రీతూపర్ణ సేన్ గుప్త

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Rituparna Sengupta
Ritu1.jpg
జన్మ నామంRituparna Sen Sengupta
జననం (1971-11-07) 1971 నవంబరు 7 (వయస్సు: 48  సంవత్సరాలు)
క్రియాశీలక సంవత్సరాలు 1992 - present
వెబ్‌సైటు http://www.rituparna.com/

రీతూపర్ణ సేన్ సేన్గుప్త (బంగ్లా: ঋতুপর্ণা সেনগুপ্তা; 1971 నవంబరు 7 న జన్మించింది) భారతదేశంలో గడిచిన దశాబ్దం పాటు బెంగాలి సినిమాలో ప్రముఖ నటి మరియు ప్రస్తుతం ప్రశంసనీయ హిందీ సినిమాలో కూడా నటిస్తున్నది.

బాల్యం మరియు చదువు[మార్చు]

సేన్గుప్త 1971 నవంబరు 7న కలకత్తాలో జన్మించింది. ఆమె చిన్నతనం నుండి కళలలో చురుకుగా ఉండేది, బాల్యంలో చిత్రాంగ్షు అనే ఒక చిత్రలేఖన పాఠశాలలో చిత్రలేఖనం, నాట్యం, పాడటం మరియు చేతివృత్తులను నేర్చుకుంది. ఆమె మౌంట్ కార్మెల్ పాఠశాలలో చదివింది మరియు ఆ తరువాత లేడీ బ్రబోర్న్ కళాశాలలో చరిత్రలో డిగ్రీ పట్టా పొందింది. ఆమె కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ లో మాస్టర్స్ కి చదవటం ప్రారంభించింది, కానీ ఒక నటిగా తన వృత్తి జీవితం పై శ్రద్ధ పెట్టేందుకు చదువును మధ్యలోనే నిలిపివేసింది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

సేన్గుప్త తన చిన్ననాటి ఆప్తమిత్రుడు మరియు మోబిఆప్స్ యొక్క స్థాపకుడు మరియు CEO అయిన సంజయ్ చక్రభర్తిని 1999 డిసెంబరు 13న కోల్కత్తాలో వివాహమాడింది. తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకి చేయూతను ఇవ్వటంలో ఆమె చురుకైన పాత్ర కలిగి ఉంది. ఆమెకి అవుట్ డోర్ క్రీడలలో కూడా ప్రవేశం ఉంది మరియు బ్యాడ్మింటన్ ను ఒక వ్యాపకంగా ఆడుతుంది.

పురస్కారాలు మరియు గౌరవాలు[మార్చు]

 • 1995: భారత్ నిర్మాన్ అవార్డ్
 • 1996: కళాకార్
 • 1996: కాల్కట్ట లా సొసైటి చే కాజి నజ్రుల్ ఇస్లాం బర్త్ సెంటినరీ అవార్డ్
 • 1997:
 • 1998:42వ నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియాలో దహన్కు గాను బెస్ట్ యాక్ట్రస్ కై సిల్వర్ లోటస్, ( ఇంద్రాణి హల్దార్, సహా నటితో పంచుకున్నారు), .
 • 2000:దహన్కు గాను ఉత్తమ కథానాయక కై ఆనందలోక్ ఉజాల
 • 2000:అట్టియ సాజన్కు గాను ఉత్తమ కథానాయక కై ఆనందలోక్ ఉజాల
 • 2004: BFJA - ఉత్తమ కథానాయక అవార్డు, ఆలో (2004)
 • 2006: BFJA - ఉత్తమ కథానాయక అవార్డు, ద్వితీయ బసంత (2006)

ఫిల్మోగ్రఫీ[మార్చు]

 • దిల్ తోహ్ బచ్చ హాయ్ జి (2010)
 • బమ్మ్ బమ్మ్ బోలే (2010)
 • ఫుట్పాత్ (2010)
 • మెయిన్ ఒసామా (2010)
 • మిట్టల్ v/s మిట్టల్ (2010)
 • దు నాట్ డిస్టర్బ్ (2009)
 • Gauri: The Unborn (2007)
 • అనురానన్ (2006)
 • తపస్య (2006)
 • మెయిన్, మేరి పత్ని ఔర్ వో (2005)
 • UNNS (2005)
 • నిశిజఫోన్ (2005)
 • ఉత్సాబ్ (2000)
 • పారోమిటార్ ఎక్ దిన్ (2000)
 • ఆక్రోష్ (1998)
 • దహన్ (1997) ....... విన్నర్ , ఉత్తమ కథానాయక అవార్డ్
 • మోహిని (1995)
 • పరిచయ్
 • భాగ్య దేబత

గమనికలు[మార్చు]

బాహ్య లింకులు[మార్చు]

మూస:National Film Award for Best Actress మూస:Cinema of Bengal మూస:Bollywood