రితి పాఠక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రితి పాఠక్
పార్లమెంటు సభ్యురాలు, లోక్ సభ
Assumed office
2014 సెప్టెంబరు 1
అంతకు ముందు వారుగోవింద్ ప్రసాద్ మిశ్రా
నియోజకవర్గంసిధి లోక్ సభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం (1977-07-01) 1977 జూలై 1 (వయసు 46)
ఖత్ఖారీ, మధ్యప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామిరజనీష్ పాఠక్
సంతానం2
తల్లిదండ్రులురామకరణ్ దేవ్ పాండే, శ్యామా పాండే
నివాసంసిధి, మధ్యప్రదేశ్
కళాశాలఅవధేష్ ప్రతాప్ సింగ్ యూనివర్సిటీ, రేవా, మధ్యప్రదేశ్
వృత్తిన్యాయవాది

రితీ పాఠక్ (జననం 1977 జూలై 1) భారతీయ రాజకీయ నాయకురాలు, న్యాయవాది. మధ్యప్రదేశ్‌లోని సిధి లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికైన భారతీయ జనతా పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యురాలు. ఆమె మొదటిసారిగా 2014 లోక్‌సభ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిపై 1,08,046 ఓట్ల మెజారిటీ సాధించింది.[1] ఆమె 2019లో 17వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు. ఆ సందర్భంలో ఆమె కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ అర్జున్ సింగ్ను 2,86,520 ఓట్ల తేడాతో ఓడించింది.[2][3][4]

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

రితి పాఠక్ 1977 జూలై 1న మధ్యప్రదేశ్‌లోని ప్రస్తుత సింగ్రౌలి జిల్లా ఖత్ఖారి గ్రామంలో శ్యామా పాండే, రామకరణ్ దేవ్ పాండే దంపతులకు రితి పాండేగా జన్మించింది. ఆమె రేవాలో పెరిగారు. ఆమె చరిత్ర, హిందీ సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీ, తర్వాత చరిత్రలో 1999లో రేవాలోని అవధేష్ ప్రతాప్ సింగ్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత 2002లో అవధేష్ ప్రతాప్ సింగ్ యూనివర్సిటీ నుండి ఎల్‌ఎల్‌బి (ది బ్యాచిలర్ ఆఫ్ లాస్)లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. పాఠశాల, కళాశాలలో ఉన్నప్పుడు ఆమె సహ-పాఠ్య కార్యక్రమాలలో కూడా చురుకుగా ఉండేది. ఆమె గ్రాడ్యుయేషన్ నాటికి మూడు NCC సర్టిఫికేట్‌లను పూర్తి చేసింది. ఆమె 1994-95లో GDCలో జాయింట్ సెక్రటరీగా పనిచేసింది.

వ్యక్తిగతం[మార్చు]

1997లో ఆమె రజనీష్ పాఠక్‌ను వివాహం చేసుకుంది.

మూలాలు[మార్చు]

  1. "Congress demolished in MP, BJP wins 27 out of 29 seats".
  2. "Sidhi Election Result, BJP wins 28 out of 29 seats in MP".
  3. "Members : Lok Sabha". loksabhaph.nic.in. Retrieved 2022-06-24.
  4. India Today (6 December 2023). "10 of 12 BJP MPs who won state elections resign from Lok Sabha" (in ఇంగ్లీష్). Archived from the original on 10 December 2023. Retrieved 10 December 2023.