రెక్టస్ ఉదర కండరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూస:Muscle infobox రెక్టస్ ఉదర కండరం (Rectus abdominis muscle) ఉదర భాగంలోని జత కండరాలు. ఇది మానవ ఉదర పూర్వాంత కుఢ్యాలకు ఇరువైపులా ప్రయాణిస్తుంది. ఇవి రెండు సమాంతర కండరాలుగా ఉండి, సంధాయక కణజాలపు మధ్య పట్టీలతో వేరుచేయబడుతుంది. దీనినే లీనియా ఆల్బా (వైట్ లైన్) అంటారు. ఇది జఘన సంధాయకం/ ప్యూబిక్ క్రెస్ట్ వెలుపలి భాగం నుండి అధో ఉరోస్థి/జిఫోయిడ్ ప్రాసెస్, మరియు చివరి పర్శుకల మృదులాస్థి (5-7) వెలుపలి భాగం వరకు వ్యాపిస్తుంది.

ఇది రెక్టస్ ఫలకంలో ఉంటుంది.

రెక్టస్ సాధారణంగా మూడు తంతుయుత పట్టీలు చేత అడ్డంగా విభజింపబడి, టెండినస్ ఇన్‌స్క్రిప్షన్సుతో సంధానింపబడి ఉంటుంది. పొట్టలోని రెక్టస్ కండరపు సాధారణ ఆకృతి " సిక్స్ ప్యాక్ " గా ఉంటుంది. ఇది శరీర నిర్మాణ రీత్యా అరుదుగా కొంత తేడాతో, ఎనిమిది ("ఎయిట్ ప్యాక్" ), పది లేదా అసౌష్టవంగా అమరిన విభాగాలుగా కూడా ఉంటుంది. వేరు వేరుగా అమరి ఉన్నప్పటికీ, అవి చేసే పనుల రీత్యా సమానమైనవే.

విధి[మార్చు]

ఉదర రెక్టస్ కండరము ముఖ్యమైన సౌష్టవకండరము. "గబగబా నడిచేటప్పుడు" కశేరుకంటకం అటూ ఇటూ కదిలేందుకు ఇది సహకరిస్తుంది. పొత్తి కడుపు చుట్టూ ఉండే అస్థి పంజరం స్థిరంగా ఉన్నప్పుడు, ఉరఃపంజరం దాని నుండి మొదలవుతుంది. లేదా ఉరః పంజరం స్థిరంగా ఉన్నప్పుడు పొత్తి కడుపు చుట్టూ ఉండే అస్థి పంజరం, ఉరః పంజరం (పోస్టీరియర్ పెల్విక్ టిల్ట్) వద్దకు తీసుక రాబడుతుంది. ఒక ప్రదేశంలో స్థిరంగా ఉంచకపోయినట్లయితే, ఈ రెండూ ఒకే సమయంలో ఒక దానికొకటి దగ్గరగా వస్తాయి.

ఉదర రెక్టస్ కండరం శ్వాసించడానికి సహకరిస్తుంది. రోగి శ్వాస సరిగా పీల్చుకోలేక పోయినప్పుడు శ్వాస క్రియలో ఇది ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఇది శరీరాంతర్గత అవయావాలకు రక్షణ కలిగిస్తుంది. వ్యాయామం చేసేటప్పుడు, బరువైన వస్తువులను ఎత్తేటప్పుడు, ముక్కుతూ మల విసర్జన చేసేటప్పుడూ, లేదా (శిశు జనన) సమయంలో ఇది ఉదరాంతర భాగంలో తగిన ఒత్తిడిని కలిగిస్తుంది.

రక్త ప్రసరణ[మార్చు]

ఉదర రెక్టస్ కండరానికి వివిధ ధమనుల నుండి రక్తం సరఫరా అవుతుంది. పునర్నిర్మాణ శస్త్ర చికిత్సా పదజాలంలో, దీనిని మేత్స్, నెహే[1], రెండు బహిర్గత కాడలతో ఉన్న మూడవ రకపు కండరం అంటారు. ఒకటవది, అధో జఠర ధమని, మరియు సిర (లేదా సిరలు) ఉదర రెక్టస్ కండరపు పూర్వాంత తలం మీదుగా ఇది ప్రయాణించి, ఆర్క్యుయేట్ లైన్ వద్ద రెక్టస్ ఫాసియాను కలుస్తుంది. ఇది కండర లోపలి భాగానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది. రెండవది, ఊర్ధ్వ జఠర ధమని అనేది, అంతర్గత ఉరః ధమని చివరి శాఖ. ఇది పై భాగానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది. చివరిది, దిగువనున్న పర్శుకాంతర ధమనుల నుండి అనేక చిన్న రక్తనాళాలు తయారై, అవి మిగిలిన భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తాయి.

అంతర్వర్తనం[మార్చు]

ఉరః ఉదర నాడులు, కండరాలలోకి అంతర్వర్తనం చెందుతాయి. ఇవి రెక్టస్ ఫలకపు పరాంత త్వచంలోకి చొచ్చుకొని పోతాయి.

ప్రదేశం[మార్చు]

ఉదర రెక్టస్ కండరం పొడవయిన చదును కండరం. ఇది ఉదరపు ముందు భాగం పొడవునా వ్యాపించి ఉండి, తనకు రెండవ వైపు నున్న మరో భాగంతో, లినియా ఆల్బా ద్వారా విడదీయ బడి ఉంటుంది. ఈ కండరం అసమ పరిమాణాలలో ఉన్న మూడు భాగాలుగా విడిపోయి, ఐదవ, ఆరవ, ఏడవ పర్శుకల మృదులాస్థులలోనికి చొప్పించబడుతుంది. పై భాగం ఐదవ పర్శుక మృదులాస్థితో కలప బడుతుంది. ఇలా పర్శుకలోకి చొప్పించడానికి వీలుగా, పరాంతరపు కొసలోనున్న పర్శుకలోనే కొన్ని తంతువులు వుంటాయి.

కొన్ని సందర్భాలలో కొన్ని తంతువులు, అధో ఉరోస్థి వైపుకు, మరియు కోస్టాక్సిఫాయిడ్ లిగమెంట్సుతో కలపబడి ఉంటాయి.

నష్టం[మార్చు]

ఉదర కండర అలసటనే, ఉదర కండర ఒత్తిడి అని కూడ అంటారు. ఇది ఉదర కుడ్యములోని ఏదైనా ఒక కండరానికి గాయమైనపుడు ఏర్పడుతుంది. కండరాన్ని ఎక్కువగా సాగదీసినపుడు కండర అలసట కలుగుతుంది. కండర తంతువులు నలిగిపోయినపుడు ఇది కలుగుతుంది. సాధారణంగా, అలసట వలన కండరంలో సూక్ష్మమైన గాయాలు ఏర్పడుతాయి. కొన్నిసందర్భాలలో, తీవ్రమైన గాయాలు ఏర్పడినపుడు అది దాని సంధాయకం నుండి తెగిపోతుంది.

జంతువులు[మార్చు]

ఎ ఫెలైన్ రెక్టస్ అబ్జామినస్ మజిల్, ఫ్రమ్ ఎ కామన్ హౌస్‌క్యాట్.ఈ స్పెసిమెన్ కొంత పాసియాను కలిగి ఉంది మరియు ఇది బాహ్య వక్రతలను కూడా కలిగి ఉంది.

ఉదర రెక్టస్ కండరం వెన్నుముక కల జీవులన్నింటిలోనూ ఒకే విధంగా ఉంటుంది. జంతువుల కండర సముదాయానికి,, మనుషుల కండర సముదాయానికి సాధారణంగా కనిపించే తేడా ఏమిటంటే, జంతువులలో వివిధ సంఖ్యలో టెండియస్ ఇంటర్‍సెక్షన్లు కనిపించడమే.

అదనపు చిత్రాలు[మార్చు]

సూచనలు[మార్చు]

  1. మాథెస్ SJ, నహాయ్ F. వాస్కులర్ అనాటమీ ఆఫ్ మజిల్స్, ఎక్స్‌పెరిమెంటల్ అండ్ క్లినికల్ కోర్రిలేషన్ ప్లాస్ట్ రికాన్స్టర్ సర్జ్. Feb 1981;67(2):177-87.

బయటి లింకులు[మార్చు]

మూస:Muscles of trunk