రెండవ చంద్రగుప్తుడు
రెండవ చంద్రగుప్తుడు | |
---|---|
విక్రమాదిత్యుడు మహారాజాధిరాజ పరమభట్టారక దేవరాజ రాజర్షి త్రిసముద్రాధీశ్వర అప్రతిరథ పరమభాగవతుడు చక్ర విక్రమ | |
![]() 8 గ్రాముల బంగారు నాణెంపై గుర్రంపై చంద్రగుప్తుడి బొమ్మ, ఎడమ చేతిలో బాణంతో.[1] చ-గు-ప్త అనే పేరు పైన్, ఎడమ పక్కన కనిపిస్తుంది | |
గుప్త చక్రవర్తి | |
పరిపాలన | సుమారు 375 లేదా 380 – 415 CE (35-40 ఏళ్ళు) |
పట్టాభిషేకం | సుమారు 380 CE |
పూర్వాధికారి | సముద్రగుప్తుడు, బహుశా రామగుప్తుడు |
ఉత్తరాధికారి | మొదటి కుమారగుప్తుడు |
జననం | బహుశా సా.శ. 345-350 ప్రాంతాన పాటలీపుత్రం, గుప్త సామ్రాజ్యం |
మరణం | సుమారు 415 CE పాటలీపుత్రం లేదా ఉజ్జయిని, గుప్త సామ్రాజ్యం |
Spouse | ధ్రువదేవి, కుబేరనాగ |
వంశము | |
రాజవంశం | గుప్తులు |
తండ్రి | సముద్రగుప్తుడు |
తల్లి | దత్తదేవి |
మతం | హిందూమతం[2] Military career |
రాజభక్తి | Gupta Empire |
సేవలు/శాఖ | Gupta Army |
ర్యాంకు | Supreme Commander |
పోరాటాలు / యుద్ధాలు | See list
|
గుప్త సామ్రాజ్యం 320–550 | ||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
||||||||||||||||||||||||||||||||||||
రెండవ చంద్రగుప్తుడు (సా.శ. 375–415) గుప్త సామ్రాజ్యాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన గొప్ప చక్రవర్తులలో ఒకడు. అతను చంద్రగుప్త విక్రమాదిత్యుడుగా ప్రసిద్ధుడు. అతని పాలన కాలం భారతదేశ స్వర్ణయుగానికి శిఖరాగ్రంగా నిలిచింది. కళ, సాహిత్యం, విజ్ఞానం, పరిపాలన రంగాల్లో పురోగతి సాధించింది. అతడు సముద్రగుప్తుని కుమారుడు. చరిత్రకారులు అతన్ని రెండవ చంద్రుగుప్తుడుగా గుర్తిస్తారు. మొదటి చంద్రగుప్తుడు అతని తాత.
ఢిల్లీ ఇనుప స్తంభంపై ఉన్న శాసనంలో పేర్కొన్న రాజు చంద్రుడు, చంద్రగుప్తుడే. ఆ శాసనంలో అతని సైనిక విజయాలను పేర్కొన్నారు. సైనిక విజయాలు, వివాహ సంబంధాల ద్వారా తండ్రి సముద్రగుప్తుని రాజ్య విస్తరణ విధానాన్ని కొనసాగించాడు. చారిత్రక ఆధారాల ప్రకారం, అతను అద్భుతమైన విజయాలను సాధించాడు. సస్సానిడ్లపై విజయం, [3] పశ్చిమ క్షాత్రపులను జయించడం, హుణులను సామంతులుగా చేసుకోవడం వాటిలో కొన్ని. రెండవ చంద్రగుప్తుడి పాలనలో, గుప్త సామ్రాజ్యం అత్యున్నత స్థాయికి చేరుకుంది, పశ్చిమాన ఆక్సస్ నది [4] నుండి తూర్పున బెంగాల్ ప్రాంతం వరకూ, ఉత్తరాన హిమాలయాల పర్వత ప్రాంతాల నుండి దక్షిణాన నర్మదా నది వరకూ విస్తరించి ఉన్న విశాలమైన భూభాగాన్ని అతను నేరుగా పాలించాడు. రెండవ చంద్రగుప్తుడు తన ప్రభావాన్ని విస్తరించి, కదంబులతో వివాహ సంబంధం కలుపుకుని కర్ణాటకలోని కుంతల ప్రాంతాన్ని పరోక్షంగా పాలించాడు. అతని కుమార్తె ప్రభావతిని వాకాటక రాజు రెండవ రుద్రసేనునికిచ్చి పెళ్ళి చేసి సంబంధం కలుపుకున్నాడు. ఆమె 20 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు వాకాటక సామ్రాజ్యాన్ని పాలించింది. ఆమె పాలనలో వాకాటక రాజ్యం, గుప్త సామ్రాజ్యంలో దాదాపుగా భాగమైపోయింది.[5] [6] [7]
రెండవ చంద్రగుప్తుడు వైష్ణవుడు. ఇతర మతాల పట్ల సహిష్ణుత చూపించాడు. అతను గొప్ప విద్యా పోషకుడు. ఆయన ఆస్థానంలో నవరత్నాల పేరిట తొమ్మిదిమంది పండితులు ఉండేవారు. అతని పాలనలో వాణిజ్యం, సంస్కృతి, పరిపాలనా యంత్రాంగం బలోపేతమయ్యాయి. ఆ కారణంగా అతను భారతదేశపు అత్యంత ప్రసిద్ధ చక్రవర్తులలో ఒకడయ్యాడు. అతని కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఫాహియాన్, అతని రాజ్యం శాంతియుతంగా, సంపన్నంగా ఉందని రాసాడు. పౌరాణిక ప్రసిద్ధుడైన విక్రమాదిత్యుడు పాత్రను బహుశా చంద్రగుప్తుడి ఆధారంగానే కల్పించి ఉండవచ్చు. ప్రముఖ సంస్కృత కవి కాళిదాసు అతని ఆస్థాన కవి అయి ఉండవచ్చు. ఉదయగిరి వద్ద ఉన్న గుహ మందిరాలు కూడా అతని పాలనలోనే నిర్మించబడ్డాయి. అతని తర్వాత మొదటి కుమారగుప్తుడు సింహాసనాన్ని అధిష్టించాడు.
పేర్లూ బిరుదులూ
[మార్చు]- రెండవ చంద్రగుప్తుడినాణేలు
-
"ఛత్ర" రకం (ఎడమ), "ఆర్చర్" రకం (కుడి) నాణేల ఎదురుగా
-
బ్రాహ్మి లిపిలో రాజు పేరు ఉన్న నాణెం





గుప్తవంశంలో "చంద్రగుప్తుడు" అనే పేరున్న రెండవ పాలకుడు రెండవ చంద్రగుప్తుడు. మొదటివాడు అతని తాత మొదటి చంద్రగుప్తుడు. అతని నాణేలలో చూపినట్లు, అతన్ని "చంద్రుడు" అని కూడా పిలుస్తారు.[10] అతని వద్ద పనిచేసిన అధికారి అమ్రకార్దవ వేయించిన సాంచి శాసనం, ఆయనను దేవరాజు అని పేర్కొంది. చంద్రగుప్తుడి కుమార్తె, వాకాటక రాణీ అయిన ప్రభావతి వేయించిన శాసనాల్లో అతన్ని చంద్రగుప్తుడు అనీ, దేవగుప్తుడు అనీ పేర్కొంది.[11] దేవ-శ్రీ అనేది అతని మరొక పేరు.[12] ఢిల్లీ ఇనుప స్తంభ శాసనం, చంద్ర రాజును "ధవ" అని కూడా పిలిచేవారని పేర్కొంది: ఆ రాజు చంద్రుడే చంద్రగుప్తుడైనట్లయితే, "ధవ" అనేది అతనికి ఉన్న మరొక పేరు అని తెలుస్తుంది. మరొక అవకాశం ఏమిటంటే "ధవ" అనేది "భవ" అనే సాధారణ నామవాచకానికి పొరపాటు అయి ఉండవచ్చు కూడా. అయితే, మిగిలిన శాసనంలో ఎటువంటి లోపాలూ లేవు కాబట్టి అది అంతగా సంభవమనిపించదు.[13]
విష్ణు పురాణం ప్రకారం భారతదేశ తూర్పు తీరంలోని కోసల, ఓద్ర, తామ్రలిప్త, పూరి రాజ్యాలను గుప్తుల సమకాలికులైన దేవరక్షితులు పాలించారు. గుప్తుల కాలంలో దేవరక్షిత అనే అంతగా పేరులేని రాజవంశం గణనీయమైన భూభాగాన్ని నియంత్రించేంత శక్తివంతమైనది కాకపోవచ్చునని చెబుతూ దశరథ శర్మ వంటి కొంతమంది పండితులు, "దేవ-రక్షిత" అనేది రెండవ చంద్రగుప్తుడికి ఉన్న మరొక పేరు అయి ఉండవచ్చునని సిద్ధాంతీకరించారు. డికె గంగూలీ వంటి ఇతరులు ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకించారు. ఈ గుర్తింపు చాలా ఏకపక్షమనీ, దాన్ని సంతృప్తికరంగా వివరించలేమనీ వారు వాదించారు.[14]
చంద్రగుప్తుడు భట్టారకుడు, మహారాజాధిరాజ అనే బిరుదులను స్వీకరించాడు. అప్రతిరథ ("అసమానుడు") అనే బిరుదు కూడా అతనికి ఉంది. అతని వారసుడు స్కందగుప్తుడి పాలనలో జారీ చేయబడిన సుపియా రాతి స్తంభ శాసనం అతన్ని "విక్రమాదిత్యుడు" అని పేర్కొంది.[12] త్రిసముద్రాధీశ్వరుడు అనీ, రాజర్షి అనీ మరికొన్ని ముఖ్యమైన బిరుదులు కూడా రెండవ చంద్రగుప్తునికి ఉన్నాయి.[15]
జీవితం తొలినాళ్ళు
[మార్చు]చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, రాణి దత్తాదేవిల కుమారుడు అని అతని స్వంత శాసనాలు ధ్రువీకరించాయి.[12] అధికారిక గుప్త వంశావళి ప్రకారం, చంద్రగుప్తుడు తన తండ్రి తర్వాత గుప్త సింహాసనాన్ని అధిష్టించాడు. సంస్కృత నాటకం దేవీచంద్రగుప్తం ప్రకారం, వేరే ఇతర ఆధారాలతో కూడా కలిసి, అతనికి రామగుప్తుడు అనే అన్నయ్య ఉన్నాడని, అతను చంద్రగుప్తుని కంటే ముందు సింహాసనం అధిష్టించాడనీ సూచిస్తుంది. ఆ నాటకంలో, శకులు తనను ముట్టడించినపుడు రామగుప్తుడు తన రాణి ధ్రువదేవిని శత్రువుకు అప్పగించాలని నిర్ణయించుకుంటాడు. కానీ చంద్రగుప్తుడు రాణి వేషంలో శత్రు శిబిరానికి వెళ్లి శత్రువును చంపుతాడు. కొంతకాలం తర్వాత, చంద్రగుప్తుడు రామగుప్తుడిని సింహాసనం నుండి తొలగించి, తానే రాజు అవుతాడు.[16] ఈ కథనం లోని చారిత్రకతపై ఆధునిక చరిత్రకారులు చర్చించారు. కొందరు ఇది నిజమైన చారిత్రక సంఘటనల ఆధారంగా రూపొందించబడిందని నమ్మగా, మరికొందరు దీనిని కల్పిత రచనగా తోసిపుచ్చారు. [17] [18]
పాలనా కాలం
[మార్చు]- రెండవ చంద్రగుప్తుని వివిధ బంగారు నాణేలు

రెండవ చంద్రగుప్తుని మధుర స్తంభ శాసనం (అలాగే మరికొన్ని గుప్త శాసనాలు) రెండు తేదీలను ప్రస్తావిస్తున్నాయి: ఈ తేదీలలో ఒకటి, రాజు పాలన సంవత్సరాన్ని సూచిస్తుందనీ, రెండవది గుప్త శక సంవత్సరాన్ని సూచిస్తుందనీ అనేక మంది చరిత్రకారులు భావించారు.[21] అయితే, 2004 లో ఇండాలాజిస్టు హ్యారీ ఫాక్, పూర్వ పండితులు పాలనా సంవత్సరంగా అర్థం చేసుకున్న తేదీ, వాస్తవానికి కాలానువర్త్తమాన వ్యవస్థకు చెందిన తేదీ అని సిద్ధాంతీకరించాడు. [22] ఫాక్ ప్రకారం, కాలానువర్త్తమాన వ్యవస్థ అనేది కనిష్క చక్రవర్తి స్థాపించిన కుషాణ క్యాలెండర్ శకానికి కొనసాగింపు. అతని పట్టాభిషేక సంవత్సరం సా.శ. 127 అని ఫాక్ చెప్పాడు. కుషాణ యుగం ప్రతి వంద సంవత్సరాల తర్వాత మళ్ళీ మొదటి నుండి మొదలౌతుంది (ఉదా. 100 తర్వాత సంవత్సరం 101 కాదు, మళ్ళీ 1 తో మొదలౌతుంది).[23]
శాసనం | పాలిస్తున్న చక్రవర్తి | రాజవంశ సంవత్సరం | కాలానువర్త్తమాన సంవత్సరం |
---|---|---|---|
మధుర స్తంభం | రెండవ చంద్రగుప్తుడు | అక్షరాలు అరిగిపోయాయి | 61 |
లింటెల్ | ప్రస్తావించలేదు | ఇవ్వలేదు | 70 |
యక్ష మూర్తి | మొదటి కుమారగుప్తుడు | 112 | 5 |
బౌద్ధ విగ్రహ పీఠం | మొదటి కుమారగుప్తుడు | 121 | 15 |
సైనిక విజయాలు
[మార్చు]
చంద్రగుప్తుని విదేశాంగ మంత్రి వీరసేనుని ఉదయగిరి శాసనం ప్రకారం, రాజు విశేషమైన సైనిక విజయాలు సాధించాడని తెలుస్తోంది. అతను తన పరాక్రమాన్నే వెలగా పెట్టి "భూమిని కొన్నాడు" అని, ఇతర రాజులను బానిసలుగా చేసుకున్నాడనీ అది పేర్కొంది. [24] అతని సామ్రాజ్యం పశ్చిమాన సింధు నది ముఖద్వారం నుండి, తూర్పున బెంగాల్ వరకూ, ఉత్తరాన హిమాలయ పర్వత ప్రాంతాల నుండి దక్షిణాన నర్మదా నది వరకు విస్తరించినట్లు తెలుస్తోంది. [10] [25]
చంద్రగుప్తుడి తండ్రి సముద్రగుప్తుడు, అతని కుమారుడు మొదటి కుమారగుప్తుడు తమ సైనిక పరాక్రమాన్ని ప్రకటించడానికి అశ్వమేధ యాగం చేసినట్లు తెలుస్తోంది. 20 వ శతాబ్దంలో వారణాసి సమీపంలో ఒక గుర్రపు ప్రతిమను కనుగొన్నారు. దానిపై ఉన్న శాసనంలో ఉన్న "చంద్రాంగు" ను చంద్రగుప్తుడు అని తప్పుగా అర్థం చేసుకుని చంద్రగుప్తుడు కూడా అశ్వమేధ యాగం చేశాడని భావించారు. అయితే, ఈ సిద్ధాంతానికి మద్దతు ఇవ్వడానికి వాస్తవ ఆధారాలు లేవు.[26]
పశ్చిమ క్షాత్రపులు
[మార్చు]పశ్చిమ-మధ్య భారతదేశాన్ని పాలించిన పశ్చిమ క్షాత్రపులపై (వీరిని శకులు అని కూడా అంటారు) రెండవ చంద్రగుప్తుడు సైనిక విజయాలు సాధించాడని చారిత్రిక, సాహిత్య ఆధారాలు సూచిస్తున్నాయి. [27] చంద్రగుప్తుని తండ్రి సముద్రగుప్తుని అలహాబాద్ స్తంభ శాసనం, అతనిని శాంతింపజేయడానికి ప్రయత్నించిన రాజులలో "శాక-మురుందులు" ఉన్నారని పేర్కొంది.[28] [29] సముద్రగుప్తుడు శకులను సామంతులుగా చేసుకుని ఉండవచ్చు చంద్రగుప్తుడు వారిని పూర్తిగా అణగదొక్కి ఉండవచ్చు. [30]
వీరసేనుడి ఉదయగిరి శాసనం అతన్ని పాటలీపుత్ర నివాసిగా చూపిస్తుంది. "మొత్తం ప్రపంచాన్ని జయించటానికి" బయలుదేరిన తన రాజుతో కలిసి మధ్య భారతదేశంలోని ఉదయగిరికి వచ్చాడని అది పేర్కొంది. దీన్నిబట్టి చంద్రగుప్తుడు సైనిక దండయాత్రలో భాగంగా మధ్య భారతదేశంలోని ఉదయగిరికి చేరుకున్నాడని తెలుస్తోంది. చంద్రగుప్తుడు మధ్య భారతదేశంపైకి దండయాత్రకు వెళ్ళాడనే సిద్ధాంతాన్ని సా.శ. 412–413 (గుప్త సంవత్సరం 93) నాటి అమరకార్డవుని సాంచి శాసనం కూడా ధ్రువీకరిస్తోంది. అతను "అనేక యుద్ధాలలో విజయాలనూ, కీర్తినీ సంపాదించాడని, చంద్రగుప్తుని సేవ చేయడం ద్వారా జీవనోపాధి పొందాడని" చెబుతారు. సా.శ. 401–402 (గుప్త సంవత్సరం 82) నాటి చంద్రగుప్తుని సామంతుడు మహారాజా సానకణికుడు వేయించిన శాసనం కూడా మధ్య భారతదేశంలో కనుగొనబడింది. చంద్రగుప్తుడి కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన ఏకైక ప్రబలమైన శక్తి పశ్చిమ క్షాత్రపులు. వారు వేయించిన ప్రత్యేకమైన నాణేల ద్వారా వారి పాలనాకాలం ధృవీకరించబడింది. పశ్చిమ క్షాత్రప పాలకులు జారీ చేసిన నాణేలు 4వ శతాబ్దం చివరి దశాబ్దంలో అకస్మాత్తుగా ఆగిపోయాయి. [27] ఈ రకమైన నాణేలు తిరిగి 5 వ శతాబ్దపు రెండవ దశాబ్దంలో కనిపించాయి. దీన్నిబట్టి చంద్రగుప్తుడు పశ్చిమ క్షాత్రపులను లొంగదీసుకున్నట్లు తెలుస్తోంది.[30]
పశ్చిమ క్షాత్రపులపై చంద్రగుప్తుడు విజయం సాధించిన ఖచ్చితమైన తేదీ తెలియదు. కానీ అది 397 - 409 ల మధ్య నాటిదని మాత్రం చెప్పవచ్చు. [7] 4వ శతాబ్దపు క్షాత్రప నాణేలలో చివరిది - మూడవ రుద్రసింహుడు వేయించినది - శక సంవత్సరం 310 లేదా 319 నాటిది (నాణెం పాక్షికంగా దెబ్బతింది). అంటే సా.శ. 388 లేదా 397 నాటిది. [27] సా.శ. 409 నాటి చంద్రగుప్తుడి నాణేలు క్షాత్రప నాణేల మాదిరిగానే ఉన్నాయి. శకుల బౌద్ధ విహార చిహ్నం స్థానంలో గుప్తుల గరుడ చిహ్నం వచ్చింది.[7]
పశ్చిమ క్షాత్రపులపై చంద్రగుప్తుడి విజయానికి సాహిత్య ఆధారాలు కూడా ఉన్నాయి. చంద్రగుప్తుడి అన్నయ్య రామగుప్తుని ముట్టడించినప్పుడు అతడు తన రాణి ధ్రువదేవిని శక అధిపతికి అప్పగించడానికి అంగీకరించాడనీ, కానీ చంద్రగుప్తుడు రాణి వేషంలో శత్రు శిబిరానికి వెళ్లి శక అధిపతిని చంపాడనీ, సంస్కృత నాటకం దేవీచంద్రగుప్తం వివరిస్తుంది. అయితే దీని చారిత్రకతపై వివాదం ఉంది.[30] చంద్రగుప్తుడికి విక్రమాదిత్యుడు అనే బిరుదు ఉంది. అనేక భారతీయ ఇతిహాసాల్లో శకులను ఓడించిన రాజు విక్రమాదిత్యుడి గురించిన ప్రస్తావన ఉంది. ఈ ఇతిహాసాలు చంద్రగుప్తుడు శకులపై సాధించిన విజయం ఆధారంగా ఉండవచ్చని అనేక మంది ఆధునిక పండితులు సిద్ధాంతీకరించారు. [30]
పశ్చిమ క్షాత్రపులపై విజయం సాధించి, చంద్రగుప్తుడు తన సామ్రాజ్యాన్ని ప్రస్తుత గుజరాత్‌లోని అరేబియా సముద్ర తీరం వరకు విస్తరించి ఉండాలి.[30]
ఇతర సైనిక విజయాలు
[మార్చు]
ఢిల్లీ ఇనుప స్తంభంపై "చంద్ర" అనే రాజు శాసనం ఉంది. [31] ఆధునిక పండితులు సాధారణంగా ఈ రాజును రెండవ చంద్రగుప్తుడిగా గుర్తిస్తారు, అయితే దీనిని పూర్తి నిశ్చయంగా చెప్పలేము.[32]
ప్రత్యామ్నాయ గుర్తింపులు ప్రతిపాదించబడినప్పటికీ, ఇనుప స్తంభ శాసనంలోని చంద్రుడిని రెండవ చంద్రగుప్తుడే అనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయి: [10]
- చంద్రగుప్తుడి నాణేలు అతన్ని "చంద్రుడు" అని పేర్కొన్నాయి. [10]
- ఇనుప స్తంభ శాసనం ప్రకారం, చంద్రుడు విష్ణు భక్తుడు. [31] చంద్రగుప్తుడు కూడా వైష్ణవుడే. గుప్తుల శాసనాలలో అతన్ని భాగవతుడు (విష్ణువు భక్తుడు) గా వర్ణించారు. [33]
- విష్ణువు గౌరవార్థం చంద్ర రాజు ఈ ఇనుప స్తంభాన్ని విష్ణు-పాద అనే కొండపై ఏర్పాటు చేశాడని చెబుతారు. కానీ శాసనం చెక్కడానికి కొద్దిసేపటి ముందే రాజు మరణించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే "రాజు భూమిని విడిచిపెట్టి ఇతర ప్రపంచానికి వెళ్ళాడు" అని శాసనం చెబుతోంది. గుప్త చక్రవర్తి అయిన స్కందగుప్తుడు (చంద్రగుప్తుడి మనవడు) తన తండ్రి కుమారగుప్త I మరణం తర్వాత ఇలాంటి విష్ణు- ధ్వజాన్ని ఏర్పాటు చేశాడు. [33]
- తన ఉదయగిరి శాసనం ప్రకారం, చంద్రగుప్తుడు దిగ్విజయమైన దండయాత్రలు చేసాడు.[10] అతను మహా శక్తివంతుడైన సార్వభౌముడు. ఇనుప స్తంభంపైనున్న శాసనంలో "స్వీయ భుజబలంతో సార్వభౌముడై సుదీర్ఘ కాలం పాలించిన ఏకైక చక్రవర్తి"గా వర్ణించబడిన రాజు చంద్రుడికి అతను సరిగ్గా సరిపోతాడు [33]
- చంద్రుని పరాక్రమ పవనాలతో "దక్షిణ సముద్రానికి పరిమళం" అబ్బిందని ఇనుప స్తంభ శాసనం పేర్కొంది. చంద్రగుప్తుడు పశ్చిమ క్షాత్రప భూభాగాన్ని జయించి గుప్తసామ్రాజ్యాన్ని అరేబియా సముద్రం దాకా విస్తరించడాన్ని ఇది సూచిస్తుంది. అరేబియా సముద్రం గుప్త సామ్రాజ్యానికి దక్షిణాన ఉంది, అందువల్ల, ఈ సందర్భంలో "దక్షిణ మహాసముద్రం" అనే పదం దీనికి వర్తిస్తుంది.[33]
- ఇనుప స్తంభ శాసనం, "అతని పేరు చంద్రుడు. అతను ముఖవర్చస్సు పౌర్ణమి చంద్రుని పోలి ఉంటుంది" అని పేర్కొంది. అతని వారసుడు స్కందగుప్తుడు వేయించిన మందసౌర్ శాసనాన్ని ఇది గుర్తుకు తెస్తుంది. ఆ శాసనంలో చంద్రగుప్తుడిని, "గుప్తవంశపు నభోమండలంలో చంద్రగుప్తుడు అనే ప్రసిద్ధమైన పేరున్న చంద్రుడు" అని వర్ణించారు. [12]
ఇనుప స్తంభ శాసనం ప్రకారం చంద్రుడు ఈ క్రింది విజయాలు సాధించాడు: [31]
- వంగ దేశంలో శత్రువుల కూటమిని ఓడించాడు.
- ఒక యుద్ధంలో సింధు నదికి చెందిన "ఏడు ముఖాలను" దాటి బాహ్లికులను ఓడించాడు.
పరిపాలన
[మార్చు]చంద్రగుప్తునికి అనేక మంది సామంత రాకులుండేవారు:
- మహారాజా సనకణికుడు ఒక సామంతుడు. అతను నిర్మించిన వైష్ణవ ఆలయం గురించి ఉదయగిరి శాసనంలో ఉంది. [27]
- గయలో బోధిసత్వ చిత్రంపై చెక్కబడిన శాసనంలో సామంతుడు మహారాజు త్రికమల ప్రస్తావన ఉంది.[34]
- విదిశ [34] వద్ద లభించిన ఒక ముద్రలో మహారాజా శ్రీ విశ్వామిత్ర స్వామి అనే సామంతుడి గురించి ఉంది.
- వల్ఖా పాలకుడు మహారాజా స్వామిదాసు కూడా బహుశా గుప్తుల సామంతుడు అయి ఉండవచ్చు. అతను వేయించిన శాసనం గుప్త శకం నాటిదని అనుకుంటే; మరొక సిద్ధాంతం ప్రకారం, అతని శాసనం కాలచూరి కాలం నాటిదని తెలుస్తోంది. [34]
చంద్రగుప్తుని మంత్రులు, అధికారుల గురించి వివిధ చారిత్రక రికార్డుల నుండి తెలిసినదిది:
- ఉదయగిరి శాసనాన్ని బట్టి విదేశాంగ మంత్రి వీరసేనుడు, శివాలయం నిర్మించినట్లు తెలుస్తుంది [35]
- సాంచి శాసనం ప్రకారం, సైనికాధికారి అమ్రకార్దవ, స్థానిక బౌద్ధ ఆశ్రమానికి దానాలిచ్చాడు.[27]
- చరిత్రకారుడు KP జయస్వాల్ సిద్ధాంతం ప్రకారం, శిఖర-స్వామి అనే మంత్రి కమందకీయ నీతి అనే రాజకీయ గ్రంథం రచించాడు.[34]
నవరత్నాలు
[మార్చు]కాళిదాసు రాసిన జ్యోతిర్విదాభరణం ప్రకారం, పురాణ విక్రమాదిత్యుడి ఆస్థానంలో నవరత్నాలు అనే తొమ్మిది మంది ప్రసిద్ధ పండితులు ఉండేవారు. వీరు, కాళిదాసుతో పాటు అమరసింహ, ధన్వంతరి, ఘటకరపర, క్షపణక, శంకు, వరాహమిహిర, వరరుచి, వేటల భట్ట. [36] అయితే, ఈ తొమ్మిది మంది పండితులూ సమకాలికులని గాని, ఒకే రాజు పోషణలో ఉన్న పండితులని గాని చూపించడానికి ఎటువంటి చారిత్రిక ఆధారాలూ లేవు. [37] [38] జ్యోతిర్విదాభరణం కాళిదాసు రచించినది కాదనీ, అతని తరువాతి కాలానికి చెందిన రచన అనీ చాలామంది పండితులు భావిస్తారు. [38] [36] పూర్వ సాహిత్యంలో ఇటువంటి "నవరత్నాల" గురించి ప్రస్తావన లేదు. DC సర్కార్ ఈ సంప్రదాయాన్ని, "చారిత్రక ప్రయోజనాల కోసం పనికిరానిద"ని అన్నాడు. [39]
అయినప్పటికీ, ఈ నవరత్నాలలో ఒకడైన కాళిదాసు, రెండవ చంద్రగుప్తుని పాలనలో నిజంగా ప్రసిద్ధి గాంచి ఉండవచ్చని చాలామంది పండితులు భావిస్తున్నారు. ఈ పండితులలో విలియం జోన్స్, ఎబి కీత్, వాసుదేవ్ విష్ణు మిరాషి తదితరులు ఉన్నారు. [40] [41] కాళిదాసు చంద్రగుప్తుని ఆస్థాన కవి అయి ఉండే అవకాశం ఉంది.[42]
ఫాహియాన్ సందర్శన
[మార్చు]చంద్రగుప్తుని పాలనలో చైనా యాత్రికుడు ఫాహియాన్ భారతదేశాన్ని సందర్శించి గుప్త రాజ్యంలో దాదాపు ఆరు సంవత్సరాలు గడిపాడు. [34] అతనికి ఎక్కువగా బౌద్ధ మత వ్యవహారాలపై ఆసక్తి ఉండేది. పాలించే రాజు పేరును రాయాలని కూడా అతనికి పట్టలేదు. అతను గుప్త పరిపాలనను చాలా ఆదర్శవంతంగా చిత్రించాడు.
అతను చెప్పే ప్రతిదాన్నీ ఉన్నదున్నట్లుగా తీసుకోలేం. అయితే, ఆ రాజ్యం శాంతియుతంగా, సంపన్నంగా ఉందని చెప్పిన అతని వర్ణన
మాత్రం నిజమే అనిపిస్తుంది. తరువాతి కాలంలో వచ్చిన చైనా యాత్రికుడు హ్యూయెన్ త్సాంగ్ లాగా అతను ఎటువంటి దారి దోపిడీల బారిన పడలేదనే వాస్తవం ద్వారా దీన్ని ధ్రువీకరించుకోవచ్చు.[34]
మధురకు ఆగ్నేయంగా ఉన్న మధ్య-దేశ ("మధ్య రాజ్యం") ప్రాంతం మంచి వాతావరణంతో, సంతోషకరమైన ప్రజలతో ఉందని ఫాహియాన్ వర్ణించాడు. పౌరులు "తమ ఇళ్ళను నమోదు చేయించుకోవాల్సిన అవసరం లేదు. న్యాయాధికారుల వద్ద హాజరవడం, వారి నియమాలను పాటించడం చెయ్యనవసరం లేదు" అని రాసాడు. [43] [34] పరిపాలనపై పదే పదే తిరుగుబాటు చేసేవారి కుడి చేతిని నరికివేస్తారని ఫాహియాన్ రాసాడు. ఇతర నేరాలు వేటికీ కొరడా దెబ్బల శిక్ష ఉండేది కాదు: నేర తీవ్రతను బట్టి నేరస్థులకు తేలికైన శిక్షలు లేదా భారీ జరిమానాలు మాత్రమే విధించేవారు.[43] [34] రాజు అంగరక్షకులు, పరిచారకులు అందరికీ జీతాలు ఇచ్చేవారు.[43]
అంటరాని చండాలులు తప్ప, ఇతర ప్రజలు మాంసం, మత్తు పానీయాలు, ఉల్లిపాయలు లేదా వెల్లుల్లి తినరని ఫాహియాన్ రాసాడు. చండాలులు ఇతర వ్యక్తుల నుండి దూరంగా నివసించేవారు. వారు నగరంలోకి గానీ, మార్కెట్‌లోకి గానీ ప్రవేశించినప్పుడు తమ ఉనికిని తెలియజేయడానికి ఒక చెక్క ముక్కను కొట్టుకుంటూ వెళ్ళేవారు: ఇతరులు తమను తాకకుండా దూరంగా ఉండేందుకు గాను ఈ శబ్దాలు చేసేవారు. చేపలు పట్టడం, వేటాడటం, మాంసం అమ్మడం వంటివి చండాలులు మాత్రమే చేసేవారు. సాధారణ మార్కెట్లలో, కసాయి దుకాణాలు లేదా మద్యం వ్యాపారులు ఉండేవారు కాదు. ప్రజలు పందులనూ, కోళ్లనూ పెంచలేదు. [43] చరిత్రకారుడు ఆర్.సి. మజుందార్ ప్రకారం, ప్రజల ఆహారపు అలవాట్ల గురించి ఫాహియాన్ చేసిన పరిశీలనలు బౌద్ధ మత సమాజంతో ఆయనకున్న సంబంధం ఆధారంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది సాధారణ ప్రజలకు వర్తించకపోవచ్చు.[11]
పాటలీపుత్ర ప్రాంతం మధ్య రాజ్యంలో కెల్లా అత్యంత సంపన్నమైన భాగమని ఫాహియాన్ పేర్కొన్నాడు. అక్కడి ప్రజలు దయగలవారు, నీతిమంతులని అభివర్ణించాడు. ఏటా జరిగే ఒక బౌద్ధ వేడుక గురించి వివరిస్తూ, ఇందులో 20 పెద్ద బండ్లపై బుద్ధుల ఊరేగింపు, బ్రాహ్మణులు బుద్ధులను నగరంలోకి ప్రవేశించమని ఆహ్వానించడం, సంగీత ప్రదర్శనలూ ఉన్నాయని రాసాడు. నగరాల్లో వైశ్య నాయకులు నిరాశ్రయులకు దానధర్మాలు, వైద్య సహాయం అందించడానికి కేంద్రాలను స్థాపించారని అతను పేర్కొన్నాడు. ఈ కేంద్రాలు పేదలు, అనాథలు, వితంతువులు, పిల్లలు లేనివారు, వికలాంగులు, రోగులకు ఆశ్రయమిచ్చాయి. వారిని వైద్యులు పరీక్షించి, వారు కోలుకునే వరకు ఆహారం, మందులు అందించేవారు. [43]
శాసనాలు
[మార్చు]
చంద్రగుప్తునిఉకి చెందిన కింది శాసనాలు కనుగొనబడ్డాయి:
- గుప్త శకం 61వ సంవత్సరం నాటి మధుర స్తంభ శాసనం. ఈ తేదీని మునుపటి పండితులు సుమారు సా.శ. 380–381గా అర్థం చేసుకున్నారు, [35] కానీ హ్యారీ ఫాక్ (2004) దీనిని సా.శ. 388 అని పేర్కొన్నాడు. [44]
- మధుర స్తంభ శాసనం, తేదీ లేదు [12]
- ఉదయగిరి గుహ శాసనం, గుప్త శకం 82వ సంవత్సరానికి చెందినది [12]
- ఉదయగిరి గుహ శాసనం, తేదీ లేదు [12]
- గుప్త శకం 88వ సంవత్సరానికి చెందిన గధ్వా శిలాశాసనం [12]
- గుప్త శకం 93 సంవత్సరానికి చెందిన సాంచి శిలాశాసనం [12]
- మెహ్రౌలీ ఇనుప స్తంభం శాసనం, తేదీ లేదు [12]
నాణేలు
[మార్చు]
తండ్రి సముద్రగుప్తుడు ప్రవేశపెట్టిన స్కెప్టర్ రకం (రెండవ చంద్రగుప్తుడికి అరుదైనది), ఆర్చర్ రకం, టైగర్-స్లేయర్ రకం వంటి అనేక బంగారు నాణేలను చంద్రగుప్తుడు కొనసాగించాడు. అయితే, చంద్రగుప్తుడు స్వయంగా కూడా అనేక కొత్త రకాలను ప్రవేశపెట్టాడు. గుర్రపు స్వారీ రకం, సింహ-సంహారక రకం వాటిలో ఉన్నాయి. ఈ రెండింటినీ అతని కుమారుడు మొదటి కుమారగుప్తుడు కూడా ఉపయోగించాడు. [45]
ఐతిహాసిక విక్రమాదిత్యునితో పోలిక
[మార్చు]విక్రమాదిత్యుడు పురాతన భారతీయ సాహిత్యంలో పేర్కొన్న చక్రవర్తి. దాతృత్వం, ధైర్యం, పండితుల పోషణకూ అతను ప్రసిద్ధి చెందాడు. విక్రమాదిత్య ఇతిహాసాలలో కొన్ని రెండవ చంద్రగుప్తుని ఆధారంగా ఉన్నాయని అనేక మంది చరిత్రకారులు విశ్వసిస్తున్నారు. ఈ చరిత్రకారులలో DR భండార్కర్, VV మిరాషి, DC సిర్కార్ తదితరులు ఉన్నారు. [46] [47]
కొన్ని నాణేలు, సుపియా స్తంభ శాసనం ఆధారంగా, రెండవ చంద్రగుప్తుడు "విక్రమాదిత్య" అనే బిరుదును స్వీకరించాడని భావిస్తారు. [48] రాష్ట్రకూట రాజు గోవింద IV వేయించిన కాంబే, సాంగ్లి ఫలకాల్లో రెండవ చంద్రగుప్తునికి "సాహసాంకుడు" అనే బిరుదును ఉపయోగించారు. "సాహసాంక" అనే పేరు పురాణ విక్రమాదిత్యుడికి కూడా వర్తించబడింది.[49]
పురాణ విక్రమాదిత్యుడు శకులను ఓడించాడని చెబుతారు. అందువలన అతన్ని శకారి ("శకుల శత్రువు") అని కూడా అంటారు. రెండవ చంద్రగుప్తుడు పశ్చిమ క్షాత్రపులను (శకులలో ఒక శాఖ) ఓడించి మాళ్వాను జయించాడు; మధుర నుండి కుషాణులను బహిష్కరించాడు. ఈ విదేశీ తెగలపై అతను సాధించిన విజయాలు బహుశా ఆ కల్పిత పాత్రకు ఆపాదించబడి ఉండవచ్చు. తత్ఫలితంగా విక్రమాదిత్య ఇతిహాసాలు వచ్చాయి. [50] [51]
చాలా ఇతిహాసాల ప్రకారం, విక్రమాదిత్యుడి రాజధాని ఉజ్జయిని. అయితే కొన్ని ఇతిహాసాలు అతన్ని పాటలీపుత్ర రాజుగా పేర్కొన్నాయి. గుప్తులకు పాటలీపుత్రం రాజధానిగా ఉండేది. డి.సి. సిర్కార్ ప్రకారం, రెండవ చంద్రగుప్తుడు ఉజ్జయినిలో శకులను ఓడించి, తన కుమారుడు గోవిందగుప్తుడిని అక్కడ ప్రతినిధిగా ఉంచి ఉండవచ్చు. ఫలితంగా, ఉజ్జయిని గుప్త సామ్రాజ్యానికి రెండవ రాజధానిగా మారి ఉండవచ్చు. తదనంతరం, అతని గురించి (విక్రమాదిత్యుడిగా) ఇతిహాసాలు అభివృద్ధి చెంది ఉండవచ్చు. [52] [53] ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న ఒక చిన్న రాజవంశమైన గుత్తాలు, గుప్తుల వారసులమని చెప్పుకున్నారు. గుత్తాల చౌడదానపుర శాసనం ఉజ్జయిని నుండి పరిపాలించిన పురాణ విక్రమాదిత్యుడిని సూచిస్తుంది. అనేక గుత్త వంశపు రాజులకు "విక్రమాదిత్య" అని పేరు పెట్టారు. వసుంధర ఫిలియోజాట్ ప్రకారం, వారు పురాణ విక్రమాదిత్యుడిని ప్రస్తావించడానికి కారణం వారు అతనే రెండవ చంద్రగుప్తుడని భావించడమే. [54] అయితే, DC సర్కార్, పురాణ విక్రమాదిత్యుడికి రెండవ చంద్రగుప్తుడే ఆధారం అనడానికి ఇది మరింత రుజువని భావిస్తాడు. [55]
విక్రమ శకం
[మార్చు]సా.శ. 57 లో ప్రారంభమైన భారతీయ క్యాలెండరును విక్రమ శకం అంటారు. ఇది పౌరాణిక పాత్ర అయిన విక్రమాదిత్యుడితో ముడిపడి ఉంది. అయితే, 9వ శతాబ్దానికి ముందు ఈ పేరు ఉండేది కాదు. అప్పట్లో ఈ యుగాన్ని కృత, మాళవ తెగ యుగం లేదా సంవత్ అనీ అనేవారు. [56] [36] డి.సి. సిర్కార్, డి.ఆర్. భండార్కర్ వంటి పండితులు విక్రమాదిత్య అనే బిరుదును స్వీకరించిన రెండవ చంద్రగుప్తుడిపాలన తర్వాత ఆ యుగం పేరు "విక్రమ్ సంవత్"గా మారిందని భావిస్తున్నారు. [57]
మూలాలు
[మార్చు]- ↑ *మూస:British-Museum-db
- ↑ Doniger, Wendy (2009). The Hindus: An Alternative History (in ఇంగ్లీష్). p. 379. ISBN 9781594202056. Retrieved 2022-09-24.
- ↑ Prakash, Buddha (1962). Studies in Indian History and Civilization (in ఇంగ్లీష్). Shiva Lal Agarwala.
- ↑ Agrawal, Ashvini (1989). Rise and Fall of the Imperial Guptas (in ఇంగ్లీష్). Motilal Banarsidass Publ. p. 240 & 264. ISBN 978-81-208-0592-7.
- ↑ Raychaudhuri, Hem Channdra (1923). Political history of ancient India, from the accession of Parikshit to the extinction of the Gupta dynasty. Robarts - University of Toronto. Calcutta, Univ. of Calcutta. pp. 282–288.
- ↑ Annual Report Of Mysore 1886 To 1903.
- ↑ 7.0 7.1 7.2 Hermann Kulke & Dietmar Rothermund 2004, p. 91.
- ↑ Curta, Florin; Holt, Andrew (2016). Great Events in Religion: An Encyclopedia of Pivotal Events in Religious History [3 volumes] (in ఇంగ్లీష్). ABC-CLIO. p. 271. ISBN 978-1-61069-566-4.
- ↑ Curta, Florin; Holt, Andrew (28 November 2016). Great Events in Religion: An Encyclopedia of Pivotal Events in Religious History [3 volumes] (in ఇంగ్లీష్). ABC-CLIO. p. 271. ISBN 978-1-61069-566-4.
- ↑ 10.0 10.1 10.2 10.3 10.4 Upinder Singh 2008, p. 480.
- ↑ 11.0 11.1 R. C. Majumdar 1981, p. 63.
- ↑ 12.00 12.01 12.02 12.03 12.04 12.05 12.06 12.07 12.08 12.09 Tej Ram Sharma 1989, p. 148.
- ↑ R. C. Majumdar 1981, pp. 63–64.
- ↑ Dilip Kumar Ganguly 1987, pp. 5–6.
- ↑ A Comprehensive History of India: pt. 1. A.D. 300-985 (in ఇంగ్లీష్). People's Publishing House. 1981. p. 52.
- ↑ Upinder Singh 2008, p. 479.
- ↑ D. C. Sircar 1969, p. 139.
- ↑ R. C. Majumdar 1981, p. 51.
- ↑ Ashvini Agrawal 1989, p. 98.
- ↑ "Collections-Virtual Museum of Images and Sounds". vmis.in. American Institute of Indian Studies.
- ↑ Harry Falk 2004, p. 169.
- ↑ Harry Falk 2004, p. 171.
- ↑ Harry Falk 2004, pp. 168–171.
- ↑ R. C. Majumdar 1981, pp. 52–53.
- ↑ Hermann Kulke & Dietmar Rothermund 2004, p. 92.
- ↑ R. C. Majumdar 1981, p. 59.
- ↑ 27.0 27.1 27.2 27.3 27.4 R. C. Majumdar 1981, p. 53.
- ↑ Ashvini Agrawal 1989, p. 125.
- ↑ Tej Ram Sharma 1989, p. 77–78.
- ↑ 30.0 30.1 30.2 30.3 30.4 R. C. Majumdar 1981, p. 54.
- ↑ 31.0 31.1 31.2 R. C. Majumdar 1981, p. 55.
- ↑ R. C. Majumdar 1981, p. 56.
- ↑ 33.0 33.1 33.2 33.3 R. C. Majumdar 1981, p. 58.
- ↑ 34.0 34.1 34.2 34.3 34.4 34.5 34.6 34.7 R. C. Majumdar 1981, p. 62.
- ↑ 35.0 35.1 R. C. Majumdar 1981, p. 52.
- ↑ 36.0 36.1 36.2 M. Srinivasachariar (1974). History of Classical Sanskrit Literature. Motilal Banarsidass. pp. 94–111. ISBN 9788120802841.
- ↑ Kailash Chand Jain 1972, pp. 162–163.
- ↑ 38.0 38.1 Vasudev Vishnu Mirashi; Narayan Raghunath Navlekar (1969). Kalidasa: Date, Life And Works. Popular. pp. 8–29. ISBN 978-81-7154-468-4.
- ↑ D. C. Sircar 1969, pp. 120–123.
- ↑ Vasudev Vishnu Mirashi and Narayan Raghunath Navlekar (1969). Kālidāsa; Date, Life, and Works. Popular Prakashan. pp. 1–35. ISBN 9788171544684.
- ↑ Chandra Rajan (2005). The Loom of Time. Penguin UK. pp. 268–274. ISBN 9789351180104.
- ↑ R. C. Majumdar 1981, p. 61.
- ↑ 43.0 43.1 43.2 43.3 43.4 Upinder Singh 2008, p. 505.
- ↑ Harry Falk 2004, pp. 169–173.
- ↑ Ashvini Agrawal 1989, pp. 24–27.
- ↑ Kailash Chand Jain 1972, pp. 157, 161.
- ↑ Vasudev Vishnu Mirashi; Narayan Raghunath Navlekar (1969). Kalidasa: Date, Life And Works. Popular. pp. 8–29. ISBN 978-81-7154-468-4.
- ↑ D. C. Sircar 1969, p. 130.
- ↑ Kailash Chand Jain 1972, p. 162.
- ↑ Alf Hiltebeitel (2009). Rethinking India's Oral and Classical Epics. University of Chicago Press. pp. 254–275. ISBN 9780226340555.
- ↑ Maurice Winternitz; Moriz Winternitz (1963). History of Indian Literature. Motilal Banarsidass. p. 42. ISBN 978-81-208-0056-4.
{{cite book}}
: ISBN / Date incompatibility (help) - ↑ Kailash Chand Jain 1972, pp. 158–159, 164.
- ↑ D. C. Sircar 1969, p. 131.
- ↑ Vasundhara Filliozat (1995). The Temple of Muktēśvara at Cauḍadānapura. Indira Gandhi National Centre for the Arts / Abhinav. p. 7. ISBN 978-81-7017-327-4.
- ↑ D. C. Sircar 1969, p. 136.
- ↑ Ashvini Agrawal 1989, pp. 174–175.
- ↑ D. C. Sircar 1969, p. 165–166.