రూపల్ పటేల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రూపల్ పటేల్
జననం1974/1975 (age 48–49)
విద్యముంబయి విశ్వవిద్యాలయం (బికాం)
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (లలిత కళలు)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1991–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
సాథ్ నిభానా సాథియా
యే రిష్టే హై ప్యార్ కే
తేరా మేరా సాథ్ రహే
జీవిత భాగస్వామిరాధాకృష్ణ దత్‌

రూపల్ పటేల్, మహారాష్ట్రకు చెందిన టివి, సినిమా నటి. సాత్ నిభానా సాథియా సీరియల్ లో కోకిలా మోడీ పాత్రను, యే రిష్టే హై ప్యార్ కే సీరియల్ లో మీనాక్షి రాజ్‌వంశ్ పాత్రను పోషించింది.[1] 2020లో షోను ప్రమోట్ చేయడంకోసం సాథ్ నిభానా సాథియా రెండవ సీజన్‌లోకోకిల మోడీ పాత్రను తిరిగి పోషించింది.[2]

జననం, విద్య[మార్చు]

రూపల్ పటేల్ 1974 లేదా 1975లో మహారాష్ట్ర రాజధాని బొంబాయిలోని గుజరాతీ కుటుంబంలో జన్మించింది. కామర్స్‌లో డిగ్రీతోపాటు న్యూఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో నటనలో శిక్షణ పొందింది.[3][4]

వ్యక్తిగత జీవితం[మార్చు]

నటుడు రాధాకృష్ణ దత్‌తో రూపల్ పటేల్ వివాహం జరిగింది.[5]

నటనారంగం[మార్చు]

1985–2009[మార్చు]

పిల్లల నాటకాల కోసం పనోరమా ఆర్ట్ థియేటర్స్ అనే నాటక సంస్థను ఏర్పాటుచేసింది.[1] రేపాల్ పటేల్ 1985లో మెహక్‌ అనే సినిమాలో చిన్న పాత్ర ద్వారా మొదట బాలీవుడ్‌ సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[1] అంతర్నాద్ (1991), సూరజ్ కా సత్వన్ ఘోడా (1992), పపీహా (1993), మమ్మో (1994), సమర్ (1999) వంటి ఇతర బాలీవుడ్ చిత్రాలలో నటించింది.[3] వీటిలో కొన్ని చిత్రాలకు శ్యామ్ బెనగల్ దర్శకత్వం వహించారు.[6]

2001లో స్టార్ ప్లస్‌లో జరీనా మెహతా తీసిన షాగున్‌ సీరియల్ తో లఖీ పాత్ర ద్వారా హిందీ టెలివిజన్ పరిశ్రమలోకి ప్రవేశించింది.[7] 2002లో సౌ దాదా ససునాలో ఆశాలత పాత్రను, సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్‌లో క్రైమ్ పెట్రోల్ అనే ప్రసిద్ధ క్రైమ్ థ్రిల్లర్ షో కొన్ని ఎపిసోడ్‌లలో నటించింది.[4] 2009లో కలర్స్ టివిలో[5] లిమిటెడ్ ప్రొడక్షన్ జానే క్యా బాత్ హుయ్‌లో వృందా పాత్రను పోషించింది.

2010–ప్రస్తుతం[మార్చు]

2010 నుండి 2017 వరకు స్టార్ ప్లస్‌లో వచ్చిన సాథ్ నిభానా సాథియాలో స్ట్రిక్ట్ కోకిల మోడీగా నటించి, తన నటనకు విపరీతమైన ప్రజాదరణ, ప్రశంసలు పొందింది.[8][9]

2019లో జీ టీవీలో ప్రతీక్ శర్మ తీసిన మన్మోహినిలో ఉష/కుబర్జ్రా పాత్రలో అతిథి పాత్రలో నటించింది.[10] 2019 మార్చి నుండి 2020 అక్టోబరు వరకు స్టార్ ప్లస్‌లో ప్రసారమైన డైరెక్టర్స్ కుట్ ప్రొడక్షన్స్ టెలివిజన్ షో యే రిష్టే హై ప్యార్ కేలో మీనాక్షి రాజ్‌వంశ్ కపాడియా బూడిద పాత్రను పోషించింది.[11][12]

2020 అక్టోబరులో యే రిష్టే హై ప్యార్ కే స్థానంలో సాథ్ నిభానా సాథియా 2 పేరుతో సాథ్ నిభానా సాథియా రెండవ సీజన్‌లో మళ్ళీ తన పాత్రను కోకిలా మోడీగా పోషించింది.[13][14] గ్యాంగ్స్ ఆఫ్ ఫిల్మిస్తాన్‌లో అతిథిగా నటించింది.[15]

ఇతరాలు[మార్చు]

స్వచ్ఛ భారత్ ఇండియా ప్రాజెక్ట్‌కు అంబాసిడర్‌గా ఉన్న రూపల్ పటేల్, భారత ప్రధాని నరేంద్ర మోడీ నుండి రెండుసార్లు గౌరవం పొందింది.[6]

నటించినవి[మార్చు]

సినిమాలు[మార్చు]

 • మెహక్ (1985)
 • అంతర్నాడ్ (1991)
 • సూరజ్ కా సత్వన్ ఘోడా (1992)
 • పపీహా (1993)
 • మమ్మో (1994)
 • సమర్ (1999)
 • జాగో (2004) – అతిథి పాత్ర
 • పెహచాన్: ది ఫేస్ ఆఫ్ ట్రూత్ (2005)
 • సాంబార్ సల్సా (2007) – ఆర్ట్ డైరెక్టర్

టెలివిజన్[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర ఇతర వివరాలు
1999-2000 గుబ్బరే "మసాలా మామి" ఎపిసోడ్‌లో సింధీ లేడీ
2001 షాగున్ లఖీ [3]
2002 సౌ దాదా ససూనా ఆశాలతా శేత్ [4]
2009 జానే క్యా బాత్ హుయీ బృందా
2010–17 సాథ్ నిభానా సాథియా కోకిల పరాగ్ మోడీ [9]
2019 మన్మోహిని కుబర్జ్ర/ఉష అతిథి పాత్ర[10]
2019–20 యే రిష్టే హై ప్యార్ కే మీనాక్షి రాజ్‌వంశ్/మీనాక్షి మెహుల్ కపాడియా [11][12]
2020 సాథ్ నిభానా సాథియా 2 కోకిల పరాగ్ మోడీ ఎపిసోడ్ 1-31
గ్యాంగ్స్ ఆఫ్ ఫిల్మిస్తాన్ అతిథి[15]
2021–2022 తేరా మేరా సాథ్ రహే మిథిలా మోడీ [16]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 "Actress Rupal Patel, The Original Rasode Mein Kaun Tha Questioner: Feel Blessed To Touch People In Such A Way". Mid Day. Retrieved 2023-01-19.{{cite web}}: CS1 maint: url-status (link)
 2. "Saath Nibhana Saathiya Season 2 to launch in October". The Indian Express (in ఇంగ్లీష్). 28 August 2020. Retrieved 2023-01-19.
 3. 3.0 3.1 3.2 "The 'me' in the Kokilaben meme". The Times of India. Archived from the original on 12 December 2020. Retrieved 2023-01-19.
 4. 4.0 4.1 4.2 Das, Soumitra (18 February 2012). "Rupal Patel is different from reel life". The Times of India. Retrieved 2023-01-19.
 5. 5.0 5.1 "No place for men in TV soaps: Radhakrishna Dutta". The Times of India. Retrieved 2023-01-19.{{cite web}}: CS1 maint: url-status (link)
 6. 6.0 6.1 "Saath Nibhaana Saathiya actor Rupal Patel gets honour from PM Modi for special cause". The Asian Age. Retrieved 2023-01-19.{{cite web}}: CS1 maint: url-status (link)
 7. "Rupal Patel gives comedy a shot". The Times of India. Retrieved 2023-01-19.{{cite web}}: CS1 maint: url-status (link)
 8. "I am done with my journey of playing Kokila Modi in Saath Nibhaana Saathiya: Rupal Patel". The Times of India. Retrieved 2023-01-19.{{cite web}}: CS1 maint: url-status (link)
 9. 9.0 9.1 "I am not quitting Saath Nibhana Saathiya, I'm too happy playing Kokila: Rupal Patel". The Indian Express. Retrieved 2023-01-19.{{cite web}}: CS1 maint: url-status (link)
 10. 10.0 10.1 "saath-nibhaana-saathiya-actress-rupal-patel-returns-to-tv-with-manmohini". The Times of India. Retrieved 2023-01-19.{{cite web}}: CS1 maint: url-status (link)
 11. 11.0 11.1 "Rupal Patel Says Kokila Modi and Meenakshi Rajvansh are like Twins". The Times of India. Retrieved 2023-01-19.{{cite web}}: CS1 maint: url-status (link)
 12. 12.0 12.1 "Right in the act". The Tribune. Retrieved 2023-01-19.{{cite web}}: CS1 maint: url-status (link)
 13. "Saath Nibhaana Saathiya 2 Maker Confirms Return of Gopi Bahu and Kokilaben". 28 August 2020. Retrieved 2023-01-19.
 14. "Saath Nibhana Saathiya Season 2 to launch in October". 28 August 2020. Retrieved 2023-01-19.
 15. 15.0 15.1 "Rupal Patel will make a guest appearance in the Gangs of Filmistan". The Tribune. Retrieved 2023-01-19.{{cite web}}: CS1 maint: url-status (link)
 16. "Rupal Patel to begin shooting for Tera Mera Saath Rahe". The Times of India. Retrieved 2023-01-19.{{cite web}}: CS1 maint: url-status (link)

బయటి లింకులు[మార్చు]