రెండవ ట్రంప్ పరిపాలనలో సుంకాలు

డోనాల్డ్ ట్రంప్ రెండవ అధ్యక్ష పదవిలో అమలు చేసిన సుంకాలు, అమెరికా సంయుక్త రాష్ట్రాల రక్షణవాద వాణిజ్య విధానాలలో తీవ్రమైన పెరుగుదలను సూచించాయి. అమెరికాకు దిగుమతి అవుతున్న దాదాపు అన్ని వస్తువులపై వరుస సుంకాలను ప్రకటించాడు. జనవరి నుండి ఏప్రిల్ 2025 వరకు, శతాబ్దంలోనే అత్యధికంగా, సగటు సుంకం 2% నుండి 24% కి పెరిగింది.[1]
చైనాతో కొనసాగుతున్న వాణిజ్య యుద్ధాన్ని ట్రంప్ తీవ్రతరం చేశ్తూ, చైనా దిగుమతులపై సుంకాలను ఏప్రిల్ 9,2025 తర్వాత 145% కు పెంచాడు.[2] కెనడా, మెక్సికో దేశాల నుండి చాలా వస్తువులపై 25% సుంకాన్ని విధించి, మరొక వాణిజ్య యుద్ధాన్ని కూడా ప్రారంభించాడు, అయినప్పటికీ, కొన్ని వస్తువులకు నిరవధిక మినహాయింపులను మంజూరు చేశాడు. దేశీయ తయారీకి మద్దతు ఇస్తూ, నిషేధిత మాదకద్రవ్యాల అక్రమ రవాణా, అక్రమ వలసలకు దేశాలను జవాబుదారీగా ఉంచే మార్గంగా ట్రంప్ ఈ చర్యలను సమర్థిస్తున్నారు.[3][4] దీని తరువాత, అన్ని దేశాల నుండి దిగుమతయ్యే ఉక్కు, అల్యూమినియం, ఆటోమొబైల్స్ పై 25% సుంకాన్ని విధించాడు, ఆటో విడిభాగాలపై సుంకాలు పెట్టే యోచనలో కూడా ఉన్నారు.
ఏప్రిల్ 2ను అతను "లిబరేషన్ డే" అని పిలుస్తూ, యుఎస్ దిగుమతులపై కనీసం 10% సుంకాన్ని విధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశాడు. 57 దేశాల నుండి దిగుమతులపై 11 నుండి 50 శాతం వరకు సుంకాలు ఏప్రిల్ 9 నుండి అమలులోకి రావాల్సి ఉండగా, చైనా మినహా అన్ని దేశాలకు 90 రోజుల పాటు నిలిపివేసారు. 10% సుంకం మాత్రం ఇంకా అమలులో ఉంది.[5]
"పరస్పర సుంకాలు" అని పిలవబడే ఈ సుంకాలు అమ్రెరికా వాణిజ్య భాగస్వాముల నుండి ప్రతీకారానికి, స్టాక్ మార్కెట్ పతనానికి దారితీసాయి.[6][7][8][9][10][11] ట్రంప్ పరిపాలన యొక్క పరస్పర సుంకం సూత్రాల ప్రకారం, ఇతర దేశాలతో ఉన్న వాణిజ్య లోటును హానికరంగా పరిగణించి వాటిని తొలగించాలని భావిస్తారు.[12] ఈ సూత్రాలలో ఉదహరించబడిన ఆర్థికవేత్తలు తమ పరిశోధనను ట్రంప్ ప్రభుత్వం తప్పుగా అర్థం చేసుకుందని చెప్పారు.[13][14] ఈ సుంకాలు పరస్పరం కాదని, ఏకపక్ష రక్షణాత్మక సుంకాలు అని మీడియా సంస్థలు వాదించాయి.[15] ఫెడరల్ రిజర్వ్ జిడిపి వృద్ధి అంచనాలను తగ్గించడానికి, మాంద్యాన్ని పెంచడానికి సుంకాలు దోహదపడ్డాయి.
మూలాలు
[మార్చు]- ↑ "Tariff pause does not mean U.S. avoided growth slowdown, says Citi". Business Insider (in ఇంగ్లీష్). April 9, 2025. Retrieved April 10, 2025.
- ↑ Swanson, Ana (April 10, 2025). "Trump Has Added 145% Tariff to China, White House Clarifies". The New York Times (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0362-4331. Retrieved April 10, 2025.
- ↑ Ortiz, Erik (March 4, 2025). "Trump says tariffs were enacted to curb fentanyl, but U.S. overdose deaths are already declining". NBC New York (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved March 10, 2025.
- ↑ Price, Michelle L. (March 6, 2025). "How Trump justifies his tariffs — from budget balancing to protecting 'the soul' of America". AP News (in ఇంగ్లీష్). Retrieved March 10, 2025.
- ↑ Mangan, Dan; Breuninger, Kevin; Cox, Jeff; Wilkie, Christina; Doherty, Erin; Iordache, Ruxandra (April 9, 2025). "Trump raises China tariffs to 125% but announces 90-day pause for others: Live updates". CNBC (in ఇంగ్లీష్). Retrieved April 9, 2025.
- ↑ "Trump takes America's trade policies back to the 19th century". The Economist. April 3, 2025. Archived from the original on April 6, 2025. Retrieved April 6, 2025.
- ↑ Dorn, Sara. "Trump's Tariff Formula Slammed As 'Fake' And 'Incredibly Stupid' By Experts". Forbes (in ఇంగ్లీష్). Retrieved April 4, 2025.
- ↑ Goldman, David (April 3, 2025). "This is the dubious way Trump calculated his 'reciprocal' tariffs". CNN. Retrieved April 4, 2025.
- ↑ Schneid, Rebecca (April 3, 2025). "Why Economists Are Horrified by Trump's Tariff Math". TIME (in ఇంగ్లీష్). Retrieved April 4, 2025.
- ↑ Ma, Jason. "Warren Buffett keeps taking investors to school as stock meltdown reveals the uncanny wisdom of his recent moves". Fortune (in ఇంగ్లీష్). Retrieved April 6, 2025.
- ↑ Sherter, Alain (April 5, 2025). "Stock market rout deepens as Dow plunges more than 2,200 points and Nasdaq enters bear market". CBS News. Retrieved April 5, 2025.
- ↑ Swanson, Ana (April 5, 2025). "What to Know About Trump's New Tariffs". The New York Times. Archived from the original on April 6, 2025. Retrieved April 6, 2025.
- ↑ Weissmann, Jordan (April 6, 2025). "The White House cited these economists to justify its tariffs. They aren't thrilled". Yahoo Finance. Archived from the original on April 5, 2025. Retrieved April 6, 2025.
- ↑ Neiman, Brent (April 7, 2025). "Why Trump's Tariff Math Is a Joke". Opinion. The New York Times (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0362-4331. Retrieved April 7, 2025.
- ↑ "What's really behind Trump's 'reciprocal' tariffs?". Deutsche Welle. April 8, 2025. Retrieved April 9, 2025.