Jump to content

రిద్ధి సేన్

వికీపీడియా నుండి
రిద్ధి సేన్
రిద్ధి సేన్
రిద్ధి సేన్
జననం (1998-05-19) 1998 మే 19 (వయసు 26)
జాతీయతభారతీయుడు
విద్యాసంస్థసౌత్ పాయింట్ స్కూల్
వృత్తినటుడు
తల్లిదండ్రులుకౌశిక్ సేన్ (తండ్రి)
రేష్మి సేన్ (తల్లి)
బంధువులుచిత్రా సేన్ (నానమ్మ)
శ్యామల్ సేన్ (తాత)

రిద్ధి సేన్, బెంగాలీ సినిమా నటుడు. నగర్‌కీర్తన్ సినిమాకి ఉత్తమ నటుడిగా జాతీయ చిత్ర అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డును అందుకున్న పిన్న వయస్కుడు రిద్ధి సేన్.[1] నాగర్‌కిర్తాన్‌ సినిమాలో సేన్ నటనను దశాబ్దపు 100 గొప్ప నటనలలో ఒకటిగా 2019లో ఫిల్మ్ కంపానియన్ పేర్కొంది.[2]

తొలి జీవితం

[మార్చు]
2010లో సేన్

రిద్ధి సేన్ తండ్రి బెంగాలీ నాటక సినీ నటుడు కౌశిక్ సేన్, తల్లి నర్తకి రేష్మి సేన్, నానమ్మ నటి చిత్ర సేన్, తాత నటుడు శ్యామల్ సేన్.[3][4] రిద్ధి సేన్ చిన్నప్పటినుండే నాటకాల్లో నటించాడు. 'ప్రాచ్య'లో నాటకాలు ప్రదర్శిస్తున్న సమయంలో తన 3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే అతన్ని నాటక ప్రదర్శనలకు తీసుకువెళ్ళడం నాకు గుర్తుంది" అని అతని నానమ్మ చెప్పింది.[4] స్వప్నసంధని[5] అనే నాటక సంస్థ ప్రదర్శించిన నాటకాలలో నటించాడు, కోల్‌కాతాలోని సౌత్ పాయింట్ పాఠశాలలో చదువుకున్నాడు. 2010లో నాటకరంగంలో తన ప్రతిభ చూపినందుకు పాఠశాల నుండి ప్రత్యేక ప్రతిభ పురస్కారాన్ని అందుకున్నాడు.[6]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా దర్శకుడు మూలం
2010 ఇతి మృణాలిని అపర్ణా సేన్
2012 కహానీ సుజోయ్ ఘోష్ [7]
2014 చిల్డ్రన్ ఆఫ్ వార్ మృత్యుంజయ్ దేవ్రాత్
2014 చిరోదిని తుమి జె అమర్ 2 సౌమిక్ ఛటర్జీ
2014 ఓపెన్ టి బయోస్కోప్ అనింద్య ఛటర్జీ
2015 చౌరంగ బికాస్ మిత్రా
2015 లోడ్‌షెడ్డింగ్ సౌకార్య ఘోసల్
2016 పర్చ్డ్ లీనా యాదవ్
2016 లయన్ గార్త్ డేవిస్
2017 భూమి ఓముంగ్ కుమార్
2017 సమంతరల్ పార్థ చక్రవర్తి
2017 నగర్‌కీర్తన్ కౌశిక్ గంగూలీ
2018 హెలికాప్టర్ ఈలా ప్రదీప్ సర్కార్
2019 విన్సీ డా శ్రీజిత్ ముఖర్జీ
2021 అనుసంధన్ కమలేశ్వర్ ముఖర్జీ [8]
2021 బిస్మిల్లా ఇంద్రదీప్ దాస్‌గుప్తా [9]

యూట్యూబ్ లఘుచిత్రాలు

[మార్చు]
  • సత్య దార్ కోచింగ్

నాటక ప్రదర్శనలు

[మార్చు]
  • ప్రాచ్య [10]
  • దఖోర్ ( కౌశిక్ సేన్ దర్శకత్వం)
  • బంకు బాబర్ బంధు 2006 ( కౌశిక్ సేన్ దర్శకత్వం)
  • భలో రాఖోషర్ గోల్పో ( కౌశిక్ సేన్ దర్శకత్వం)
  • క్రిరోనోక్
  • దుష్మాన్ నం 1 (సుమన్ ముఖోపాధ్యాయ్ దర్శకత్వం) [11]
  • బిర్పురుష్ (2010)
  • మాక్బెత్ (2012 బెంగాలీ థియేటర్, కౌశిక్ సేన్ దర్శకత్వం వహించిన షేక్స్పియర్ నాటకం మాక్బెత్ ఆధారంగా; రిద్ధి సేన్ ముగ్గురు మంత్రగత్తెలలో ఒకరి పాత్రను పోషించాడు)[12]
  • 2012 మధ్యలో అంజోన్ దత్ యొక్క బెంగాలీ థియేటర్ బెర్టోల్ట్ బ్రెచ్ట్ లైఫ్ ఆఫ్ గెలీలియోను స్వీకరించడంలో యువ ఆండ్రియా పాత్రను సేన్ పోషించాడు.[13]
  • ద్రోహోకాల్ (కౌశిక్ సేన్ దర్శకత్వం)
  • అశ్వద్ధామ
  • తరాయే తరాయే

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం శీర్షిక పాత్ర ఛానల్ మూలాలు
2017 ఫెలుడా తోప్షే ఆడ్ టైమ్స్ దర్శకత్వం పరమబ్రాత ఛటర్జీ[14] [15]
2019 షరేట్ ఆజ్ స్వాప్నో జీ5 అరిట్రా సేన్ (దర్శకత్వం)[16]
2019 పంచ్ ఫోరాన్ హోయిచోయ్ [17]

అవార్డులు

[మార్చు]
65వ జాతీయ చలన చిత్ర అవార్డులలో సేన్
  • నగర్‌కీర్తన్కు ఉత్తమ నటుడిగా జాతీయ చిత్ర పురస్కారం
  • నెహ్రూ చిల్డ్రన్స్ మ్యూజియం అవార్డు (2005)[10]
  • సుందరం అవార్డు (2008)[10]
  • షెరా బంగాలీ అవార్డు (ఎబిపి ఆనంద, కల్కర్ షెరా అజ్కే 2015)
  • 18 వ టెలి సినీ అవార్డు, నగర్‌కీర్తన్కు ఉత్తమ నటుడు, 2019.
  • హెలికాప్టర్ ఈలా, 2019 కళాకార్ అవార్డులచే ఉత్తమ రైజింగ్ నటుడు.
  • 2019లో నాగర్‌కిర్తాన్‌కు ఉత్తమ నటుడు (సార్క్‌)

మూలాలు

[మార్చు]
  1. "National Film Awards 2018 complete winners list: Sridevi named Best Actress; Newton is Best Hindi Film". Firstpost. 13 April 2018. Retrieved 27 July 2021.
  2. "100 Greatest Performances of the Decade". 100 Greatest Performances of the Decade (in ఇంగ్లీష్). Archived from the original on 19 డిసెంబరు 2019. Retrieved 27 July 2021.
  3. "Family drama". India Today. Retrieved 27 July 2021.
  4. 4.0 4.1 "Chitra Sen: Bengali theatre and acting-Exclusive Interview". Calcuttaweb. Retrieved 27 July 2021.
  5. "Theatre for a cause". Telegraph Kolkata. 25 November 2008. Retrieved 27 July 2021.
  6. "South Point prize distribution ceremony document" (PDF). South Point school, Kolkata. Archived from the original (PDF) on 24 సెప్టెంబరు 2015. Retrieved 27 July 2021.
  7. "A little twist in 'Kahaani'". The Times of India. 24 Oct 2010. Archived from the original on 2013-12-12. Retrieved 27 July 2021.
  8. Sankha Ghosh (29 October 2020). "Riddhi feels lucky to work with Kamaleswar in 'Anusandhan'". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 24 March 2021.
  9. "Indraadip Dasgupta on his next 'Bismillah' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 27 July 2021.
  10. 10.0 10.1 10.2 "Preview". narthaki.com/. Archived from the original on 8 ఫిబ్రవరి 2012. Retrieved 27 July 2021.
  11. "A little twist in 'Kahaani'". The Times of India. 24 Oct 2010. Archived from the original on 2013-12-12. Retrieved 27 July 2021.
  12. "'Performance speaks louder than star power'". Times of India. 12 April 2012. Retrieved 27 July 2021.
  13. "Anjan as galileo". Telegraph Calcutta. 19 June 2012. Retrieved 27 July 2021.
  14. "Riddhi Sen as Topshe in Web-Series Feluda; New Topshe for the New Age Audience" https://www.addatimes.com/show/feluda/ Archived 2017-12-23 at the Wayback Machine
  15. "Riddhi Sen in Feluda web series - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 27 July 2021.
  16. "Bengali original web series Sharate Aaj shooting continues in London" https://thekolkatamail.com/zee5-bengali-original-web-series-sharate-aaj-shooting-continues-in-london/
  17. "Paanch Phoron review: Hoichoi's new anthology series is a delicious, satisfying concoction - Entertainment News, Firstpost". Firstpost. 2019-02-21. Retrieved 27 July 2021.

బయటి లింకులు

[మార్చు]