Jump to content

రుద్రాంక్ష్ పాటిల్

వికీపీడియా నుండి
రుద్రాంక్ష్ పాటిల్
Personal information
Full nameరుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్
Born (2003-12-16) 2003 డిసెంబరు 16 (వయసు: 22)
థానే, మహారాష్ట్ర, భారతదేశం
Sport
Sportషూటింగ్
Event10 మీ. ఎయిర్ రైఫిల్
Achievements and titles
Highest world ranking1 (2022)
Medal record
పురుషుల 10 మీ. ఎయిర్ రైఫిల్ షూటింగ్
Representing భారతదేశం
Event 1st 2nd 3rd
ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్స్ 2 0 0
ఆసియా క్రీడలు 1 0 0
ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్స్ 5 0 2
ప్రపంచ కప్ 3 2 2
ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్స్ 0 1 0
జూనియర్ ఆసియా ఛాంపియన్షిప్స్ 2 0 0
Total 13 3 4
ISSF ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్స్
Gold medal – first place2022 కైరోవ్యక్తిగత
Gold medal – first place2022 కైరోజట్టు
ఆసియా క్రీడలు
Gold medal – first place2022 హాంగ్‌జౌజట్టు
ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్స్
Gold medal – first place2022 డేగుజట్టు
Gold medal – first place2024 జకార్తామిశ్రమ జట్టు
Gold medal – first place2025 షింకెంట్జట్టు
Gold medal – first place2026 న్యూ ఢిల్లీవ్యక్తిగత
Gold medal – first place2026 న్యూ ఢిల్లీజట్టు
Bronze medal – third place2024 జకార్తావ్యక్తిగత
Bronze medal – third place2024 జకార్తాజట్టు
ప్రపంచ కప్
Gold medal – first place2023 కైరోవ్యక్తిగత
Gold medal – first place2023 కైరోమిశ్రమ జట్టు
Gold medal – first place2025 బ్వేనౌస్ ఐరిస్వ్యక్తిగత
Silver medal – second place2025 బ్వేనౌస్ ఐరిస్మిశ్రమ జట్టు
Silver medal – second place2025 లిమామిశ్రమ జట్టు
Bronze medal – third place2023 భోపాల్వ్యక్తిగత
Bronze medal – third place2023 భోపాల్మిశ్రమ జట్టు
జూనియర్ ప్రపంచ ఛాంపియన్షిప్స్
Silver medal – second place2021 లిమావ్యక్తిగత
జూనియర్ ప్రపంచ కప్
Gold medal – first place2022 సుహ్ల్వ్యక్తిగత
Gold medal – first place2022 సుహ్ల్వ్యక్తిగత

రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్ (జననం 2003 డిసెంబర్ 16) 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో ప్రత్యేకత కలిగిన భారతీయ క్రీడా షూటర్. ఇతడు 2022 వర్డ్ ఛాంపియన్షిప్స్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఇతడు అభినవ్ బింద్రా తర్వాత రెండవ భారతీయ ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు.[1]

ప్రారంభ జీవితం

[మార్చు]

పాటిల్ 2003 డిసెంబర్ 16న మహారాష్ట్ర రాష్ట్రంలోని థానే నగరంలో జన్మించాడు. మొదట్లో ఇతడు చెస్, ఫుట్బాల్ క్రీడాలను ప్రారంభించాడు, కానీ తరువాత షూటింగ్ వైపు మారాడు. ఇతని తండ్రి బాలాసాహెబ్ పాటిల్, తల్లి హేమంగిణి పాటిల్ ఇతడిని షూటింగ్ క్రీడను ప్రాక్టీస్ చేయమని ప్రోత్సహించారు. పాటిల్ ముంబై విశ్వవిద్యాలయం నుండి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేశాడు.

వృత్తి

[మార్చు]

హాంగ్జౌలో జరిగిన 2022 ఆసియా క్రీడలలో, పాటిల్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో దివ్యాంశ్ పన్వర్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్‌తో భారతదేశపు మొదటి బంగారు పతకాన్ని గెలుచుకునే దిశలో ప్రపంచ రికార్డు స్కోరు సాధించాడు.[2] కైరోలో జరిగిన 2022 ప్రపంచ ఛాంపియన్షిప్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో బంగారు పతకం సాధించిన తరువాత ఇతడు 2024 పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాన్ని సాధించాడు.[3][4][5] అంతకుముందు డేగులో జరిగిన 2022 ఆసియా ఛాంపియన్షిప్‌లో ఇతడు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో మొదటి స్థానంలో నిలిచాడు. ఒలింపిక్స్ కోసం ఇతడి సన్నాహాలలో సహాయపడటానికి, ఒలింపిక్ పతక విజేత, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఒఎ) ఉపాధ్యక్షుడు అయిన గగన్ నారంగ్, ప్రసిద్ధ జర్మనీ తుపాకీ తయారీ సంస్థ వాల్థర్ నుండి ప్రాయోజిత తుపాకీని పొందడానికి సహకరించి, దానిని పూణే విలేకరుల సమావేశంలో పాటిల్‌కి అందజేశాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. "ISSF rankings: India's Rudrankksh Patil becomes world No. 1 in men's 10m air rifle shooting". Olympics.
  2. "Who is Rudrankksh Patil? Shooter leads Indian team to Asian Games gold". The Statesman. 25 September 2023.
  3. "ISSF rankings: India's Rudrankksh Patil becomes world No. 1 in men's 10m air rifle shooting". Olympics.
  4. "Rudrankksh Patil becomes second Indian shooter to win 10m air rifle gold at World Championships, secures Paris Olympics quota". The Times of India. 14 October 2022. ISSN 0971-8257.
  5. "Paris 2024: Full list of Olympics quota winners from India in shooting". Sportstar. 24 October 2022.
  6. "With two coaches, rifle shooter Rudrankksh Patil aims to make his Paris quota count". The Times of India. 5 December 2023. ISSN 0971-8257.