Jump to content

రీసెర్చ్ అసోసియేట్

వికీపీడియా నుండి

రీసెర్చ్ అసోసియేట్  సాధారణంగా మాస్టర్స్ డిగ్రీ కన్న మించిన డిగ్రి కలిగి ఉన్న పరిశోధకులు (పండితులు, నిపుణులు).

హార్వర్డ్ / హార్వర్డ్ మెడికల్ స్కూల్ / హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వంటి కొన్ని విశ్వవిద్యాలయాలు / పరిశోధనా సంస్థలలో [1] పనిచేయు అభ్యర్థి పీహెచ్‌డీ (Ph.D) డిగ్రీని కలిగి ఉంటారు. లేదా పీహెచ్‌డీకి ఎంత శిక్షణ అవసరమో అంత సమానమైన శిక్షణ కలిగి ఉంటారు. అదనంగా, ఈ పదవికి దరఖాస్తు చేసిన అభ్యర్థి తప్పనిసరిగా స్వతంత్ర పరిశోధనలో అసాధారణమైన ఫిట్‌నెస్‌ని ప్రదర్శించి ఉండాలి. ఈ పదవి వలన ఏ అభ్యర్థికైన తన ప్రొఫెషనల్ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి, మరింత అనుభవాన్ని పొందడానికి, ప్రచురణలు, ఫెలోషిప్‌లు, స్వాతంత్ర్యంగా ప్రొజెక్ట్ ఇంవెస్టిగేటర్ (PI) గా పనిజేయుటకు, ఇంకా మరింత మంచి శాశ్వత ఉద్యోగం చేజెక్కించుకుంటానికి ఉపయోగపడుతుంది. ఈ పదవిలో ఉన్నవారు మున్ముందు సీనియర్ రీసెర్చ్ అసోసియేట్ (PI కి సమానమైన బాధ్యతలతో అధిక వేతనం కలిగియున్న పదవి), రీసెర్చ్ సైంటిస్ట్, సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్, ప్రిన్సిపల్ రీసెర్చ్ సైంటిస్ట్, తరువాత రీసెర్చ్ హెడ్ పదవులు పొందుతూ ముందుకు సాగవచ్చు.[1]

రీసెర్చ్ అసోసియేట్, రీసెర్చ్ అసిస్టెంట్‌ పదవికి భిన్నంగా, తరచుగా గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉంటారు. ఉదాహరణకు మాస్టర్స్ (ఉదా: మాస్టర్ ఆఫ్ సైన్స్) లేదా కొన్ని సందర్భాల్లో మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా డాక్టరల్ డిగ్రీ (ఉదా: డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ, డాక్టర్ ఆఫ్ మెడిసిన్ లేదా డాక్టర్ ఆఫ్ ఫార్మసీ ). కొన్ని సందర్భాల్లో దీనిని పోస్ట్‌డాక్టోరల్ పరిశోధనకు సమానంగా చూస్తారు. అయితే సాధారణంగా రీసెర్చ్ అసోసియేట్ అంటే ఏదైన ఫీల్డ్‌లో మరింత ఆధునిక నైపుణ్యాలు, అనుభవం కలిగి ఉండడం అవసరం.

ఇది కూడ చూడు

[మార్చు]

ప్రస్తావనలు

[మార్చు]

 

  1. 1.0 1.1 Harvard School of Public Health (25 November 2019). "Harvard School of Public Health Guidelines for Non-faculty Research Titles" (PDF). Harvard School of Public Health.