Jump to content

రీనా చౌదరి

వికీపీడియా నుండి
రీనా చౌదరి

పదవీ కాలం
1998 - 2004
ముందు పూర్ణిమ వర్మ
తరువాత జై ప్రకాష్ రావత్
నియోజకవర్గం మోహన్‌లాల్‌గంజ్

వ్యక్తిగత వివరాలు

జననం (1968-06-02) 1968 జూన్ 2 (వయసు: 57)
గోరఖ్‌పూర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ సమాజ్ వాదీ పార్టీ
తల్లిదండ్రులు భగవతి ప్రసాద్, చంద్ర వతి
పూర్వ విద్యార్థి ఎల్.ఎల్.బి.
వృత్తి రాజకీయ నాయకురాలు

రీనా చౌదరి (జననం. 1968 జూన్ 2) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు.[1] ఆమె మోహన్‌లాల్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.

రాజకీయ జీవితం

[మార్చు]

రీనా చౌదరి సమాజ్ వాదీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1998లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మోహన్‌లాల్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థిపూర్ణిమ వర్మపై 11,164 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది. ఆమె 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థిపూర్ణిమ వర్మపై 35,358 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.

రీనా చౌదరి 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సమాజ్ వాదీ పార్టీ టికెట్ నిరాకరించడంతో 2004 మార్చి 23న పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసింది.[2]

మూలాలు

[మార్చు]
  1. "Reena Choudhary" (in ఇంగ్లీష్). Digital Sansad. 4 June 2024. Archived from the original on 26 June 2025. Retrieved 26 June 2025.
  2. "Reena Chaudhary quits party". The Times of India. 23 March 2004. Archived from the original on 10 June 2025. Retrieved 10 June 2025.