Jump to content

రుద్రసేన్ చౌదరి

వికీపీడియా నుండి
రుద్రసేన్ చౌదరి

పదవీ కాలం
1991  1996
ముందు ఆరీఫ్ మహమ్మద్ ఖాన్
తరువాత పదమ్‌సేన్ చౌదరి
నియోజకవర్గం బహ్రైచ్
పదవీ కాలం
1989  1991
ముందు రణవీర్ సింగ్
తరువాత లక్ష్మీనారాయణ్ మణి త్రిపాఠి
నియోజకవర్గం కైసర్‌గంజ్
పదవీ కాలం
1977  1980
ముందు శకుంతల నాయర్
తరువాత రణవీర్ సింగ్
నియోజకవర్గం కైసర్‌గంజ్

వ్యక్తిగత వివరాలు

జననం (1930-01-07)1930 జనవరి 7
బోధ్వా , బహ్రైచ్ జిల్లా , యునైటెడ్ ప్రావిన్స్ , బ్రిటిష్ ఇండియా , (ప్రస్తుత ఉత్తర ప్రదేశ్ , భారతదేశం)
మరణం 1996 మార్చి 1(1996-03-01) (వయసు: 66)[1]
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి
కృష్ణ చౌదరి
(m. 1952)
సంతానం 3 కుమారులు, 2 కుమార్తెలు (పదమ్‌సేన్ చౌదరితో సహా)[2]
పూర్వ విద్యార్థి బనారస్ హిందూ విశ్వవిద్యాలయం
వృత్తి రాజకీయ నాయకుడు

రుద్రసేన్ చౌదరి (7 జనవరి 1930 - 1 మార్చి 1996) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కైసర్‌గంజ్ & బహ్రైచ్ నియోజకవర్గాల నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

రుద్రసేన్ చౌదరి జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కైసర్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్ధి ఐఎన్‌సీ అభ్యర్థి కున్వర్ రుద్ర ప్రతాప్ సింగ్‌పై 124796 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1980లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ 33462 ఓట్లతో 3వ స్థానంలో నిలిచాడు.

రుద్రసేన్ చౌదరి 1989లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కైసర్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్ధి ఐఎన్‌సీ అభ్యర్థి రామ్ వీర్ సింగ్‌పై 124796 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 1991 లోక్‌సభ ఎన్నికలలో బహ్రైచ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్ధి ఐఎన్‌సీ అభ్యర్థి ఆరీఫ్ మహమ్మద్ ఖాన్ పై 63209 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "LOK SABHA DEBATES" (PDF). Lok Sabha. 1 March 1996. Retrieved 8 October 2020.
  2. "Padamsen Chaudhary" (in ఇంగ్లీష్). Digital Sansad. 4 June 2024. Archived from the original on 25 June 2025. Retrieved 25 June 2025.
  3. "Kaiserganj Lok Sabha Election Results". Result University. 30 June 2025. Archived from the original on 30 June 2025. Retrieved 30 June 2025.
  4. "Bahraich Lok Sabha Election Results". Result University. 30 June 2025. Archived from the original on 30 June 2025. Retrieved 30 June 2025.