Jump to content

రీసైక్లింగ్

వికీపీడియా నుండి
పునరుత్పాదనకు ప్రపంచ వ్యాప్తంగా వాడే చిహ్నం, ఒకదాని వెనుక ఇంకొక బాణం గుర్తులు

రీసైక్లింగ్ (పునరుత్పాదన) అంటే వ్యర్థ పదార్థాలను తిరిగి కొత్త వస్తువులుగా, పదార్థాలుగా మార్చడం.

ఇది ఉపయోగకరమైన పదార్థాలను వృధా కాకుండా నిరోధిస్తుంది. తాజా ముడి పదార్థాల వినియోగాన్ని తగ్గిస్తుంది. శక్తి వినియోగం, వాయు కాలుష్యం, నీటి కాలుష్యం తగ్గించవచ్చు. పునర్వినియోగపరచదగిన పదార్థాలలో అనేక రకాల గాజు, కాగితం, కార్డ్‌బోర్డ్, లోహం, ప్లాస్టిక్, టైర్లు, వస్త్రాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. జీవక్షయం చెందగల మిగిలిపోయిన ఆహారం, వ్యవసాయ వ్యర్థాల లాంటి వాటిని ఎరువుగా మార్చడం కూడా రీసైక్లింగ్ లో భాగమే.[1]

శ్రేష్ఠమైన పద్ధతిలో అయితే ఒక పాత పదార్థాన్ని పునరుత్పాదన చేసి కొత్తగా అదే పదార్థాన్ని తెప్పించాలి. ఉదాహరణకు ఒక కార్యాలయంలో వాడేసిన కాగితాన్ని మళ్ళీ కొత్తగా వాడుకునే కాగితంలా మారుస్తారు. వాడి పారేసిన లోహపు క్యాన్లను కూడా లోహపు స్వచ్ఛత కోల్పోకుండా కొత్త క్యాన్లను తయారు చేయవచ్చు.[2] కానీ అన్ని పదార్థాలకు ఇలా మార్చడం ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని అవుతుంది. కాబట్టి కొన్ని వ్యర్థ పదార్థాలను మళ్ళీ అదే పదార్థాలు కాకుండా వేరే పదార్థాలుగా మారుస్తుంటారు. ఉదాహరణకు పాత పేపరును పేపరు బోర్డులుగా మారుస్తారు. వేరే విధానంలో సంక్లిష్టమైన వ్యర్థాలను విడగొట్టి విలువైన పదార్థాలను వేరు చేస్తారు. దీనికి ఉదాహరణ కారు బ్యాటరీలనుండి లెడ్ ను వేరు చేయడం, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల నుండి బంగారాన్ని వెలికి తీయడం లాంటివి.

మూలాలు

[మార్చు]
  1. League of Women Voters (1993). The Garbage Primer. New York: Lyons & Burford. pp. 35–72. ISBN 978-1-55821-250-3.
  2. Lilly Sedaghat (2018-04-04). "7 Things You Didn't Know About Plastic (and Recycling)". National Geographic. Archived from the original on 25 January 2020. Retrieved 2023-02-08.