రియల్‌మీ
| realme | |
Native name | 真我 |
Romanized name | Zhēn wǒ |
Company type | అనుబంధ సంస్థ |
| Industry | వినియోగదారు ఎలక్ట్రానిక్స్ |
| Founded | 4 మే 2018 |
| Founder | స్కై లీ, మాధవ్ శేఠ్ |
| Headquarters | |
Key people | |
| Products | స్మార్ట్‌ఫోన్లు టాబ్లెట్ కంప్యూటర్లు ఇయర్‌ఫోన్లు పవర్ బ్యాంక్లు ఫోన్ కేసులు బ్యాగులు స్మార్ట్ టీవీలు స్మార్ట్ వాచ్లు ల్యాప్‌టాప్లు |
Number of employees | 4,100 (సమీకృతంగా, 2025 నాటికి) |
| Parent | ఒప్పో |
| Divisions | రియల్‌మీ టెక్‌లైఫ్ రియల్‌మీ డిజో |
రియల్‌మీ (ఆంగ్లంలో చిన్న అక్షరాలతో realme రూపంలో వ్రాయబడుతుంది) అనేది ఒప్పో మద్దతుతో పనిచేసే చైనా ఆధారిత బహుళజాతి వినియోగదారు ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం షెన్‌జెన్, గ్వాంగ్‌డాంగ్ లో ఉంది. ఈ సంస్థను లీ బింగ్‌జోంగ్ (స్కై లీగా ప్రసిద్ధి), మాధవ్ శేఠ్ 2018 మే 4న స్థాపించారు. మాధవ్ శేఠ్, అంతకుముందు ఒప్పోలో ఉపాధ్యక్షుడుగా పనిచేశాడు. 2021 మూడవ త్రైమాసికంలో రియల్‌మీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన 5G స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా నిలిచింది.
2020 జూన్ నాటికి, రియల్‌మీ గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య 3.5 కోట్లకు చేరుకుంది. అలాగే AIoT ఉత్పత్తుల విక్రయాలు 10 లక్షల మార్కును దాటాయి. కౌంటర్‌పాయింట్ గణాంకాల ప్రకారం, 2020 తొలి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేసిన స్మార్ట్‌ఫోన్‌ల సంఖ్యలో రియల్‌మీ 7వ స్థానంలో నిలిచింది. వార్షిక వృద్ధి రేటు 157%గా నమోదై ప్రపంచంలో మొదటి స్థానాన్ని సాధించింది.[1]
2024 నాటికి, రియల్‌మీ ప్రపంచవ్యాప్తంగా 27 మార్కెట్లలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. వీటిలో ఆసియా, యూరప్, రష్యా, ఆస్ట్రేలియా, ఈజిప్ట్ వంటి ప్రాంతాలు ఉన్నాయి.[2]
2026 జనవరి 7న, వ్యయాలను తగ్గించడం, వనరులను సమీకరించడం లక్ష్యంగా రియల్‌మీని ఒప్పోలో ఉప-బ్రాండ్‌గా విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది.[3]
చరిత్ర
[మార్చు]- రియల్‌మీ సంస్థ 2018 మే 4న స్థాపించబడింది.[4] అంతకు ముందు ఇది ఒప్పో యొక్క ఉప-బ్రాండ్‌గా ఉండేది. ఒప్పో సంస్థ బి.బి.కె.ఎలక్ట్రానిక్స్ కు అనుబంధ సంస్థ.[5] 2018 మే 4న ఇది ప్రత్యేక సంస్థగా విడిపోయింది.[6][7]
- 2018 మేలో, రియల్‌మీ తమ తొలి ఫోన్ రియల్‌మీ 1ను విడుదల చేసింది.
- 2018 జూలై 30న, స్కై లీ సినా వైబో లో ఒక ప్రకటన ద్వారా ఒప్పో నుండి తన రాజీనామాను ప్రకటించాడు. అలాగే రియల్‌మీని స్వతంత్ర బ్రాండ్‌గా అభివృద్ధి చేయాలనే తన ఉద్దేశాన్ని వెల్లడించాడు.[8]
- 2018 నవంబర్ 15న, రియల్‌మీ కొత్త లోగోను స్వీకరించింది.
- 2018 నవంబర్ 22న, రియల్‌మీ భారతీయ మార్కెట్లో అభివృద్ధి చెందుతున్న బ్రాండ్‌గా గుర్తింపు పొందింది.[9] అనంతరం భారతదేశంలో రియల్‌మీ పరికరాల విక్రయాలు ఒప్పో విక్రయాలను మించిపోయాయి. 2019 నుండి షావోమీ, సామ్‌సంగ్, వివో తర్వాత భారతదేశంలో నాల్గవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా రియల్‌మీ నిలిచింది. భారతదేశంలో అత్యంత వేగంగా ఛార్జింగ్ అయ్యే స్మార్ట్‌ఫోన్, తొలి 5G స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన రికార్డులు రియల్‌మీ పేరిట ఉన్నాయి.[10]
- 2019 మే 15న, రియల్‌మీ చైనా దేశీయ మార్కెట్లో ప్రవేశించేందుకు బీజింగ్లో తన తొలి సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా రియల్‌మీ ఎక్స్, రియల్‌మీ ఎక్స్ లైట్, రియల్‌మీ ఎక్స్ మాస్టర్ ఎడిషన్ ఫోన్లను విడుదల చేసింది.[11][12]
- 2019 జూలై నాటికి, రియల్‌మీ చైనా, దక్షిణ ఆసియా, ఆగ్నేయ ఆసియా, యూరప్ వంటి మార్కెట్లలో ప్రవేశించింది.[13]
- 2019 ఆగస్టు నాటికి, రియల్‌మీ వినియోగదారుల సంఖ్య 1 కోటిని దాటింది.[13]
- 2022 మే 16న, ఫ్రాన్సిస్ వాంగ్ రియల్‌మీ యూరప్ సంస్థకు CEOగా బాధ్యతలు స్వీకరించాడు.[14]
- 2023 ఏప్రిల్ 7 నాటికి, మాతృసంస్థ బి.బి.కె.ఎలక్ట్రానిక్స్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దాంతో ఒప్పో, వివో తమ పూర్వ ఉప-బ్రాండ్లపై నియంత్రణ చేపట్టాయి. ఫలితంగా, రియల్‌మీ వన్‌ప్లస్ తో పాటు ఒప్పో అనుబంధ సంస్థగా మారింది.[15]
ఉత్పత్తులు
[మార్చు]ఈ సంస్థ ముఖ్యంగా భారతీయ మార్కెట్లో ఫోన్లు, టీవీలు వంటి అనేక ఉత్పత్తులను విడుదల చేసింది.[16]
మార్కెటింగ్
[మార్చు]ఫేస్ బుక్ వంటి సముదాయం ఆధారిత వనరులను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా రియల్‌మీ ఆన్‌లైన్‌లో మంచి ప్రజాదరణ పొందింది. 2018 నవంబర్‌లో, రియల్‌మీ ఫిలిప్పీన్స్ "స్క్వాడ్ లీడర్ ప్రోగ్రామ్"ను ప్రారంభించింది.
2024 నాటికి, రియల్‌మీ స్క్వాడ్ లీడర్ ప్రోగ్రామ్‌లో 14 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఇద్దరు ప్రారంభ స్క్వాడ్ లీడర్ల ముగ్గురిలో భాగంగా ఉన్నారు. ఈ కార్యక్రమం కింద, రియల్‌మీ 2018 నుండి స్క్వాడ్ లీడర్ల సేవలకు ప్రతిఫలంగా వారికి నిరంతరం నంబర్ సిరీస్ పరికరాలను అందిస్తోంది.[17]
థాయిలాండ్
[మార్చు]2025లో, థాయిలాండ్‌లో విక్రయించిన ఒప్పో, రియల్‌మీ ఫోన్లలో తొలగించలేని (అయితే నిలిపివేయగలిగే) అక్రమ రుణ యాప్ ముందుగానే ఇన్‌స్టాల్ చేసి ఉండేది. దీనిపై ప్రజా వ్యతిరేకత వ్యక్తమవడంతో, ఆ సంస్థలు ఈ విధానాన్ని నిలిపివేస్తామని ప్రకటించాయి.[18]
మూలాలు
[మార్చు]- ↑ realme品牌故事 [realme brand story]. realme official (in చైనీస్).
- ↑ "Brand market". Realme.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 May 2024.
- ↑ "Chinese smartphone maker Realme set to become an Oppo subbrand". Reuters. 7 January 2026.
- ↑ "Vivo ships 5.8 million smartphones to India in Q2 2019; breaks its own record". www.canaly.coms. 2019-07-29. ఒరిజినల్ నుండి 2019-12-12 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2019-07-29.
- ↑ Prado, Phillip (2018-10-31). "BBK Group could soon surpass Samsung as top dog". Android Authority. ఒరిజినల్ నుండి 2019-12-18 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2019-11-21.
- ↑ Artashyan, Argam (2018-07-30). "Realme Separates From OPPO: Another OnePlus?". GizChina. Gizchina Media. ఒరిజినల్ నుండి 2019-04-30 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2018-07-30.
- ↑ Hazarika, Skanda (29 July 2020). "Realme 2 Pro and Realme 5/5s/5i Android 10 kernel source code now available". xda-developers. ఒరిజినల్ నుండి 14 August 2020 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 August 2020.
- ↑ Yordan (2018-07-31). "Oppo VP moves to become Realme CEO, targets global brand expansion". GSMArena.com (in అమెరికన్ ఇంగ్లీష్). ఒరిజినల్ నుండి 2019-06-16 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2018-08-30.
- ↑ "Realme, the No.1 Emerging Brand now: CMR". CyberMedia CMR (in అమెరికన్ ఇంగ్లీష్). ఒరిజినల్ నుండి 2019-12-15 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-03-14.
- ↑ "India's first 5G phone! Realme X50 Pro 5G with 12GB RAM, 256GB storage all set for launch; check details - The Financial Express". financialexpress.com. 20 February 2020.
- ↑ Jeet (2019-04-24). "Realme officially announces its entry in China". Gizmochina (in అమెరికన్ ఇంగ్లీష్). ఒరిజినల్ నుండి 2019-07-13 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-03-14.
- ↑ Media, Kompas Cyber (16 May 2019). "Harga Berikut Spesifikasi Lengkap Realme X dan Realme X Lite". KOMPAS.com (in ఇండోనేషియన్). ఒరిజినల్ నుండి 2019-12-22 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-03-14.
- 1 2 Hamza, Muhammad (2019-08-07). "Worldwide user of realme has passed 10 million". Technology Times (in అమెరికన్ ఇంగ్లీష్). ఒరిజినల్ నుండి 2019-08-23 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-03-14.
- ↑ "Francis Wong takes over as CEO of Realme Europe". GSMArena.com (in అమెరికన్ ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-05-18.
- ↑ Mukherjee, Writankar (7 June 2023). "oppo mobiles india: OnePlus, Realme, Oppo to go separate ways as parent BBK looks to de-risk India business". The Economic Times. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-04-08.
- ↑ "Realme GT Review: Glaringly typical from Realme in all the right ways". xda-developers. 13 September 2021. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 September 2021.
- ↑ Ancheta, Jam (2018-11-20). "Realme is searching for the next squad leaders! | Jam Online". Jam Online | Technology News & Reviews (in అమెరికన్ ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-08-05.
- ↑ "Oppo and Realme axe loan apps in Thailand". 14 January 2025. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 January 2025.
బాహ్య లింకులు
[మార్చు]- Pages using infobox company using trading name
- Pages using infobox company with deprecated parameters
- Realme
- చైనా బ్రాండ్లు
- మొబైల్ ఫోన్ తయారీ సంస్థలు
- 2018లో స్థాపించబడిన చైనా సంస్థలు
- చైనా ఎలక్ట్రానిక్స్ సంస్థలు
- చైనాకు చెందిన ప్రైవేట్ సంస్థలు
- చైనా మొబైల్ ఫోన్ సంస్థలు
- చైనాలో 2018 స్థాపనలు
- 2018లో పరిచయమైన మొబైల్ ఫోన్లు
- మొబైల్ ఫోన్ తయారీదారులు