం, 2012

రిచర్డ్ ఎడ్మండ్ నీల్ మసాచుసెట్స్‌లోని వోర్సెస్టర్‌లో 1949లో జన్మించాడు. నీల్ తల్లిదండ్రులు మేరీ హెచ్. గార్వే, ఎడ్మండ్ జాన్ నీల్. వీరికి ముగ్గురు పిల్లలలు జన్మించారు. వారిలో పెద్దవాడు నీల్. నీల్ కు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. నీల్ తాతయ్య, అమ్మమ్మలు ఉత్తర ఐర్లాండ్‌కు చెందినవారు. నీల్ తాతయ్య, నాన్నమ్మలు ఐర్లాండ్‌కు చెందినవారు. నీల్ కు13 సంవత్సరాల వయసులో తల్లి మరణించింది. అతని తండ్రి మరణించినప్పుడు అతడు స్ప్రింగ్‌ఫీల్డ్ టెక్నికల్ హై స్కూల్‌లో చదువుతున్నాడు. నీల్, అతని ఇద్దరు చెల్లెళ్లు వారి అమ్మమ్మ దగ్గర పెరిగారు. తరువాత వారి అత్త వారిని పెంచింది.

నీల్ ఉన్నత విద్య పూర్తి చేసిన తర్వాత మసాచుసెట్స్‌లోని హోలీయోక్ కమ్యూనిటీ కాలేజీలో చేరాడు. అతని తల్లిదండ్రులు మరణించిన తర్వాత వచ్చిన డబ్బుతో స్ప్రింగ్‌ఫీల్డ్‌లోని అమెరికన్ ఇంటర్నేషనల్ కాలేజీలో చేరాడు. అతడు 1972లో పొలిటికల్ సైన్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌తో పట్టభద్రుడయ్యాడు. తర్వాత అతను హార్ట్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని బార్నీ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో సభ్యుడిగా ఉన్నాడు. 1976లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్‌తో పట్టభద్రుడయ్యాడు. [3] [4] [5] [6] తన కెరీర్ ప్రారంభంలో నీల్ కేథడ్రల్ ఉన్నత పాఠశాలలో చరిత్రను బోధించాడు. [7]

మూలాలు

[మార్చు]
  1. "Meet Richie". Congressman Richard Neal (in ఇంగ్లీష్). 2012-12-03. Archived from the original on March 18, 2021. Retrieved 2021-03-09.
  2. "Springfield's Richard Neal Will Be the Next Dean of Massachusetts' Congressional Delegation". Congressman Richard Neal (in ఇంగ్లీష్). 2013-06-28. Archived from the original on May 8, 2021. Retrieved 2021-03-02.
  3. Viser, Matt (June 4, 2010). "Neal seeks top job on Ways and Means committee." The Boston Globe: p. A1.
  4. Neal, Richard E. "Biography Archived ఏప్రిల్ 23, 2018 at the Wayback Machine." Congressman Richard Neal (official website). United States House of Representatives. Retrieved June 27, 2010.
  5. Alston, Farnsworth; Carter, Mary Ann; Randolph, Sarah (eds.) (2009). "Neal, Richard E." Congressional Directory for the 111th Congress (2009–2010). Washington: Government Printing Office. p. 127. ISBN 978-0-16-083727-2.
  6. "Tekes in Politics" (PDF). The Teke. Vol. 105, no. 3. Tau Kappa Epsilon. Summer 2012. pp. 12–13. Retrieved November 11, 2023.
  7. "A profile of a congressman: Populist roots and political instincts of U.S. Rep. Richard Neal." Daily Hampshire Gazette: p. A1. November 2, 1999.