రిచర్డ్ బ్రింస్లే షెరిడాన్
Jump to navigation
Jump to search
రిచర్డ్ బ్రింస్లే షెరిడాన్ | |||
| |||
పదవీ కాలం 1806 – 1807 | |||
ప్రధాన మంత్రి | లార్డ్ గ్రెంవిల్లె | ||
---|---|---|---|
ముందు | జార్జ్ క్యానింగ్ | ||
తరువాత | జార్జ్ రోజ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | డబ్లిన్, ఐర్లాండ్ | 1751 అక్టోబరు 30||
మరణం | 1816 జూలై 7 14 సవిలే రో, లండన్, ఇంగ్లాండ్ | (వయసు 64)||
రాజకీయ పార్టీ | విగ్ | ||
జీవిత భాగస్వామి | ఎలిజబెత్ అన్ లిన్లీ, ఎస్తేర్ జేన్ ఓగిల్ | ||
వృత్తి | నాటక రచయిత |
రిచర్డ్ బ్రింస్లే షెరిడాన్ (అక్టోబర్ 30, 1751 - జూలై 7, 1816) ఐర్లాండ్ దేశానికి చెందిన ఆంగ్ల కవి, నాటక రచయిత, నాటకశాల అధినేత, పార్లమెంట్ సభ్యుడు.[1]
జననం - విద్యాభ్యాసం
[మార్చు]రిచర్డ్ బ్రింస్లే షెరిడాన్ 1751, అక్టోబర్ 30న డబ్లిన్ లో జన్మించాడు. హారోలో తన విద్యాభ్యాసం పూర్తిచేశాడు.[2] 1758లో ఏడేళ్ళ వయసులో షెరిడాన్ కుటుంబం ఇంగ్లాండ్ కు వెళ్ళిపోయింది.[3]
రంగస్థల ప్రస్థానం
[మార్చు]చిన్నతనం నుండి సాహిత్యంపై మక్కువ పెంచుకున్న రిచర్డ్ బ్రింస్లే షెరిడాన్ తన 23వ ఏట ది రైవల్స్ అనే నాటకాన్ని రాశాడు. 1775లో ఈ నాటకం ప్రదర్శించబడింది. 1776లో నాటకశాలను కొన్న షెరిడాన్ 1794లో దానిని బాగుచేయించాడు. 1809లో ఆ నాటకశాల కాలిపోయింది.
నాటక రచనలు
[మార్చు]ఈయన రాసిన నాటకాలను కందుకూరి వీరేశలింగం పంతులు, భమిడిపాటి కామేశ్వరరావు తెలుగులోకి అనువదించారు.[4]
- ప్రత్యర్థులు (1775)
- ది స్కీమింగ్ లెఫ్టనెంట్ (1775)
- ది డ్యూయెన్నా (1775)
- అపవాద తరంగిణి (1777)
- ఎ ట్రాజెడీ రిహార్స్‌డ్ (విమర్శకుడు) (1779)
- స్కార్‌బరో ప్రయాణం (1777)
- పిజారో (1799)
మరణం
[మార్చు]రిచర్డ్ బ్రింస్లే షెరిడాన్ 1816, జూలై 7న మరణించాడు.
మూలాలు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Richard Brinsley Sheridanకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- ↑ రిచర్డ్ బ్రింస్లే షెరిడాన్, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 605.
- ↑ Rae 1897, p. 78.
- ↑ Thomas Sheridan Biography Archived 2018-11-19 at the Wayback Machine at James Boswell Info; retrieved 30 June 2013.
- ↑ రిచర్డ్ బ్రింస్లే షెరిడాన్, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 606.