రుసీ సూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రుసీ సూర్తి
దస్త్రం:Rusi Surti.jpg
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రుసీ ఫ్రామ్‌రోజ్ సుర్తి
పుట్టిన తేదీ(1936-05-25)1936 మే 25
సూరత్, బ్రిటిషు భారతదేశం
మరణించిన తేదీ2013 జనవరి 13(2013-01-13) (వయసు 76)
ముంబై, మహారాష్ట్ర
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 99)1960 డిసెంబరు 2 - పాకిస్తాన్ తో
చివరి టెస్టు1969 నవంబరు 4 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1956/57–1967/68గుజరాత్
1959/60–1960/61రాజస్థాన్
1968/69–1972/73క్వీన్స్‌లాండ్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 26 160
చేసిన పరుగులు 1,263 8,066
బ్యాటింగు సగటు 28.70 30.90
100లు/50లు 0/9 6/53
అత్యధిక స్కోరు 99 246*
వేసిన బంతులు 3,870 19,515
వికెట్లు 42 284
బౌలింగు సగటు 46.71 37.07
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 10
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 5/74 5/42
క్యాచ్‌లు/స్టంపింగులు 26/– 122/–
మూలం: CricketArchive, 2013 జనవరి 13

రుసీ ఫ్రాంరోజ్ సూర్తి (1936 మే 25 - 2013 జనవరి 13) [1] 1960 నుండి 1969 వరకు 26 టెస్టులు ఆడిన ఒక భారతీయ క్రికెటర్ . అతను లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేస్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలరు, లోయర్-ఆర్డర్ బ్యాట్స్‌మన్. సూర్తి 1959లో లాంకషైర్ లీగ్‌లో హాస్లింగ్‌డెన్‌ ప్రొఫెషనల్. అతను పార్సీ వర్గానికి చెందినవాడు. [2]

బాంబేలో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టుతో టెస్టుల్లో అడుగిడిన తర్వాత, న్యూ ఢిల్లీలో 64 పరుగుల ఇన్నింగ్స్‌తో సూర్తి తన రెండో టెస్టు మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు. అతను బ్యాటింగు వరుసలో 3వ స్థానానికి పదోన్నతి పొందాడు. 1962 లో వెస్టిండీస్‌లో భారత జట్టు పర్యటించినపుడు ఆ సిరీస్‌లో సూర్తి 246 పరుగులు చేసాడు. 1967/68లో జట్టు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో పర్యటించింది. వివిధ ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, టెస్టులలో అతను 37.19 సగటుతో 967 పరుగులు చేసి 42 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో 22 వికెట్లతో 45.50 సగటుతో 688 పరుగులు చేశాడు. ఆక్లాండ్‌లో, అతను తన అత్యధిక టెస్ట్ స్కోరు 99కి ఔటయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో, ఒకే టెస్టులో యాభై పరుగులు చేసి ఐదు వికెట్లు తీసిన తొలి భారతీయ ఆటగాడయ్యాడు.

రంజీ ట్రోఫీలో, అతను రాజస్థాన్, గుజరాత్‌ల తరపున ఆడాడు. అతని అత్యధిక స్కోరు 1959/60లో ఉత్తరప్రదేశ్‌పై రాజస్థాన్ తరపున 246 నాటౌట్. తర్వాత సూర్తి ఆస్ట్రేలియాలో దేశీయ ఫస్ట్-క్లాస్ పోటీ అయిన షెఫీల్డ్ షీల్డ్‌లో క్వీన్స్‌లాండ్ తరపున ఆడాడు. అతను షెఫీల్డ్ షీల్డ్‌లో ఆడిన మొదటి, ఏకైక భారతీయ టెస్టు ఆటగాడు. అతను పదవీ విరమణ చేసినప్పుడు, సూర్తి ఆస్ట్రేలియన్‌గా మారాలని నిర్ణయించుకున్నాడు. క్వీన్స్‌లాండ్‌లో ఉండి, మరో 35 సంవత్సరాలు క్రికెట్ కోచ్‌గా పనిచేశాడు. [3]


2013లో, ముంబైలో ఒక సాధారణ పర్యటనలో ఉన్నప్పుడు, సూర్తికి గుండెపోటు వచ్చింది. 76 సంవత్సరాల వయస్సులో అతడు మరణించాడు [3]

మూలాలు

[మార్చు]
  1. "Former India allrounder Surti dies at 76". ESPNcricinfo. 2013-01-13. Retrieved 2013-01-13.
  2. "In pictures | Parsi cricketers who have played for India". The Hindu (in Indian English). 2021-05-09. ISSN 0971-751X. Retrieved 2023-04-25.
  3. 3.0 3.1 Skene, Patrick (2020-11-27). "Rusi Surti: Indian cricket's original braveheart and 'the poor man's Garry Sobers' | Patrick Skene". The Guardian (in బ్రిటిష్ ఇంగ్లీష్). ISSN 0261-3077. Retrieved 2020-11-28.