రుమటాలజీ (కీళ్ల నొప్పుల శాస్త్రం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Rheumatologist
వృత్తి
పేర్లుDoctor, Medical Specialist
వృత్తి రకం
Specialty
కార్యాచరణ రంగములు
Medicine
వివరణ
విద్యార్హత
Doctor of Medicine or Doctor of Osteopathy
ఉపాథి రంగములు
Hospitals, Clinics

రుమటాలజీ (కీళ్లనొప్పుల శాస్త్రం) అంతర్గత వైద్యం, చిన్నపిల్లల వైద్యాల్లో ప్రత్యేక శాస్త్రం. కీళ్లు, కండరాలు, ఎముకలకు సంబంధించిన వ్యాధుల నిర్ధారణ, చికిత్సలకు సంబంధించిన శాస్త్రమిది. రుమటాలజీలో స్పెషలైజేషన్‌ చేసే డాక్టర్లను రుమటాలజిస్టులు అంటారు. కీళ్లు, మృదు కణజాలాలు, కొన్నిరకాల నిరోధకత ఉన్న వ్యాధులు, కనెక్టివ్‌ కణజాలాలకు సంబంధించిన సమస్యలను వీరు పరీక్షిస్తారు. శరీర కండర, అస్థిపంజర వ్యవస్థను ప్రభావితం చేసే వ్యాధులు, ఇబ్బందులను వారు వైద్యపరంగా నయం చేస్తారు. కీళ్ల సంబంధ సమస్యలకు దారి తీసే నిరోధక వ్యాధులకు ఈ సమస్యలు కారణమవుతుంటాయి.

రుమటాలజీ అనే పదం రుమా అనే గ్రీకు పదం నుంచి పుట్టింది. "నది, లేక ప్రవాహంలా ప్రవహించేది" అది దానికి అర్థం. ఇక -లాజీ అంటే "అధ్యయనం" అని అర్థం.


రుమటాలజీ వైద్య రంగంలో ప్రత్యేక శాస్త్రంగా శరవేగంగా ఎదుగుతోంది. దీనికి సంబంధించిన వ్యాధుల నివారణల విషయంలో జరుగుతున్న నూతన శాస్త్రీయ ఆవిష్కరణలే ఇందుకు చాలావరకు కారణం. కొన్ని రుమటాలజికల్‌ వ్యాధుల లక్షణాలను ఇమ్యునాలజీ (వ్యాధి నిరోధక శాస్త్రం) బాగా వివరించగలుగుతుంది. అందుకే పలు పెద్ద రుమటాలజికల్‌ వ్యాధుల పుట్టుకను ఆటో ఇమ్యూన్‌ వ్యవస్థ పరంగా ఆటో ఇమ్యూన్‌ వ్యాధులుగా వివరించడం జరుగుతోంది. అదేవిధంగా కొత్త చికిత్స విధానాల్లో చాలావరకు ఇమ్యునాలజీకి సంబంధించిన వైద్య పరిశోధనలను ఆధారంగా చేసుకునే అందుబాటులోకి వస్తున్నాయి. తద్వారా రుమటాలజికల్‌ వ్యాధుల జన్యుపరమైన మూలాలను గురించి మరింత మెరుగ్గా అర్థం చేసుకునేందుకు వీలు కలుగుతోంది. భావి చికిత్సల్లో జన్యు థెరపీ కూడా భాగమయ్యే అవకాశముంది. రుమటాలజికల్ వ్యాధులకు రుజూవుల ఆధారిత వైద్య చికిత్స వళ్ళ రుమాటిజం రోగుల్లో చాలామంది దాదాపుగా సాధారణ జీవితం గడిపేందుకు వీలయింది.

రుమాటిజం[మార్చు]

కీళ్లు, కండరాలతో పాటు కీళ్లు, ఎముకల ఆధార కణజాలాలు, మృదు కణజాలాల వంటి చలనాంగాలకు సంబంధించిన ఇబ్బందులు, నొప్పి వంటి వాటిని వివరించేందుకు వాడే సాధారణ పదమే రుమాటిజం . గుండె కవాటాలను ప్రభావితం చేసే రుమాటిక్‌ జ్వరాన్ని వివరించేందుకు కూడా ఈ పదాన్ని వాడతారు. అయితే పలు రుమాటలజికల్‌ వ్యాధులను వివరించేందుకు ప్రత్యేక పదాలను వైద్య పరిభాషలో ఉపయోగిస్తారు. రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, ఆంక్లైజింగ్‌ స్పాండిలైటిస్, గౌట్‌, సిస్టెమిక్‌ లూపస్‌ ఎరిథెమాటసస్‌ వంటివి ఇందుకు ఉదాహరణ.

రుమటాలజీని ప్రత్యేక వైద్య శాస్త్ర అంగంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ గుర్తిస్తున్నారు. నిర్ధారిత పీజీ శిక్షణ కార్యక్రమాల వంటివాటితో రుమటాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇక రుమాటిజం సంబంధిత వ్యాధులను పరీక్షించే వైద్యులకు వాడే రుమటాలజిస్ట్‌ పదానికి భాషా డిక్షనరీల్లో ఇంకా పెద్దగా ప్రాచుర్యం లభించకపోయినా వైద్య సమాజంలో మాత్రం ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన పదంగా మారింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రుమాటలజీ సంబంధిత వ్యాధుల్లో రోగులకు మెరుగైన ఫలితాలు వచ్చేలా చికిత్స చేసే సామర్థ్యాన్ని రుమటాలజిస్టులు సంతరించుకున్నారు. బయాలజిక్స్‌ అనే సరికొత్త డిసీజ్‌ మాడిఫయింగ్‌ ఏజెంట్ల ఆవిష్కరణే ఇందుకు కారణం. దీర్ఘకాలిక, అంగవైకల్యానికి దారితీసే కీళ్ల వ్యాధులతో బాధపడే రోగులకు చికిత్స చేయడంలో బాగా పేరున్న విధానంగా ఇదిప్పుడు గుర్తింపు పొందుతోంది.[ఉల్లేఖన అవసరం].

రుమటాలజిస్ట్‌[మార్చు]

వైద్య శాస్త్రంలో ప్రత్యేక విభాగంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రుమటాలజీలో నైపుణ్యం సాధించిన వైద్యున్ని రుమటాలజిస్ట్‌ అంటారు. రుమటాలజిస్ట్‌ డాక్టర్‌ ఆఫ్‌ మెడిసిన్‌ డిగ్రీ (ఎండీ), లేదా డాక్టర్‌ ఆఫ్‌ ఓస్టియోపథిక్‌ మెడిసిన్‌ డిగ్రీ (డీఓ) కలిగి ఉంటాడు. ఈ రంగంలో పొందే శిక్షణలో నాలుగేళ్ల అండర్‌గ్రాడ్యుయేట్‌ కోర్సు, నాలుగేళ్ల మెడికల్‌ కోర్సు చేయాల్సి ఉంటుంది. అనంతరం అమెరికాలో అయితే మరో మూడేళ్ల రెసిడెన్సీ కోర్సు, దానితో పాటు మరో రెండు నుంచి మూడేళ్ల అదనపు ఫెలోషిప్‌ శిక్షణ కూడా అవసరం. స్థానిక అవసరాలకు తగ్గట్టుగా రుమటాలజీ ప్రత్యేక శిక్షణ పొందాల్సిన కాలావధి ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది. రుమటాలజిస్టులు ఇంటెర్నిస్టులు గానీ, పీడియాట్రిషన్లు గానీ అయ్యుంటారు. దానికి తోడుగా అదనపు పీజీ శిక్షణతో పాటు ఆర్థరైటిస్‌, ఇతర కీళ్లు, కండరాలు, ఎముకల వ్యాధుల నిర్ధారణ, చికిత్సలో అనుభవం కలిగి ఉంటారు. ఈ ప్రమాదకరకొన్ని సందర్భాల్లో ప్రాణాంతక వ్యాధుల నిర్ధారణమెరుగైన చికిత్స కోసం పలువురు రుమటాలజిస్టులు పరిశోధనలు కూడా చేస్తుంటారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ శాస్త్రీయ పరిశోధనల్లో చాలావరకు రుజువులపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ విభాగంలో ప్రత్యేక శిక్షణ పొందిన స్పెషలిస్టులను రుమటాలజిస్టులు అంటారు.

ఆర్థరైటిస్, కొన్నిరకాల ఆటో ఇమ్యూన్‌ వ్యాధులు, కండర, అస్థపంజర (మస్కులోస్కెలెటల్‌) వ్యాధులు, ఆస్టియోపొరోసిస్‌ వంటివాటిని రుమటాలజిస్టులు నయం చేస్తారు. ఈ వ్యాధుల్లో 200 రకాలకు పైగా ఉన్నాయి. రుమటాయిడ్‌ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, గౌట్, లూపస్, వెన్ను నొప్పి, ఆస్టియోపొరోసిస్‌, టెండినిటిస్‌ వంటివి ఇందులో కొన్ని. ఈ వ్యాధుల్లో కొన్ని ప్రాణాంతకాలు. వాటి నిర్ధారణతో పాటు చికిత్స కూడా కష్టసాధ్యమైన పని. కండర, అస్థి సంబంధిత మృదు కణజాల,ఇతర క్రీడా సంబంధిత మృదు కణజాల సమస్యలకు రుమటాలజిస్టులు చికిత్స చేస్తారు. బాధిత రోగులకు ఫిజియోథెరపీ, ఇతర ఔషధాలు, పునరావాసం వంటివాటిని కూడా అదనంగా అందిస్తారు. వీటితో పాటు రోగులకు అవగాహన కలిగించే కార్యక్రమాలుఆక్యుపేషనల్‌ థెరపీ వంటివి కూడా రుమటాలజీకి సహాయకారులుగా ఉంటాయి.

ప్రపంచవ్యాప్తంగా రుమటాలజిస్టులకు ప్రాతినిధ్యం వహించే పలు అంతర్జాతీయ సంస్థలున్నాయి. అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ రుమటాలజీ (ACR‌), ద అససోసియేషన్‌ ఆఫ్‌ రుమటాలజీ హెల్త్‌ ప్రొఫెషనల్స్‌ (ARHP), ద యూరోపియన్‌ లీగ్‌ అగైనెస్ట్‌ రుమాటిజం (EULAR), ఆసియా పసిఫిక్‌ లీగ్‌ ఆఫ్‌ అసోసియేషన్స్‌ ఫర్‌ రుమటాలజీ (APLAR‌), ఇంటర్నేషనల్‌ లీగ్‌ ఆఫ్‌ అసోసియేషన్స్‌ ఫర్‌ రుమటాలజీ (ILAR) వంటివి కొన్ని ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు. ఇవన్నీ రుమటాలజీకి సంబంధించి ఏర్పాటై, పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థలు. ఇవన్నీ అంతర్జాతీయంగా రుమటాలజీకి సంబంధించిన అవగాహనను పెంచి, సరికొత్త పరిశోధనలకు వీలు కల్పిస్తాయి. దానికి తోడు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో స్థానికంగా రుమటాలజీ సంస్థలు, కాలేజీలు కూడా ఉన్నాయి. ఇవన్నీ పైన పేర్కొన్న అంతర్జాతీయ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఇక రుమటాలజిస్టులు రుమాటిక్‌ వ్యాధుల చికిత్సలో నైపుణ్యం సాధించిన వైద్యులు.

ఉదాహరణకు ఇంగ్లండ్‌లో దాదాపుగా 480 మంది కన్సల్టెంట్‌ రుమటాలజిస్టులున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ రుమటాలజిస్టుల సంఖ్య బాగా పెరుగుతోంది. వయసు మళ్లుతున్న రోగుల్లో చాలామంది రుమాటిక్‌ వ్యాధుల బారిన పడుతున్న కారణంగా వీరికి డిమాండ్‌ బాగా పెరుగుతుండటమే ఇందుకు కారణం.

వ్యాధులు[మార్చు]

Laserbehandling.jpg

రుమటాలజిస్టులు నిర్ధారణ చేసినిర్వహించే వ్యాధులు ఇవీ:

 • ప్రాణాంతక కీళ్ల రోగం
 • లుపస్‌
 • జగ్రెన్స్‌ సిండ్రోమ్‌
 • స్క్లెరోడెర్మా (సిస్టెమిక్‌ స్క్లెరోసిస్‌)
 • డెర్మటోమియోసిటిస్‌
 • పాలికాండ్రిటిస్‌
 • పాలీమయోసిటిస్‌
 • పాలిమయాల్గియా రుమాటికా
 • ఆస్టియో ఆర్థరైటిస్‌
 • సెప్టిక్‌ ఆర్థరైటిస్‌
 • సార్కోయిడోసిస్
 • గౌట్, సూడోగౌట్‌
 • స్పాండిలో ఆర్థోపతిస్‌
  • వెన్నెముక కండరాల నొప్పితో ఏర్పడే ప్రాణాంతక స్థితి
  • రియాక్టివ్‌ ఆర్థరైటిస్‌ (అకా రియాక్టివ్‌ ఆర్థోపతి)
  • సొరియాటిక్‌ ఆర్థోపతి
  • ఎంటెరోపతిక్‌ స్పాండిలైటిస్‌
 • వాస్కులైటిస్‌
  • పాలి ఆర్థరైటిస్‌ నొడోసా
  • హెనోచ్‌ చొన్‌లెయిన్‌ పుర్పురా
  • సెరమ్‌ సిక్‌నెస్‌
  • వెజీనెర్స్‌ గ్రానులోమటోసిస్‌
  • జెయింట్‌ సెల్‌ ఆర్థరైటిస్‌
  • టెంపోరల్‌ ఆర్థరైటిస్‌
  • టకాయసుస్‌ ఆర్థరైటిస్‌
  • బెచెట్స్‌ సిండ్రోమ్‌
  • కవసాకీస్‌ డిసీజ్‌ (మ్యూకోకుటానియస్‌ లింప్‌ నోడ్‌ సిండ్రోమ్‌)
  • బర్గర్స్‌ డిసీజ్‌ (థ్రోంబో ఆంగైటిస్‌ ఓబ్లిటెరాన్స్‌)

జువనైల్‌ ఇడియోపతిక్‌ ఆర్థరైటిస్‌ (JIA);

(పిల్లలను బాధించే చాలా రకాల కీళ్ళ నొప్పులను గురించి జేఐయే వివరిస్తుంది)

రుమాటిక్‌ ఆర్థరైటిస్‌;

సాఫ్ట్‌ టిష్యూ రుమాటిజం; కీళ్లు, టెండన్స్‌, లిగ్మెంట్స్‌ క్యాప్సూల్స్‌, బుర్సా, స్ట్రెస్‌ ఫ్రాక్చర్స్, కండరాలు, నెర్వ్‌ ఎంట్రాప్‌మెంట్, వాస్క్యులర్‌ లెజియన్స్, గాంగ్లియన్, కనెక్టివ్‌ టిష్యూ అసహజతలు, లోకలైజ్డ్‌ సాఫ్ట్‌ టిష్యూస్‌ డిజార్డర్స్‌ వంటి కీళ్ల పరిసరాల్లోని నిర్మాణాలను ప్రభావితం చేసే వ్యాధులు)

ఎముకలను ప్రభావితం చేసే వ్యాధులు;

ఆస్టియోపొరోసిస్‌, ఆస్టియోమలాసియా, రేనల్‌ ఆస్టియోడిస్ట్రొఫీ, ఫ్లుయోరొసిస్‌, రికెట్స్‌ వంటివి.

కీళ్లపై ప్రభావం చూపే కంజెనిటల్‌, ఫమీలియల్‌ వ్యాధులు;

హైపర్‌ ఎక్స్‌టెన్సిబుల్‌ జాయింట్స్‌;

ఈలర్స్-‌డన్లోస్‌ సిండ్రోమ్, అకండ్రోప్లాసియా, మార్ఫన్స్‌ సిండ్రోమ్‌ వంటివి.

రోగ నిర్ధారణ[మార్చు]

విస్తారమైన వైద్య చరిత్రతో పాటు ఈ వ్యాధుల నిర్ధారణకు మరెన్నో ఉపయుక్తమైన పద్ధతులున్నాయి. వీటిని భౌతిక పరీక్షల విధానంలోనే సులువుగా నిర్వహించవచ్చు. మరోవైపు బాగా క్లిష్టమైన విధానాల ద్వారా కూడా ఈ వ్యాధులను నిర్ధారించడం వీలవుతుంది. వీటికోసం తరచూ రుమటాలజిస్టు, ఇతర నిపుణులైన వైద్యుల అవసరం ఉంటుంది.

భౌతిక పరీక్షలు[మార్చు]

సాధారణ భౌతిక పరీక్షలో వ్యాధి నిర్ధారణ కోసం ఉపయోగించే పద్ధతులుగా కింది ఉదాహరణలను చెప్పుకోవచ్చు.

 • షోబర్స్‌ టెస్ట్‌: నడుము ది గువ భాగంలో ఫ్లెక్సియన్‌ను పరీక్షిస్తుంది
 • మల్టిపుల్‌ జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌
 • మస్క్యులోస్కెలెటల్‌ ఎగ్జామినేషన్‌
  • స్క్రీనింగ్‌ మస్క్యులోస్కెలెటల్‌ ఎగ్జామ్‌ (ఎస్‌ఎంఎస్‌ఈ) - నిర్మాణం, పనితీరులకు సంబంధించిన వేగవంతమైన అంచనా
  • జనరల్‌ మస్క్యులోస్కెలెటల్‌ ఎగ్జామ్‌ (జీఎంఎస్‌ఈ) _ కీళ్ల మంటలకు సంబంధించిన సమగ్రమైన అంచనా
  • రీజనల్‌ మస్క్యులోస్కెలెటల్‌ ఎగ్జామ్‌ (ఆర్‌ఎంఎస్‌ఈ) _ నిర్మాణాలు, పనితీరు, మంటలకు సంబంధించిన ప్రత్యేక అంచనాలు, పరీక్షలు

ప్రత్యేకతలు[మార్చు]

 • ల్యాబరేటరీ టెస్టులు (ఉదాహరణకు ఎరిత్రోకైట్‌ సెడిమెంటేషన్‌ రేట్, రుమటాయిడ్‌ ఫ్యాక్టర్‌, యాంటీ-సీసీపీ (యాంటీాసైక్లిక్‌ సిట్రలినేటెడ్‌ పెప్టైడ్‌ యాంటీబాడీ), ఏఎన్‌ఏ (యాంటీ-న్యూక్లియర్‌ యాంటీబాడీ)
 • ప్రభావిత కీళ్ల ఎక్స్‌రేలుఇతర ఇమేజింగ్‌ పద్ధతులు
 • ప్రభావిత కీళ్ల నుంచి తీసిన ద్రావకాలపై చేసే కిప్టోపాథాలజీ, కెమికల్‌ పాథాలజీ (ఉదాహరణకు సెప్టిక్‌ ఆర్థరైటిస్, గౌట్‌ల తేడాలను నిర్ధారించేందుకు)

చికిత్స[మార్చు]

చాలా రుమాటిక్‌ కేసులను అనల్గెసిక్స్‌, ఎన్‌ఎస్‌ఏఐడీస్‌ (నాన్_స్టెరాయిడ్‌ యాంటీ_ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్‌), స్టెరాయిడ్స్‌ (సీరియస్‌ కేసుల్లో), డీఎంఏఆర్‌డీస్‌ (డిసీజ్‌ మాడిఫయింగ్‌ యాంటీ రుమాటిక్‌ డ్రగ్స్‌), ఇన్‌ఫ్లిక్సిమాబ్‌, అడాలిముమాబ్‌ వంటి మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌, సొల్యుబుల్‌ టీఎన్‌ఎఫ్‌ రిసెప్టర్‌ ఎటనెర్సెప్ట్‌, మెథోట్రెక్సేట్‌ ఫర్‌ మోడరేట్‌ (తీవ్ర రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌కు).[1] బయోలాజిక్‌ ఏజెంట్‌ రిటుక్సిమాబ్‌ (యాంటీ బీ సెల్‌ థెరపీ)కి ఇప్పుడు రిఫ్రాక్టరీ రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ కేసుల్లో వాడేందుకు అనుమతి ఉంది.[2] పలు రుమటాలజికల్‌ వ్యాధుల చికిత్సలో ఫిజియోథెరపీది కీలక పాత్ర. ఆక్యుపేషనల్‌ థెరపీ కూడా రోగులకు ప్రత్యామ్నాయ ఉపశమన మార్గంగా పని చేస్తోంది. వ్యాధి వల్ల శరీరంలోని పలు భాగాల్లో నిలిచిపోయిన కదలికలను మళ్లీ మొదలు పెట్టేందుకు ఇది దోహదపడుతుంది. రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ రోగులకు సాధారణంగా దీర్ఘకాలిక చికిత్స అవసరమవుతుంది. అదికూడా రోగి శరీర, వ్యాధి లక్షణాలను బట్టి ప్రత్యేక శ్రద్ధతో పలు రకాల విభాగాల సమన్వయంతో జరిగే చికిత్స మంచి ఫలితాలిస్తుంది. రోగుల వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా చికిత్స పద్ధతిని నిపుణులు ఎంచుకుంటుంటారు. అయితే రోగి స్పందన, మందులను అతను తట్టుకునే తీరుతెన్నుల వంటివి కూడా ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి.

శాస్త్రీయ పరిశోధన[మార్చు]

ఆటో ఇమ్యూన్‌ వ్యాధి, పలు రుమాటిక్‌ వ్యాధుల నేపథ్యాల గురించి శాస్త్రీయ పరిశోధనకు సంబంధించిన ఒక పెద్ద సంస్థ ఇటీవలే పరిశోధనలు నిర్వహించింది. పైగా రోగ నిరోధక వ్యవస్థకు కీళ్లు, ఎముకలతో ఉన్న సంబంధం గురించి మరింతగా పరిశోధించేందుకు ఆస్టియో ఇమ్యునాలజీ ఇటీవలే బాగా వికసించింది. వీటితో పాటు వైద్య ప్రక్రియలు, ఎపిడెమిలాజికల్‌ అధ్యయనాలు కూడా జరుగుతున్నాయి. బయోలాజిక్స్‌పై శాస్త్రీయ పరిశోధనలు, మోనోక్లోనల్‌ యాంటీ బాడీ థెరపీలపై క్లినికల్‌ ట్రయల్స్‌ వంటివి ఆర్థరైటిస్‌ వ్యాధుల వైద్య చికిత్సకు కొత్త కోణాలను జోడించాయి.

సూచనలు[మార్చు]

 1. http://arthritis.about.com/cs/mtx/a/mtx.htm
 2. Edwards J, Szczepanski L, Szechinski J, Filipowicz-Sosnowska A, Emery P, Close D, Stevens R, Shaw T (2004). "Efficacy of B-cell-targeted therapy with rituximab in patients with Rheumatoid arthritis". N Engl J Med. 350 (25): 2572–81. doi:10.1056/NEJMoa032534. PMID 15201414.CS1 maint: multiple names: authors list (link)

బాహ్య లింకులు[మార్చు]