రీతూ ఖండూరి భూషణ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రీతూ ఖండూరి భూషణ్

శాసనసభ స్పీకర్
పదవీ కాలం
2022 మార్చి 26 - ప్రస్తుతం

ఎమ్మెల్యే
పదవీ కాలం
2022 మార్చి 10 - ప్రస్తుతం
ముందు హరక్ సింగ్ రావత్
నియోజకవర్గం కోట్‌ద్వార్‌

ఎమ్మెల్యే
పదవీ కాలం
2017 - 2022
ముందు విజయ బార్త్వాల్
తరువాత రేణు బిష్త్
నియోజకవర్గం యాంకేశ్వర్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1965 జనవరి 29
ఉత్తరాఖండ్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు భువన్ చంద్ర ఖండూరి, అరుణా ఖండూరి
జీవిత భాగస్వామి రాజేశ్‌ భూషణ్‌[1]

రీతూ ఖండూరి భూషణ్‌‌ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2022 ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికల్లో కోట్‌ద్వార్‌ నియోజకవర్గం నుండి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచింది.

జననం, విద్యాభాస్యం[మార్చు]

రీతూ ఖండూరి 1965 జనవరి 29న భువన్ చంద్ర ఖండూరి,[2] అరుణా ఖండూరి దంపతులకు జన్మించింది. ఆమె రఘునాథ్ గర్ల్స్ కాలేజీ, మీరట్ యూనివర్సిటీ నుండి 1986లో బిఏ (హానర్స్) పూర్తి చేసింది.[3]

రాజకీయ జీవితం[మార్చు]

రీతూ ఖండూరి తన తండ్రి స్పూర్తితో భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యమకేశ్వర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప స్వతంత్ర అభ్యర్థి రేణు బిష్త్ పై 8982 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఆమె 2022 ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికల్లో కోట్‌ద్వార్‌ నియోజకవర్గం నుండి బీజేపీ తరపున పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సురేంద్ర సింగ్ నేగి పై 3687 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[4] రీతూ ఖండూరి భూషణ్ మార్చి 26న ఉత్తరాఖండ్ తొలి మహిళ స్పీకర్ గా ఎన్నికైంది.[5]

మూలాలు[మార్చు]

  1. The Week (24 July 2020). "Rajesh Bhushan to take over as Union health secretary on August 1" (in ఇంగ్లీష్). Archived from the original on 14 March 2022. Retrieved 14 March 2022.
  2. V6 Velugu, V6 Velugu (30 January 2022). "తండ్రుల ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు పోటీ" (in ఇంగ్లీష్). Archived from the original on 14 March 2022. Retrieved 14 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "Who Is BJP Candidate Ritu Khanduri Bhushan?". 29 January 2022. Archived from the original on 14 March 2022. Retrieved 14 March 2022.
  4. "Former CM Khanduri's daughter Ritu wins from Kotdwar seat". 10 March 2022. Archived from the original on 14 March 2022. Retrieved 14 March 2022.
  5. Republic World (1 April 2022). "Ritu Khanduri becomes first woman speaker of Uttarakhand assembly; CM Dhami congratulates" (in ఇంగ్లీష్). Archived from the original on 1 April 2022. Retrieved 1 April 2022.