రూప‌క్ రొనాల్డ్‌స‌న్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రూప‌క్ రొనాల్డ్‌స‌న్
Rupak Ronaldson.jpg
జననం
రూప‌క్ రొనాల్డ్‌స‌న్

వృత్తితెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత

రూప‌క్ రొనాల్డ్‌స‌న్ తెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత. కొబ్బరి మట్ట సినిమా ద్వారా తెలుగు సినిమారంగంలోకి దర్శకుడిగా ప్రవేశించాడు.[1][2]

జీవిత విషయాలు[మార్చు]

రూప‌క్ రొనాల్డ్‌స‌న్ మంచిర్యాల జిల్లాలో జన్మించాడు.

సినిమారంగం[మార్చు]

రాయ్ విశ్వవిద్యాలయం నుండి ఫిల్మ్ డైరెక్షన్ కోర్సులో పట్టా పొందాడు. తొలిరోజుల్లో టెలివిజన్ కార్యక్రమాలు, ప్రచార చిత్రాల (యాడ్స్) కు రచన, ఎడిటింగ్ విభాగాల్లో పనిచేశాడు. వీడియో కూలీ మీడియా అనే సినీ నిర్మాణ సంస్థను కూడా స్థాపించాడు. తరువాత స్టీవెన్ శంకర్ దర్శకత్వంలో సంపూర్ణేష్ బాబు హీరోగా వచ్చిన హృదయ కాలేయం సినిమాకు పనిచేశాడు. ఆ సినిమా జరుగుతున్నప్పుడు రూప‌క్ పనితీరును చూసిన సాయి రాజేష్ నీలం దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు.[3]

2019లో సంపూర్ణేష్ బాబు హీరోగా వచ్చిన కొబ్బరి మట్ట సినిమాకు రూపక్ తొలిసారిగా దర్శకత్వం వహించాడు. తిరువీర్ ప్రధాన పాత్రలో తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో పరేషాన్ సినిమా రూపొందించాడు.[4]

సినిమాలు[మార్చు]

  1. కొబ్బరి మట్ట
  2. పరేషాన్

మూలాలు[మార్చు]

  1. "Sampoo does it again with triple role in Kobbari Matta". Deccan Chronicle. 25 May 2016. Retrieved 29 January 2021.
  2. ఈనాడు, సినిమా రివ్యూ (10 August 2019). "కొబ్బరిమట్ట రివ్యూ". www.eenadu.net. Archived from the original on 15 August 2019. Retrieved 29 January 2021.
  3. The Hindu, Movies (8 August 2019). "Filmmaker Rupak Ronaldson on directing Telugu cinema's 'Burning Star'". Prabalika M. Borah. Archived from the original on 8 August 2019. Retrieved 29 January 2021.
  4. Telangana Today, Features (18 December 2020). "Rupak Ronaldson completes the production of his next film 'Pareshan'". Santosh Padala. Archived from the original on 29 January 2021. Retrieved 29 January 2021.

ఇతర లంకెలు[మార్చు]