రూతు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రూతు గ్రంథకర్త ఎవరో తెలియదు. కొంతమంది సమూయేలు ప్రవక్త అని, మరికొంతమంది నాతాను ప్రవక్త అని చెప్తుంటారు. రూతుగ్రంథం న్యాయాధిపతుల గ్రంథంలో భాగంగా ఉండేదని కొందరు పండితుల అభిప్రాయం. ఈ గ్రంథంలో మోయాబు దేశానికి చెందిన రూతు అనే ఆమె గురించి రాయబడింది. రూతు ఒక విధవరాలు. ఈమె యెహోవా దేవుని విశ్వసించి, తన అత్త నయోమి తో కలిసి బెత్లెహేముకు వచ్చిన తర్వాత బోయజు అనే ఒక జమిందారుతో పరిచయమై, అతనిని వివాహమాడటం, ఆమె వంశంలో దావీదు మహారాజు జన్మించడం చూస్తాం. అదే వంశంలో యేసుక్రీస్తు కూడా జన్మిస్తాడు.

యూదురాలు కాని అన్యస్త్రీయైన రూతు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడటం గొప్ప విశేషం.

"https://te.wikipedia.org/w/index.php?title=రూతు&oldid=1876072" నుండి వెలికితీశారు