రూప్‌నగర్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రూప్‌నగర్ జిల్లా
Located in the northwest part of the state
పంజాబులో జిల్లా స్థానం
దేశం India
రాష్ట్రంపంజాబ్
Named forరాజా రోకేశ్వరుని కుమారుడు, రూప్ సేన్
ముఖ్య పట్టణంరూప్‌నగర్
Area
 • Total1,440 km2 (560 sq mi)
Population
 (2011)‡[›]
 • Total6,84,627
 • Density480/km2 (1,200/sq mi)
భాషలు
 • అధికారికపంజాబీ
Time zoneUTC+5:30 (IST)
ISO 3166 codeIN-PB-RU
అక్షరాస్యత82.19%
సట్కెజ్ నది ఒడ్డున గడ్డి మేస్తున్న పశువులు
సట్లెజ్ నది ఒడ్డున గురుద్వారా శ్రీ తీబీ సాహెబ్

పంజాబు రాష్ట్రం లోని 22 జిల్లాలలో రూప్‌నగర్ జిల్లా (డోయబ్:ਰੂਪਨਗਰ ਜ਼ਿਲਾ) ఒకటి. రూప్‌నగర్, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. ఈ పట్టణాన్ని గతంలో రోపార్ /రూపార్ అనేవారు. 11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజా రోఖేశ్వర్ ఈ నగరాన్ని స్థాపించి తన కుమారుని పేరు పెట్టాడని భావిస్తున్నారు. ఇది " సింధూ నాగరికతకు " చెందిన పురాతన నగరమని భావిస్తున్నారు. రూప్ నగర్ జిల్లా లోని ప్రధాన నగరాలు మొరిండా, కురలి, ఆనందపూర్ సాహిబ్. రూప్ నగర్‌ను భాగ్‌వాలా (పూదోటల నగరం) అనికూడా అంటారు. మొరిండా చంఢీగఢ్- లుధియానా రహదారిలో ఉంది.

రూపార్[మార్చు]

సట్లెజ్ నది ఎడమ తీరంలో, శివాలిక్ పర్వతాల పైన 21 మీ ఎత్తున ఉన్న మట్టిదిబ్బ పేరు రూపర్. ఇది 6 సంస్కృతులకు సాక్ష్యంగా నిలిచింది. ఈ జిల్లాలో డాక్టర్ వైడి శర్మ పురాతత్వపరిశోధనలు సాగించాడు. హరప్పన్ నుండి రూపర్‌కు వలసలు సరస్వతి, సట్లెజ్ నది మీదుగా సాగాయి.

పురాతన కాలం 1[మార్చు]

రూపర్ వద్ద జరిగిన త్రవ్వకాలలో ఆరంభకాల సింధు నాగరికతకు చెందిన అనేక ఆధారాలు లభించాయి. సింధునాగరికతకు సంబంధించిన లిపి, ముద్రలు ఉన్న వస్తువులు, మట్టిని కాల్చి చేసిన టెర్రకోటా వస్తువులు, చెర్ట్ బ్లేడ్లు, రాగి వస్తువులు, టెర్రకోటా పూసలు, గాజులు, సింధునాగరికతకు చెందిన సాధారణ మట్టిపాత్రలు లభించాయి. మొత్తం హరప్పన్ పట్టణాలు, గ్రామాలలో ఇవి పుష్కలంగా లభించాయి.

  • మరణించిన వారిని ఖననం చేసే సమయంలో తలను ఉత్తరం వైపు ఉంచి సమాధిపాత్రలలో ఖననం చేస్తారు. ఈ సమాధిపాత్రలు హరప్పా (సింధ్ (పాకిస్థాన్) వద్ద జరిపిన త్రవ్వకాలలో వెలుపలికి తీయబడ్డాయి. హరప్పన్లు ఈ ప్రాంతాన్ని విసర్జించిన కారణం మాత్రం అర్ధం కాలేదు.

పురాతన కాలం 2[మార్చు]

సింధునాగరికత రెండవ స్థాయిలో వర్ణాలు చిత్రీకరించబడిన బూడిదరంగు పాత్రలు (గ్రే వేర్) వాడుకలో ఉన్నాయి. సాధారణంగా హరప్పన్ సంబంధిత రెండవ స్థాయి సమయానికి చెందిన నలుపు వర్ణంతో చిత్రించబడిన గ్రే వేర్ పాత్రలు, టెర్రకోటా గాజులు, సెమీ ప్రెసీషియస్ స్టోంస్, గ్లాస్, బోన్ అర్రోహెడ్స్ వాడుకలో ఉన్నాయి. ఈ సమయం మహాభారతకావ్యానికి సంబంధిత కాలమని భావిస్తున్నారు.

క్రీ.పూ 600 ఈ ప్రాంతంలో సరికొత్త ఆవాసాలు మొదలైయ్యాయి. ఇది రూపర్ చారిత్రలో 3 వ స్థాయికి చెందిన కాలమని చరిత్రకారులు భావిస్తున్నారు. రెండవ స్థాయికి చెందిన గ్రే వేర్ హరప్పన్ సంస్కృతి కూడా కొనసాగింది. ఈ కాలాన్ని సిర్కా క్రీ.పూ 600- క్రీ.పూ 200 సంస్కృతికి చెందింది. ఈ కాలానికి చెందిన ముద్రలు, పోతపోసిన నాణ్యాలు త్రవ్వకాలలో లభ్యం అయ్యాయి. వీటిలో మౌర్యకాలానికి చెందిన ఇనుప ముద్రలు, రాగి, ఇతర ఉపకరణాలు చెలామణిలో ఉన్నాయి.

తక్షశిల (పాకిస్థాన్), పాట్నా (బీహార్), ఇతర మౌర్య సామ్రాజ్యానికి చెందిన ప్రాంతాలలో నైపుణ్యంతో చెక్కబడి మెరుగులు దిద్దబడిన ఆభరణాలు ధరించిన లక్ష్మీ దేవి విగ్రహాలు త్రవ్వకాలలో లభించాయి. కాల్చిన ఇటుకలు, మట్టితో నిర్మించిన గృహాలు విస్తారంగా ఉన్నాయి. 3.6 మీటర్ల వెడల్పు 75మీటర్ల పొడవైన కాల్చిన ఇటుకలతో నిర్మించిన గోడలతో నిర్మించబడిన నీటితొట్టి ఆ కాలం నాగరికత ఔన్నత్యాన్ని చాటి చెబుతున్నాయి.సుంగ, కుషన్ సామ్రాజ్యానికి చెందిన బావుల వెలుపలి భాగం టెర్రకోటా వరలు అమర్చబడ్డాయి.

పురాతన కాలం 3 నుండి 5[మార్చు]

పురాతన కాలం 3 నుండి 5 లో ఆడంబరంగా నిర్మించబడిన రాళ్ళు, మట్టి ఇటుకలతో నిర్మించబడిన భవనసముదాయాలు ఉన్నాయని భావిస్తున్నారు. పూర్తి ప్రణాళికతో నిర్మించిన భవనాలకంటే గుండ్రని భవనసముదాయాలు అధికంగా త్రవ్వకాలలో లభించాయి.

పురాతన కాలం 6[మార్చు]

పురాతన కాలం 6లో సుంగ, కుషాన్, గుప్తుల సామ్రాజ్యాలకు చెందిన రాజులు వారి వారసులు ఈ ప్రాంతాన్ని పాలించారు. వీటికి సంబంధించిన భవనసముదాయాల అవశేధాలు త్రవ్వకాలలో లభించాయి. గుప్త, కుషానులకు పాలకులకు చెందిన నాణ్యాలు లభించాయి. వీటిలో మైర్యచంద్రగుప్తునికి చెందిన బంగారునాణ్యాలు కూడా ఉన్నాయి. ఈ కాలాన్ని భరతదేశ చరిత్రలో స్వర్ణయుగమని కూడా పేర్కొంటారు. అంతేకాక సుంగ, గుప్తుల కాలానికి చెందిన టెర్రకోటా శిల్పాలు పెద్ద ఎత్తున లభించాయి. వీటిలో యక్షిణి శిల్పం ఒకటి. గుప్తుల కాలానికి చెందిన బంగారు నాణ్యాలలో ఉన్న సముద్రగుప్తుని టెర్రకోటా శిల్పం కూడా లభించింది. అంతేకాక శిథిలావస్థలో ఉన్న 3 వెండి పాత్రలు లభించాయి. ఇవి గ్రీకుల శైలితో తయారు చేయబడినవని భావిస్తున్నారు. ఈ కాలంలో అధికంగా ఎర్రని మట్టి పాత్రలు వాడకంలో ఉన్నాయి. తరువాత 6వ శతాబ్దం నుండి దాదాపు మూడు నాలుగు శతాబ్ధాల కాలానికి చెందిన వస్తువులు లభ్యమైయ్యాయి. తొరామన (సా.శ. 500), మిహిరకుల (సా.శ. 510-40) కాలానికి చెందిన సిర్కాలు కూడా లభించాయి. 5 వ స్థాయిలో నిర్మించబడిన ఇటుకల భవనాలు ఆకాలం సమృద్ధికి నిదర్శనంగా నిలిచాయి. సా.శ. 13 వ శతాబ్దం నాటికి ఈ ప్రాంతంలో పట్టణ నిర్మాణం మొదలైనదని భావిస్తున్నారు. 6 స్థాయి నుండి ఇప్పటి వరకు ఈ ప్రాంతం సుసంపన్నత కొనసాగుతూనే ఉంది.

  • పురాతత్వ ప్రదర్శనశాలను నిర్మించి అందులో త్రవ్వకాలలో లభ్యమైన వద్తువులను బధ్రపరిచారు. ఇందులో పురాతన వస్తువులు, రూప్నగర్ చాయాచిత్రాలు కూడా బధ్రపరచబడి ఉన్నాయి..

ప్రాంతం[మార్చు]

పంజాబు రాష్ట్రం లోని పటియాలా విభాగానికి చెందిన రూప్‌నగర్ జిల్లా ఉత్తరంగా 30°-32', 31°-24' డిగ్రీల అక్షాంశంలో, తూర్పుగా 76°-18', 76°-55' డిగ్రీల రేఖాంశంలో ఉంది. రూప్‌నగర్ సాధారణంగా రోపార్ / రూపార్ అని పిలిచేవారు. జిల్లాకేంద్రం రూప్‌నగర్, చండీగఢ్ నుండి 42 కి.మీ దూరంలో ఉంది. జిల్లా సరిహద్దులలో షహీద్ భగత్ సింగ్ నగర్, మొహాలీ, ఫతేగఢ్ జిల్లాలు ఉన్నాయి. జిల్లాలో రూప్నగర్, ఆనందపూర్, చంకౌర్ సాహిబ్ అనే 3 తాలూకాలు ఉన్నాయి. 617 గ్రామాలు, 6 పట్టణాలు (రుప్‌నగర్, చంకౌర్ సాహిబ్, ఆనంద్పూర్ సాహిబ్, మొరిండా (భారత్), నాంగల్ ) ఉన్నాయి. చంకౌర్ సాహిబ్ తప్ప మిగిలినవన్నీ రైల్వే మార్గంలో ఉన్నాయి. జిల్లాలోని నాంగల్, రూప్నగర్, ఆనందపూర్ సాహిబ్‌ల గుండా సట్లైజ్ నది ప్రవహిస్తుంది.

దాధీ గ్రామం వద్ద ఉన్న గురుద్వారా శ్రీ హర్‌గీవింద్‌సర్ సాహిబ్

వాతావరణం[మార్చు]

రూప్‌నగర్ జిల్లాలోని వాతావరణం సాధారణంగా పొడిగా ఉంటుంది. నైరుతీ రుతుపవనాలు జిల్లాలో వర్షపాతానికి సహకరిస్తాయి. వేడి వేసవి, అత్యంత చలితో కూడిన శీతాకాలం ఉంటాయి. వాతావరణ పరంగా జిల్లా 4 విభాగాలుగా విభజించబడింది. నవంబరు మద్య నుండి ఫిబ్రవరి వరకు చలికాలం, తరువాత కాలం మార్చి నుండి జూన్ చివరి వరకు వేసవి కాలం, జూన్ నుండి నైరుతీ ౠతుపవనాలు ఆరంభమై సెప్టెంబరు మద్య వరకూ వర్షాలు ఉంటాయి. సెప్టెంబరు మద్య నుండి నవంబరు మద్య వరకు వర్షాలు కొనసాగుతుంటాయి. శీతాకాలం నుండి వేసవి కాలం వరకు ఉష్ణోగ్రతలు 4-45 సెల్షియస్ డిగ్రీల వరకు ఉంటుంది. మే, జూన్ మాసాలు సాధారణంగా ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. వర్షాకాలంలో గాలిలో తేమ 70% వరకూ ఉంటుంది. సరాసరి వర్షపాతం 775మి.మీ. జూన్, సెప్టెంబరు మద్య కాలంలో 78% వర్షపాతం ఉంటుంది. భుభాగం అధికంగా బంకమట్టి, స్వల్పంగా ఇసుక కలిగి ఉంటుంది. సట్లైజ్ నదీ ప్రాంతంలో బంకమట్టి అధికంగానూ అక్కడక్కడా ఇసుక కలిగి ఉంటుంది. చంకౌర్ సాహిబ్, ఖరర్ బ్లాకులలలో సోడిక్ మట్టి ఉంటుంది. ఆనందపూర్ సాహిబ్, రూప్‌నగర్ భూభాగం అసమానతలు కలిగిన మట్టి ఉంటుంది.

రూప్‌నగర్ జిల్లాలోని తాలూకాలు[మార్చు]

  • ఆనంద్పూర్ సాహిబ్
  • చంకౌర్ సాహిబ్
  • నాంగల్
  • రూప్‌నగర్

నగరాలు , పట్టణాలు[మార్చు]

  • ఆనందపూర్ సాహిబ్ (రోపార్)
  • చంకుమార్ సాహిబ్ (రోపార్)
  • కిరత్పూర్ సాహిబ్ (రోపార్)
  • మోరిండా సిటీ (రోపార్)
  • నంగల్ (రోపార్)
  • రూప్‌నగర్
  • కమల్పూర్ (రోపార్)
  • ఘనౌలి టెర్మినల్ పవర్ ప్లాంట్, రోపార్ ఘనౌలి
  • దధి
  • భారత్‌ఘఢ్
  • కర్తర్పూర్ ( రూప్‌నగర్)

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 683,349,[1]
ఇది దాదాపు. గునియా దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. నార్త్ డకోటా నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 507వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 488.[1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 8.67%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 913:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 83.3%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

ప్రముఖులు[మార్చు]

  • ఈ జిల్లా లోని రోపూర్." బహుజన్ సమాజ్ పార్టీ " వ్యవస్థాపకుడు కన్షీరాం స్వస్థలం.[4]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Equatorial Guinea 668,225 July 2011 est.
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. North Dakota 672,591
  4. "Kanshiram was born in Pirthipur Bunga village, Khawaspur, Ropar district, on 15 March 1934, to Bishan Kaur and Hari Singh".

వెలుపలి లింకులు[మార్చు]

  • Govt. Website on Rupnagar Rupnagar BSNL telephone directory search
  • Archaeological Museum in Rupnagar (Archaeological Survey of India)