Jump to content

రుద్రేష్ గౌడ

వికీపీడియా నుండి
రుద్రేష్ గౌడ

పదవీ కాలం
1996 మే 15 – 1997 డిసెంబర్ 4
తరువాత హెచ్.డి.దేవెగౌడ
నియోజకవర్గం హసన్

పదవీ కాలం
2008 మే 22 – 2018 మార్చి 23
తరువాత కె.ఎస్. లింగేషా
నియోజకవర్గం బేలూరు

వ్యక్తిగత వివరాలు

జననం (1955-10-17)1955 అక్టోబరు 17
బేలూర్ , కర్ణాటక , భారతదేశం
మరణం 2018 మార్చి 24(2018-03-24) (వయసు: 62)
బెంగళూరు , కర్ణాటక , భారతదేశం
రాజకీయ పార్టీ

(2004– 2018) ,

(1999-2004),

సంతానం 2

రుద్రేష్ గౌడ (16 అక్టోబర్ 1955 - 24 మార్చి 2018) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు బేలూరు శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, ఒకసారి హాసన్ లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

రుద్రేష్ గౌడ 1985లో జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1986లో జెడ్పీ సభ్యుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 1995లో జెడ్పీ చైర్మన్ గా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత జనతాదళ్ పార్టీలో చేరి 11వ లోక్‌సభకు సభ్యుడిగా ఎన్నికయ్యాడు. రుద్రేష్ గౌడ 2008 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో బేలూరు శాసనసభ నియోజకవర్గం నుండి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి బి. శివరుద్రప్పపై 17,821 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2013 శాసనసభ ఎన్నికలలో జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కె.ఎస్. లింగేషాపై 7,529 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

మరణం

[మార్చు]

వైఎన్ రుద్రేష్ గౌడ 62 ఏళ్ళ వయసులో గుండెపోటుతో కుప్పకూలడంతో వెంటనే బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ 2018 మార్చి 24న మరణించాడు. ఆయనకు భార్య కీర్తన, కుమార్తె అమ్శ్రుత, ఐదుగురు సోదరులు, నలుగురు సోదరీమణులు ఉన్నారు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. "Rudresh Gowda, Congress MLA, dead" (in Indian English). The Hindu. 24 March 2018. Archived from the original on 1 April 2025. Retrieved 1 April 2025.
  2. "Belur MLA Rudresh Gowda dies of multiple organ failure" (in ఇంగ్లీష్). Deccan Herald. 24 March 2018. Archived from the original on 1 April 2025. Retrieved 1 April 2025.