రెడ్డి పాలెమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రెడ్డి పాలెమ్
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం రొంపిచెర్ల
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 522601
ఎస్.టి.డి కోడ్

రెడ్డిపాలం గ్రామం గుంటూరు జిల్లా నరసరావు పేట తాలూకా రొంపిచెర్ల మండలంలో ఉంది. రొంపిచెర్ల నుంచి 6 మైళ్ళు దూరంలో రెడ్డిపాలం గ్రామం ఉంది.రెడ్డిపాలం గ్రామాన్ని విప్పర్ల రెడ్డిపాలం గ్రామం అని కూడా పిలుస్తారు.రెడ్డిపాలం గ్రామం జనాభా: 6000 ఇక్కడ ప్రజలు ముఖ్యంగా వ్యయసాయం మీద జీవనం సాగిస్తారు. ముఖ్యంగా పండు పంటలు: వరి, మిర్చి, కాటన్

రెడ్డి పాలెం గ్రామంలో ఉన్న దేవాలయములు

1) పోలేరు అమ్మవారి దేవాలయము 2) వినాయకుడి దేవాలయము 3) పెద రామాలయము 4) చిన్న రామాలయము 5) చర్చ్ 6) పోతులూరి వీర బ్రహ్మం గారి దేవాలయము

పాఠశాలలు

1) ఎలిమెంటరి స్కూల్ 2) ఉన్నత పాఠశాల

విశేషాలు[మార్చు]

రెడ్డిపాలం గ్రామంలో విద్యాభివృద్ధి వేంకటేశ్వర రెడ్డి మాస్టారు, అల్లటిపల్లి వెంకట రెడ్డి మాస్టారు, మంతిర్రాజు సత్యనారాయణ మాస్టారు, కందుకూరి మెరి రోజా టీచర్, గజ్జల కొండా రెడ్డి మాస్టారు, సత్యనారాయణ రెడ్డి మాస్టారు, ప్రసాదరావు మాస్టారు, మంతిర్రాజు క్రిష్న మూర్తి మాస్టారు, మంతిర్రాజు శివరామయ్య మాస్టారు, పాముల రెడ్డి మాస్టారు, తిమ్మయ్య మాస్టారు, పూర్ణానందం మాస్టారు, జయప్రద టీచర్ మొదలైన వారి అందరి కృషి చాలా చాలా అభినందనీయము. ఇక్కడ చదివిన వాళ్ళు అందరు గుర్తు పెట్టు కొవాల్సీన మహానుభావులు ఈ మాస్టార్లు. రెడ్డిపాలం గ్రామంలో మొదట్లో 7వ తరగతి వరకు మాత్రమే ఉండేది. ఆ పై చదువులు చదవాలి అంటే ప్రక్కనే 5 కిలోమీటర్లు దూరంలో ఉన్న సంత గుడిపాడు వెళ్ళ వలసి వచ్చేది. ఆ రోజుల్లో రవాణా సౌకర్యాలయము సరిగ్గా ఉండేది కాదు. కనుక, అందరు విద్యార్ఠులు సైకిల్ మీద సంత గుడిపాడు వెళ్ళి వచ్చే వారము. రెడ్డిపాలం గ్రామానికి 1983లో 10వ తరగతి నడుపుటకు ప్రభుత్వము అనుమతి ఇచ్చింది. ఈ అనుమతికి మా స్కూల్ మాస్టార్లు చేసిన కృషి మరువ లేనిది, మరువ రానిది. ఇక్కడ స్కూల్ లో చదివిన విద్యార్థులు చాలా మంది విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్నారు. చాలా మంది స్వదేశంలో మంచి ఉద్యోగాలలో ఉన్నారు. వీరి అందరి కృషి వెనక మా స్కూల్ మాస్టార్లు శ్రమ ఉంది అని ఇక్కడ మరొక్క సారి చెప్పాలి. చుట్టూ పచ్చగా ఉండే, స్వచ్ఛంగా ఉండే రెడ్డిపాలం అంటే మా ఊరి వాళ్ళంతా ఇప్పటికి, ఎప్పటికి ఇష్ట పడతారు.మూలాలు[మార్చు]

యితర లింకులు[మార్చు]